పిక్‌టాక్ : మాల్దీవ్స్‌లో నేహాశర్మ జలకాలాట
మాల్దీవ్స్‌లోని స్విమ్మింగ్ పూల్‌లో జలకాలాడుతూ అందంగా కెమెరాకు ఫోజ్ ఇచ్చింది. నేహా శర్మ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
By: Tupaki Desk | 16 April 2025 5:46 PM ISTచిరుత బ్యూటీ నేహా శర్మ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన అందమైన ఫోటో షూట్స్‌తో వైరల్ అవుతూనే ఉంటుంది. ఎక్కువ సినిమాలు చేయకున్నా ఈమె రెగ్యులర్‌గా ఫోటో షూట్స్‌ను షేర్ చేయడం ద్వారా వార్తల్లో ఉంటుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి మొదటి సినిమాతోనే సక్సెస్ దక్కించుకున్నప్పటికీ అదృష్టం కలిసి రాలేదు. అంతే కాకుండా ఆమె ఎంపిక చేసుకున్న ప్రాజెక్ట్‌లు తలకిందులు అయ్యాయి. దాంతో తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి నేహా శర్మ దూరం కావాల్సి వచ్చింది. బాలీవుడ్‌లో మెల్ల మెల్లగా ఈ అమ్మడు సినిమాలు చేస్తూ కెరీర్‌ను నెట్టుకు వస్తుంది.
తెలుగు, హిందీ సినిమాలతో పాటు ఈమె పంజాబీ, తమిళ్, మలయాళం, మాండరిన్ సినిమాల్లోనూ నటించింది. 2020లో ఇగ్లీగల్ అనే వెబ్ సిరీస్‌లో ఈమె నటించిన విషయం తెల్సిందే. ఆ సిరీస్‌లో ఉత్తమ ప్రదర్శన కనబర్చి ఆకట్టుకుంది. తక్కువ సమయంలోనే టాలీవుడ్ నుంచి దూరం అయినా ఇతర భాషల్లో ఈమెకు మంచి గుర్తింపు దక్కింది. నేహా శర్మ ఈ మధ్య కాలంలో పంజాబీ, హిందీ సినిమాలు ఎక్కువ చేస్తున్న కారణంగా మంచి బాలీవుడ్ ప్రేక్షకులకు మరింత చేరువ అయింది. తాజాగా ఈమె మాల్దీవ్స్‌లో ఫోటో షూట్ తో సందడి చేస్తోంది.
మాల్దీవ్స్‌లోని స్విమ్మింగ్ పూల్‌లో జలకాలాడుతూ అందంగా కెమెరాకు ఫోజ్ ఇచ్చింది. నేహా శర్మ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్విమ్ సూట్ లో సాధారణంగానే హీరోయిన్స్ చాలా అందంగా కనిపిస్తూ ఉంటారు. ఈ ఫోటోల్లో నేహా శర్మ మరింత అందంగా కనిపిస్తున్నారు అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇండస్ట్రీలో అడుగు పెట్టి దాదాపు రెండు దశాబ్దాలు కావస్తున్నా అంతకు మించి అన్నట్లు అందంగా కనిపిస్తుంది. ఇంతటి అందగత్తెకు టాలీవుడ్‌లో తక్కువ సమయంలోనే ఆఫర్లు తగ్గడం విచారకరం అంటూ తెలుగు ప్రేక్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బీహార్‌లోని ఒక హిందూ కుటుంబంలో 1987లో జన్మించిన నేహా శర్మ భాగల్ఫూర్‌లోని మౌంట్ కార్మెల్ స్కూల్‌లో చదివింది. న్యూ ఢిల్లీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నుంచి ఫ్యాషన్ డిజైన్ కోర్స్ చేసింది. ఆమె బాల్యంలో తీవ్రమైన ఆస్తమాతో బాధపడింది. అయినా కూడా పట్టుదలతో ఇండస్ట్రీలో అడుగు పెట్టి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు దక్కించుకుంది. బాలీవుడ్‌లో మరో పదేళ్ల పాటు ఈమె సినిమాలు, సిరీస్‌లు చేసే అవకాశాలు ఉన్నాయి. అందంతో పాటు నటన ప్రతిభ ఉన్న నేహా శర్మ ముందు ముందు కూడా ఇలాంటి అందమైన ఫోటోలను షేర్ చేయాలని నెటిజన్స్ కోరుకుంటున్నారు.
