హీరోయిన్‌తో మాట్లాడకూడదని కండిషన్ పెట్టారు!
రామ్ మాధ్వానీ దర్శకత్వం వహించారు. ఈ హిస్టారికల్ డ్రామాలో జిమ్ సర్బ్ హైజాకర్‌గా నటించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు చెప్పిన కొన్ని సంగతులు ఆసక్తిని రేకెత్తించాయి.
By: Tupaki Desk | 11 May 2025 2:45 AMవిమానం హైజాక్ నేపథ్యంలో సోనమ్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన నీర్జా (2016) సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే గాక ఉత్తమ హిందీ చలనచిత్రంగా జాతీయ అవార్డును గెలుచుకుంది. ఈ సినిమా నిజ జీవిత థ్రిల్లర్ కథ. రామ్ మాధ్వానీ దర్శకత్వం వహించారు. ఈ హిస్టారికల్ డ్రామాలో జిమ్ సర్బ్ హైజాకర్‌గా నటించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు చెప్పిన కొన్ని సంగతులు ఆసక్తిని రేకెత్తించాయి.
ముఖ్యంగా సినిమా చిత్రీకరణ సమయంలో చిత్రకథానాయిక సోనమ్ కపూర్ తో మాట్లాడేందుకు తనకు అనుమతి లేదని జిమ్ సర్బ్ చెప్పాడు. సెట్ లో ఒకరికొకరు మాట్లాడుకోవద్దని దర్శకుడు కండీషన్ పెట్టాడు. దానికి కారణం హైజాకింగ్ పరిస్థితిలో సీరియస్‌నెస్ ఎలివేట్ కావాలనేది అతడి ఆలోచన. విమానం హైజాక్ అయ్యాక హైజాకర్లు మాత్రమే వారిలో వారు మాట్లాడుకోగలరు. విమాన సిబ్బంది మాత్రం వారిలో వారు ఒకరితో ఒకరు మాట్లాడుకోగలరు. ఇది సీరియస్ షూటింగ్. దర్శకుడు ప్రాక్టికల్ గా ఆలోచించాడని జిమ్ సర్భ్ అన్నారు.
దర్శకుడు రామ్ ఇలాంటి కథాంశాన్ని ధైర్యంగా ఎంచుకోవడమే గాక, సినిమా తీసే కళకు అంకితమై పని చేసాడని జిమ్ సర్బ్ ప్రశంసించాడు. ఇలాంటి సీరియస్ సెటప్ ఉన్న వేరే ఏదైనా చేయాలని ఆశిస్తున్నాను అని కూడా చెప్పాడు. దానికి లొంగిపోయి పని చేయాలి. అది ఎక్కడికి తీసుకెళుతుందో తెలీదు...అని నీర్జా అనుభవాన్ని గుర్తు చేసుకున్నాడు. అలాగే నిర్జా పోస్టర్ ని కూడా ఎంతో క్రియేటివ్ గా మలిచారని జిమ్ సర్బ్ ప్రశంసించారు. ఈ పోస్టర్ లో సోనమ్ ని పాయింట్ బ్లాంక్ లో గన్ గురి పెట్టి మరో చెయ్యి కనిపిస్తుంది. అది తన చేతిలా అనిపించదని జిమ్ సర్భ్ గుర్తు చేసుకున్నాడు. ఎంత సీరియస్ మేకింగ్.. అతడు ఆ పద్ధతిని అనుసరించాలనుకున్నాడు. రామ్ మనందరినీ పిచ్చివాళ్లను చేయాలనుకున్నాడు అని అన్నాడు.
నీర్జ 1986 విమానం హైజాక్ ఆధారంగా రూపొందించబడిన బయోపిక్. పాకిస్తాన్- కరాచీ అంతర్జాతీయ విమానాశ్రయంలో హైజాక్ కి గురైన పాన్ ఆమ్ విమానంలోని ప్రయాణీకులను, సిబ్బందిని కాపాడటానికి తన ప్రాణాలను త్యాగం చేసిన భారతీయ విమాన ప్రయాణీకురాలు నీర్జా భానోత్ ధైర్య సాహసాల కథను తెరపై ఆవిష్కరించారు. నిర్జా భానోత్ 23వ పుట్టినరోజుకు రెండు రోజుల ముందు జరిగిన ఉదంతం ఇది. ఈ చిత్రంలో సోనమ్ కపూర్ ప్రధాన పాత్ర పోషించింది. ఇందులో శేఖర్ రావ్జియాని, షబానా అజ్మీ, యోగేంద్ర టికు, కవి శాస్త్రి తదితరులు నటించారు.