Begin typing your search above and press return to search.

ట్రోల్స్ కి భయపడి పెద్దాయన్ను కలిశాడా ?

రాఘవ లారెన్స్​ తన మేనరిజాన్ని పక్కనపెట్టి.. సినిమాలో రజనీకాంత్ మేనరిజాన్ని కాపీ కొట్టారని, లుక్, గెటప్​ అంతా మొదటి భాగంలోని రజనీ స్టైల్​లాగే ఉందంటూ కామెంట్లు చేశారు.

By:  Tupaki Desk   |   26 Sep 2023 3:15 AM GMT
ట్రోల్స్ కి భయపడి పెద్దాయన్ను కలిశాడా ?
X

రాఘవ లారెన్స్‌-కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన బహుభాషా చిత్రం చంద్రముఖి 2. పి.వాసు దర్శకుడు. సూపర్ స్టార్​ రజనీకాంత్‌ హిట్‌ సినిమా చంద్రముఖికి కొనసాగింపుగా ఇది రాబోతుంది. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించింది. ఈ చిత్రం మరో రెండు రోజుల్లో సెప్టెంబర్​ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన రాఘవ లారెన్స్​.. తన అభిమాన హీరో అయిన రజనీకాంత్​ దగ్గరకు వెళ్లి ఆశిస్సులు తీసుకున్నారు. అయితే వాస్తవానికి ఈ చంద్రముఖి సీక్వెల్​పై పెద్దగా బజ్​ ఏమీ క్రియేట్ అవ్వలేదు. ఈ మూవీ అనౌన్స్​ చేసినప్పుడు మంచి అంచనాలే క్రియేట్​ అయ్యాయి కానీ.. ఆ తర్వాత పోస్టర్​, ట్రైలర్​ రిలీజ్​ చేసినప్పుడు బాగా ట్రోల్స్ వచ్చాయి.


రాఘవ లారెన్స్​ తన మేనరిజాన్ని పక్కనపెట్టి.. సినిమాలో రజనీకాంత్ మేనరిజాన్ని కాపీ కొట్టారని, లుక్, గెటప్​ అంతా మొదటి భాగంలోని రజనీ స్టైల్​లాగే ఉందంటూ కామెంట్లు చేశారు. ఇక ట్రైలర్​ కూడా రిలీజయ్యాక కథ అచ్చం మొదటి భాగంలానే అనిపిస్తుందని, పెద్దగా ఇంట్రెస్టింగ్​గా అనిపించట్లేదని అన్నారు. మొత్తంగా ఇలాంటి కారణాలతో సినిమాపై భారీ హైప్ క్రియేట్ అవ్వలేదు.

అయినప్పటికీ లారెన్స్​తో పాటు మిగతా టీమ్​ మొత్తం సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్​ను గట్టిగానే చేస్తోంది. కథలో కొత్త దనం ఉంటుందని చెప్పేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే లారెన్స్​.. రజనీకాంత్​ వెళ్లి కలిసి ఆశిస్సులు తీసుకోవడం కలిసొచ్చే అంశమనే చెప్పాలి. ఎందుకంటే నెగటివ్​ ట్రోల్స్​ వస్తున్న సమయంలో.. లారెన్స్ ఇలా చేయడం ఆయన ఫ్యాన్స్​తో పాటు మరీ ముఖ్యంగా రజనీ అభిమానులకు కాస్త పాజిటివిటీని క్రియేట్ చేసింది.

కాబట్టి అభిమానులు ఈ సినిమాను మరింత ఎక్కువ మంది చూసేందుకు ఈ సంఘటన కలిసొస్తుందనే చెప్పాలి. అదే సమయంలో సినిమా మొదటి రోజు కంటెంట్​ పరంగా కాస్త మంచి టాక్​ తెచ్చుకుంటే చాలు.. ఇక ఆటోమెటిక్​గా మంచి వసూళ్లను ఎలాగో అందుకుంటుంది. చూడాలి మరి.. లారెన్స్​.. రజనీని కలవడం.. ఎంతవరకు మొదటి రోజు అభిమానులను థియేటర్లకు తీసుకువస్తుందో.. అలాగే ఈ సీక్వెల్ కథ ఎంత వరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో..