Begin typing your search above and press return to search.

వీకెండ్ వైబ్స్.. గ్లామర్ తో గత్తరలేపుతున్న రామ్ చరణ్ బ్యూటీ!

బీహార్లోని మౌంట్ కార్మెల్ ఉన్నత పాఠశాలలో చదువును పూర్తి చేసిన ఈమె.. న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్ కాలేజీలో ఫ్యాషన్ డిజైన్ కోర్సు పూర్తి చేసింది.

By:  Tupaki Desk   |   9 Jun 2026 11:59 AM IST
వీకెండ్ వైబ్స్.. గ్లామర్ తో గత్తరలేపుతున్న రామ్ చరణ్ బ్యూటీ!
X

కొంచెం అందం.. ఇంకాస్త పొగరు.. ఓరచూపులతో కుర్రకారు గుండెల్లో గుణపం దించుతూ గ్లామర్ వలకబోయడంలో తన తర్వాతే ఎవరైనా అని నిరూపిస్తూ.. అందరి హృదయాలను దోచుకుంటూ కవ్విస్తున్న రామ్ చరణ్ బ్యూటీ గురించి పరిచయాల ప్రత్యేకంగా అవసరం లేదు. బీహార్ లోని బాగల్ పూర్ లో 1987 నవంబర్ 21న ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్త ఆయన అజిత్ శర్మకు జన్మించింది నేహా శర్మ. బీహార్లోని మౌంట్ కార్మెల్ ఉన్నత పాఠశాలలో చదువును పూర్తి చేసిన ఈమె.. న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్ కాలేజీలో ఫ్యాషన్ డిజైన్ కోర్సు పూర్తి చేసింది.

చిన్నప్పటినుంచే ఇండస్ట్రీలోకి రావాలని కలలు కన్న ఈమె.. మోడల్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి, ఆ తర్వాత 2007లో మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైన తొలిమూవీ చిరుత సినిమా ద్వారా తొలిసారి ఇండస్ట్రీకి పరిచయమైంది. ఇందులో తన నటనతో, ఆటిట్యూడ్ తో అందరి దృష్టిని ఆకట్టుకుంది. అమ్మాయి అంటే ఇలా ఉండాలి అని యువతను విపరీతంగా ఆకట్టుకుంది ఈ స్టైలిష్ ముద్దుగుమ్మ నేహా శర్మ. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో ఈమె నటనకు మంచి మార్కులే పడ్డాయి.

ఈ చిత్రం తర్వాత ఆనందీ ఆర్ట్ క్రియేషన్స్ పతాకం పై పీ కిరణ్ నిర్మించిన కుర్రాడు అనే సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించింది. గుణ్ణం సందీప్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వరుణ్ సందేశ్ హీరోగా నటించారు. ఇక ఈ సినిమా కూడా పరవాలేదనిపించుకుంది. ఆ తర్వాత తెలుగు తెరకు దూరమైన ఈమె 2010లో క్రూక్: ఇట్స్ గుడ్ టు బి బ్యాడ్ అనే చిత్రంతో హిందీ పరిశ్రమకు పరిచయమైంది. ఇక అప్పటి నుంచి వరుసగా హిందీలోనే సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న నేహా శర్మ.. ఇప్పుడు మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఇటు ఫాలోవర్స్ ను పలకరించే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే తాజాగా మరో లేటెస్ట్ ట్రెండీ ఔట్ఫిట్ తో ఆడియన్స్ ముందుకు వచ్చింది ఈ ముద్దుగుమ్మ.

వీకెండ్ వైబ్స్ అంటూ గ్లామర్ ఫోటోలను షేర్ చేసింది. ఒకవైపు జిమ్లో కష్టపడి పోతూనే హాట్ అందాలతో రెచ్చగొట్టిన ఈమె మరికొన్ని ఫోటోలలో రెస్టారెంట్ కి సంబంధించిన ఫోటోలను అలాగే వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను అభిమానులతో పంచుకుంది. ఇష్టమైన ఫుడ్డు తింటూ.. స్నేహితుల మధ్య వర్షాకాలాన్ని ఎంజాయ్ చేస్తూ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ ఫోటోలకి కొంచెం ఇది కొంచెం అది అంటూ క్యాప్షన్ జోడించింది. ఏది ఏమైనా నేహా శర్మ లేటెస్ట్ వీకెండ్ వైబ్స్ ఫోటోలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.