Begin typing your search above and press return to search.

జాతీయ అవార్డు విజేత‌పై ఇదేం నెగిటివిటీ?

కానీ పుష్ప‌రాజ్ పాత్ర చాలా వ‌ర‌కూ నెగిటివ్ గానే ఉంటుంది. అందులో హీరో క్యార‌క్ట‌రై జేష‌న్ అనేది పూర్తిగా సెల్పీష్ గా ఉంటుంది.

By:  Tupaki Desk   |   25 Aug 2023 12:55 PM GMT
జాతీయ అవార్డు విజేత‌పై ఇదేం నెగిటివిటీ?
X

జాతీయ ఉత్త‌మ న‌టుడు అవార్డుతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరిప్పుడు మార్కెట్ లో మారుమ్రోగిపోతున్న సంగ‌తి తెలిసిందే. పుష్ప రాజ్ పాత్ర‌కి జాతీయ అవార్డు రావ‌డంతో పాన్ ఇండియాలో బ‌న్నీ రేంజ్ అంత‌కం త‌కు రెట్టింపు అవుతుంది. ఇప్పుడెక్కడ‌ చూసిన బ‌న్నీ నామ‌స్మ‌ర‌ణే వినిపిస్తుంది. సోష‌ల్ మీడియా స‌హా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయారు. ఇదే స‌మ‌యంలో పుష్ప రాజ్ పాత్ర‌కి జాతీయ అవార్డు ఏంటి? అని ప్ర‌శ్నించేవారు లేక‌పోలేదు.

ఆ పాత్ర‌కి అవార్డు రావ‌డంపై కొంత మంది అభ్యంత‌రాలు వ్య‌క్తం చేస్తున్నారు. 'పుష్ప‌'లో బ‌న్నీ పాత్ర ప‌రంగా చూస్తే అది నెగిటివ్ రోల్ అన్న‌ది వాస్త‌వం. ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ చేసే రోల్ అది. ఆ లీడ్ రోల్ తోనే క‌థ న‌డుస్తుంది. సాధార‌ణంగా హీరోలంటే తెర‌పై చాలా మంచోళ్లుగా క‌నిపిస్తారు. ఎక్క‌డా పాత్ర‌లో నెగిటివిటీ అనేది ఉండ‌దు. కానీ పుష్ప‌రాజ్ పాత్ర చాలా వ‌ర‌కూ నెగిటివ్ గానే ఉంటుంది. అందులో హీరో క్యార‌క్ట‌రై జేష‌న్ అనేది పూర్తిగా సెల్పీష్ గా ఉంటుంది.

డ‌బ్బు సంపాదించ‌డం కోసం ఎన్ని అడ్డ‌దారులైనా వెత‌కొచ్చు! త‌ప్పు లేదు అన్న‌ది పుష్ప‌రాజ్ నైజం. అయితే ఇప్పుడీ అంశాల్ని ప‌ట్టుకుని కొంత మంది అవార్డు రావ‌డం ఏంట‌ని బుర‌ద చ‌ల్లే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

ఇలాంటి పాత్ర‌ల‌కు కూడా అవార్డులిస్తారా? అని వ్య‌గ్యంగా కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. గ‌తంలో అవ‌ధాని గ‌రిక‌పాటి న‌ర‌సింహారావు కూడా పుష్ప రాజ్ పాత్ర‌పై అభ్యంత‌రం వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే తాజా ఎపిసోడ్ లోకి గ‌రిక‌పాటి రాలేద‌నుకోండి. ఇలా కామెంట్ చేసేది బ‌న్నీ వ్య‌తిరేక వ‌ర్గ‌మా? అన్న‌ది కూడా ఓ సందేహం.

అలా బ‌న్నీపై కొంత నెగిటివిటీని స్ప్రెడ్ చేసే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంది. అయితే విమ‌ర్శించే వాళ్లంతా సినిమా అనేది ఎంట‌ర్ టైన్ మెంట్ అనే విష‌యాన్ని విస్మ‌రించారు. సినిమాని సినిమాలాగే చూడాలి. పాత్ర‌ని పాత్ర‌ని లాగే చూడాలి. తెరపై క‌నిపించేది అంతా న‌టులు మాత్ర‌మే. వాళ్లేమి రియ‌ల్ హీరోలు కాదు. కేవ‌లం న‌ట‌న‌కు మాత్ర‌మే ద‌క్కే గుర్తింపు ఇది. జ్యూరీ వాటినే ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటుంది. ఆ కోవలో ఆ పాత్ర కి మాత్రమే ద‌క్కిన గుర్తింపు ఇది. బ‌న్నీని వ్య‌క్తిగ‌తంగా పిలిచి జాతీయ వేదిక‌పై ఊర‌కనే స‌న్మానించలేదు అన్న‌ది గుర్తించాలి.