స్విమ్ సూట్‌లో శర్మా గాళ్ కవ్వింత మిస్ ఫైర్
నేహా శర్మ ఇటీవల తనపై జరుగుతున్న ఫేక్ ప్రచారాన్ని ఖండించింది. తన కంటెంట్ ని మీడియాలో పోస్ట్ చేయొద్దంటూ హెచ్చరిస్తూ తాను కాపీ రైట్ చట్టాన్ని అనుసరిస్తున్నట్టు మీడియాలో ప్రచారం సాగుతోంది.
By: Sivaji Kontham | 26 Nov 2025 10:33 PM ISTఇటీవలి కాలంలో అందాల కథానాయికలు వేడెక్కించే ఫోటోషూట్లతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సంగతి తెలిసిందే. వరుస ఫోటోషూట్లు, వీడియో షూట్లతో విరుచుకుపడటంలో చిరుత బ్యూటీ నేహా శర్మ తక్కవేమీ కాదు. నేటి జెన్ జెడ్ నటీమణులకు పోటీనిస్తూ నేహా శర్మ రెగ్యులర్ గా తన ఇన్ స్టాలో వేడి పెంచే ఫోటోషూట్లతో విరుచుకుపడుతోంది. ఇప్పుడు మరోసారి బో* ఫోటోషూట్ ని షేర్ చేసింది. నేహా టాప్ యాంగిల్ లో తన అందాలను సెల్ఫీ తీసింది. దానిని నేరుగా ఇన్ స్టా వేదికగా పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ గా మారుతోంది.
``నీలి ఆకాశం, మృధువైన కాంతి మరియు నా మండే స్విమ్ వేర్..`` అనే అందమైన ట్యాగ్ ని ఈ ఫోటోషూట్ కి జోడించింది. శీర్షికతోపాటు లవ్ ఈమోజీని కూడా జోడించింది నేహా. నిజానికి చిరుత బ్యూటీ స్విమ్ వేర్ పోస్ట్ లు షేర్ చేయడం ఇదే తొలిసారి కాదు. ఇన్ స్టాలో రెగ్యులర్ గా ఇలాంటి ఫీడ్ ని షేర్ చేస్తూనే ఉంది ఈ బ్యూటీ. ఈ కొత్త ఫోటోషూట్ కి నెటిజనుల నుంచి స్పందన అంతే వేగంగా ఉంది. నేహా టూ గ్లామరస్ గా ఉందంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. మరీ ఇంత టూమచ్ గా టీజ్ చేయడం సరికాదని బోయ్స్ వేడుకుంటున్నారు. నేహా యూనిక్ ఫోటోషూట్ ని వేగంగా వైరల్ చేస్తున్నారు.
ఎవరో నాలాగా నటిస్తున్నారు..
నేహా శర్మ ఇటీవల తనపై జరుగుతున్న ఫేక్ ప్రచారాన్ని ఖండించింది. తన కంటెంట్ ని మీడియాలో పోస్ట్ చేయొద్దంటూ హెచ్చరిస్తూ తాను కాపీ రైట్ చట్టాన్ని అనుసరిస్తున్నట్టు మీడియాలో ప్రచారం సాగుతోంది. అయితే తాను ఎవరికీ ఇలాంటి హెచ్చరికలు పంపలేదని నేహా అంటోంది. తన ఇన్‌స్టాగ్రామ్ కథనం ద్వారా నేహా ఈ విషయంపై వివరణ ఇచ్చింది. ఆ వాదనలు పూర్తిగా అబద్ధం అని పేర్కొంది. కాపీరైట్ సమస్యలను ప్రస్థావిస్తూ ఒక నకిలీ వ్యక్తి ఇలా చేస్తున్నారని అన్నారు. ఎవరో తనలాగా నటిస్తున్నారంటూ నేహా శర్మ ఆరోపించారు. తన కంటెంట్‌ను పోస్ట్ చేయకుండా ఏ మీడియా సంస్థను తాను నియంత్రించలేదని శర్మా గాళ్ స్పష్టం చేసింది.
మరోవైపు బీహార్ ఎన్నికలు 2025లో తన తండ్రి భాగల్పూర్ అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే బిజెపి అభ్యర్థి రోహిత్ పాండే ఆయనను ఓడించారు. తన తండ్రి గెలుపు కోసం నేహా నియోజకవర్గంలో చాలా తిరిగి ప్రచారం చేసారు. కానీ ఇది కలిసి రాలేదు. అయితే ఈ ప్రచారం సమయంలోనే భవిష్యత్తులో రాజకీయాల్లోకి రావాలనే తన కోరికను నేహా ఒక మీడియా ఇంటర్వ్యూలో వ్యక్తం చేశారు.
నేహా శర్మ 2007 లో రామ్ చరణ్ సరసన తెలుగు చిత్రం చిరుతతో కథానాయికగా ఆరంగేట్రం చేసింది. తర్వాత 2010 లో క్రూక్ చిత్రంతో బాలీవుడ్ లో అడుగుపెట్టింది. క్యా సూపర్ కూల్ హై హమ్, యమ్లా పగ్లా దీవానా 2, యంగిస్తాన్, తుమ్ బిన్ 2, తన్హాజీ: ది అన్సంగ్ వారియర్, బాడ్ న్యూస్ తదితర చిత్రాలలో నటించింది.
