చిరుత పిల్లలా సమంత కూడా షాక్!
ఈ నేపథ్యంలో తాజాగా సమంత కూడా దర్శకు రాలిగా కొత్త టర్నింగ్ తీసుకుంటుందనే ప్రచారం మొదలైంది. సామ్ సొంతంగా ఓ బ్యూటీఫుల్ లవ్ స్టోరీ సిద్దం చేసుకుదని వినిపిస్తోంది.
By: Tupaki Desk | 24 Aug 2025 5:00 AM IST`చిరుత` లో హీరోయిన్ గా నటించిన నేహాశర్మ డైరెక్టర్ గా కెప్టెన్ కుర్చీ ఎక్కి షాక్ ఇచ్చింది. బాలీవుడ్ లో ఏ కంగా సిద్దాంత్ చతుర్వేది, మోహిత్ రైనా నే డైరెక్ట్ చేయడానికి రెడీ అయింది. నిన్న మొన్నటి వరకూ ఇన్ స్టాలో హీటెక్కించే భంగిమలతో అలరించిన బ్యూటీ ట్రాన్సపర్మేషన్ చూసి నెటి జనులు సైతం షాక్ అయ్యారు. అదీ భారీ పీరియాడిక్ కథనే డీల్ చేయడానికి సంకల్పించింది. ఈ చిత్రాన్ని స్టార్ హీరో అజయ్ దేవగణ్ నిర్మించడం మరో విశేషం. ఇలా చిరుత పిల్ల విషయంలో ప్రతీది సర్ ప్రైజింగ్ గానే అనిపిస్తుంది.
లవ్ స్టోరీతో ముందుకా:
ఇదే తరహాలో సమంత కూడా ప్లాన్ చేస్తోందా? అంటే అవుననే లీకులందుతున్నాయి. `ఖుషీ` తర్వాత సమంత హీరోయిన్ గా సినిమా చేయని సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో ఓ రెండు సిరీస్ లు కమిట్ అయినా? అవి ఇప్పుడే రిలీజ్ అయ్యేవి కాదు. ఇప్పటికే తాను కూడా ట్రాలాలా పేరుతో స్వయంగా నిర్మాణ సంస్థను స్థాపించింది `శుభం` చిత్రాన్ని నిర్మించింది. ఈ నేపథ్యంలో తాజాగా సమంత కూడా దర్శకు రాలిగా కొత్త టర్నింగ్ తీసుకుంటుందనే ప్రచారం మొదలైంది. సామ్ సొంతంగా ఓ బ్యూటీఫుల్ లవ్ స్టోరీ సిద్దం చేసుకుదని వినిపిస్తోంది.
కొత్త నటీనటులతో:
కొంత మంది యువ నటీనటులతో ఈ కథను తెరకెక్కించాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలిసింది. దర్శ కురాలిగా అనుభవం లేకపోవడంతో? `శుభం` చిత్రానికి పని చేసిన టీమ్ సహాయకులుగా నియమిం చుకుని కెప్టెన్ కుర్చీ ఎక్కాలనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఎలాగూ సొంత నిర్మాణ సంస్థలోనే కాబట్టి? తనదే అంతిమ నిర్ణయం అవుతుంది. మరి ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాలి. రెండేళ్లగా సమంత సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అవకాశాలు రాక నటించలేదు ? అన్న ప్రచారాన్ని ఇటీవలే ఖండించింది.
కొత్త ప్రయాణం నిజమేనా:
అంతకు ముందే నిర్మాతగానూ అవతరించింది. ఇప్పుడేమో క్రియేటివ్ రంగంలో ఎంటర్ అవుతుందనే ప్రచారం ఇంట్రెస్టింగ్. ఇదే సాధ్యమైతే గనుక సమంత కెరీర్ కొత్త టర్నింగ్ తీసుకున్నట్లే. హీరోయిన్లు దర్శకులు అయింది సినిమా చరిత్రలో పెద్దగా లేదు. చాలా మంది హీరోయిన్లగానే రిటైర్మెంట్ తీసుకు న్నారు. మరికొంత మంది నిర్మాణం సహా ఇతర రంగాల్లో రాణించినా? పీక్స్ కి చేరిన వారంటూ ఎవరూ లేరు. నిర్మాణం పరంగా సమంత జర్నీ కూడా సీరియస్ గానే సాగుతుంది. ప్రస్తుతం నిర్మాతగా కొత్త ప్రాజెక్ట్ లు ప్లాన్ చేసుకుంటోంది.
