Begin typing your search above and press return to search.

7 అడుగుల విదేశీ ప్రియుడితో 'చిరుత' బ్యూటీ

ఇటీవల నేహా శ‌ర్మ త‌న‌ భాగస్వామి పీటర్ స్లిస్కోవిచ్‌తో బాంద్రాలోని ఒక రెస్టారెంట్ నుండి బయటకు వెళుతూ కెమెరా కంటికి చిక్కింది.

By:  Tupaki Desk   |   24 May 2025 11:59 AM IST
7 అడుగుల విదేశీ ప్రియుడితో చిరుత బ్యూటీ
X

అత‌డేమో 7 అడుగులు.. ఆమె 4.5 అడుగులు.. కానీ ఆ ఇద్ద‌రి మ‌ధ్యా డేటింగ్ వ్య‌వ‌హారం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ఇది స్నేహ‌మో మోహ‌మో ప్రేమో తెలీదు కానీ, ఆ ఇద్ద‌రూ ఓ చోట చేరి ర‌చ్చ చేస్తుంటే, అస‌లు ఈ జంట చాలా వింత‌గా ఆస‌క్తిగా ఉందంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.


పైవాడు ఎవ‌రికి ఏది రాసి పెట్టాడో ఎవ‌రికి ఎరుక? అందుకే ఈ జంట ఇలా కుదిరింది. ఇంత‌కీ ఇది కేవ‌లం స్నేహమేనా? డేటింగ్ కూడానా? అంటే ఏమో.. అది కూడా ఆ ఇద్ద‌రే తెగేసి చెప్పాలి! ప్ర‌స్తుతానికి ఈ జంట సెల‌బ్రేష‌న్ మోడ్ లో ఉంది. చిరుత ఫేం నేహా శ‌ర్మ చాలా కాలంగా విదేశీ బోయ్ ఫ్రెండ్ తో షికార్లు చేస్తున్న ఫోటోలు, వీడియోలు ఇంట‌ర్నెట్ లో సంద‌డి చేస్తున్నాయి. ఇప్పుడు మ‌రోసారి కొత్త వీడియో ఇంట‌ర్నెట్ ని మ‌రిగిస్తోంది.

ఇటీవల నేహా శ‌ర్మ త‌న‌ భాగస్వామి పీటర్ స్లిస్కోవిచ్‌తో బాంద్రాలోని ఒక రెస్టారెంట్ నుండి బయటకు వెళుతూ కెమెరా కంటికి చిక్కింది. జోడీ ఎంతో ఆప్యాయంగా ఒక‌రితో ఒక‌రు ఒక‌రికోసం ఒక‌రుగా క‌నిపించారు. శ‌ర్మాగాళ్ సహజ సౌందర్యాన్ని హైలైట్ చేసే మినిమ‌ల్ మేకప్‌తో కనిపించ‌గా, మరోవైపు పీటర్ స్లిస్కోవిక్ పూర్తిగా తెల్లటి దుస్తులలో క‌నిపించాడు. జంట బావుంది.. కానీ ఇది డేటింగ్ వ‌ర‌కేనా? పెళ్లెప్పుడు? అని కూడా అభిమానులు ప్ర‌శ్నిస్తున్నారు. దానికి నేహా శ‌ర్మ స‌మాధానం ఏమిటో చూడాలి. చర‌ణ్ స‌ర‌స‌న చిరుత చిత్రంలో న‌టించిన నేహా శ‌ర్మ ఆ త‌ర్వాత బాలీవుడ్ లో ప‌లు చిత్రాల్లో న‌టించింది. కానీ కెరీర్ ప‌రంగా ఆశించిన రేంజుకు చేరుకోలేదు. కానీ సోష‌ల్ మీడియాలు, వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల‌తో బాగానే ఆర్జిస్తోంది.