Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: కింగ్‌కి NC23 బృందం శుభాకాంక్ష‌లు

ఈ ఫోటోలో కింగ్ తో పాటు నాగ చైతన్య, దర్శకుడు చందూ మొండేటి, నిర్మాత బన్నీ వాస్ ఉన్నారు. వారంతా నాగార్జునకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

By:  Tupaki Desk   |   29 Aug 2023 5:48 PM GMT
ఫోటో స్టోరి: కింగ్‌కి NC23 బృందం శుభాకాంక్ష‌లు
X

టాలీవుడ్ కింగ్ నాగార్జున పుట్టినరోజున నలుమూలల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా కింగ్ కొత్త సినిమా 'నా సామి రంగ'ను అనౌన్స్ చేశారు. ఇంత‌లోనే NC23 బృందం కింగ్ నాగార్జున‌ను కలుసుకుని శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ ఫోటోలో కింగ్ తో పాటు నాగ చైతన్య, దర్శకుడు చందూ మొండేటి, నిర్మాత బన్నీ వాస్ ఉన్నారు. వారంతా నాగార్జునకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.


ఈ ఫోటోగ్రాఫ్ ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతోంది. నాగార్జున‌ - చైతన్యలను ఒకే ఫ్రేమ్‌లో చూడటంపై అక్కినేని అభిమానులు సంతోషిస్తున్నారు. నా సామి రంగా కాకుండా, త్వరలో ప్రారంభం కానున్న బిగ్ బాస్ 7కి నాగార్జున హోస్ట్‌గా కూడా వ్యవహరించనున్నారు.

మ‌రోవైపు నాగార్జున‌, నాగ‌చైత‌న్య‌ల‌తో పాటుగా చందు మొండేటి ఇలా ఒకే ఫ్రేమ్ లో ఎంతో ప్ర‌త్యేకంగా క‌నిపిస్తున్నారు. నిజానికి చందు మొండేటి సిస‌లైన అక్కినేని అభిమాని. అత‌డు నాగార్జున అభిమానిగా సినీప‌రిశ్ర‌మ‌లో ప్ర‌వేశించి అక్కినేని కాంపౌండ్ హీరోల‌కు క‌థ‌లు చెప్పి ఒప్పించారు. ఇంత‌కుముందు నాగ‌చైత‌న్య‌తో స‌వ్య‌సాచి చిత్రాన్ని తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు నాగ‌చైత‌న్య‌తోనే NC23 తెర‌కెక్కిస్తున్నాడు. మ‌త్స్య‌కార గ్రామంలో ల‌వ్ స్టోరి నేప‌థ్యంలో ఈ సినిమాని చందు తెర‌కెక్కిస్తున్నారు. ఇప్ప‌టికే ఆన్ లొకేష‌న్ ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ అయ్ఆయ‌యి.

కార్తికేయ‌- కార్తికేయ 2 చిత్రాల‌తో బ్లాక్ బ‌స్ట‌ర్లు అందుకున్న చందు మొండేటి నేటిత‌రంలో విష‌యం ఉన్న ద‌ర్శ‌కుడిగా గుర్తింపు పొందాడు. అత‌డితో ప‌ని చేసేందుకు చాలామంది హీరోలు ఆస‌క్తిగా ఉన్నారు. కానీ అత‌డు అక్కినేని హీరోల‌తో వ‌రుస‌ సినిమాలకు క‌మిట‌వ్వ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది. చందు మొండేటి త‌దుప‌రి కార్తికేయ 3 చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నారు.