Begin typing your search above and press return to search.

నాగచైతన్య 23: బడ్జెట్ గట్టిగానే..

కథ స్పాన్ చాలా పెద్దది కావడంతో ముందుగా ప్లానింగ్ లోనే ఈ సినిమా బడ్జెట్ 80 కోట్లవరకు ఖర్చయ్యే3 అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   20 Sep 2023 1:58 PM GMT
నాగచైతన్య 23: బడ్జెట్ గట్టిగానే..
X

అక్కినేని నాగచైతన్య నెక్స్ట్ సినిమాను యువ దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో చేయబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. ముందుగా చిత్ర యూనిట్ సభ్యులు వర్క్ షాప్ కూడా నిర్వహించారు. ఇక ఈ సినిమాలో నాగచైతన్యకు జోడిగా సాయి పల్లవి నటించబోతున్నట్లు రీసెంట్గా అధికారికంగా కూడా క్లారిటీ ఇచ్చారు.

అల్లు అరవింద్ సమర్పణలో GA2 ప్రొడక్షన్ బ్యానర్ పై బన్నీ వాసు పాన్ ఇండియా స్థాయిలోనే ఈ సినిమాను తెరపైకి తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన అనేక రకాల విషయాలు ఇప్పటికే మార్కెట్లో మంచి బజ్ అయితే క్రియేట్ చేశాయి. 2018 లో గుజరాత్ సముద్రతీరంలో వేటకు వెళ్లిన 21 మంది మత్స్యకారులు పాకిస్తాన్ కోస్ట్ గార్డులకు దొరికిపోయిన విషయం తెలిసిందే.

అయితే వారి నిజజీవితంలోని సంఘటన ఆధారంగానే ఈ సినిమాను తెరపైకి తీసుకురాబోతున్నారు. నాగచైతన్య ఈ సినిమాలో కంప్లీట్ మాస్ పాత్రలో ఒక జాలరిగా కనిపించబోతున్నాడు. అయితే ఈ సినిమా బడ్జెట్ గురించి కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మొదట ఈ సినిమాను 60 కోట్ల రేంజ్ లోనే నిర్మించాలని అనుకున్నారు.

కానీ కథ స్పాన్ చాలా పెద్దది కావడంతో ముందుగా ప్లానింగ్ లోనే ఈ సినిమా బడ్జెట్ 80 కోట్లవరకు ఖర్చయ్యే3 అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఖర్చుకు ఏమాత్రం వెనకాడకుండా సినిమాను నిర్మించాలి అనే నిర్మాత బన్నీ వాసు అనుకుంటున్నారు. ఇక సినిమా కంటెంట్ కూడా నేషనల్ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది అని ఈ సినిమాను నిర్మాణంలో భాగమయేందుకు ప్రముఖ నెట్ ఫ్లిక్స్ సంస్థ కూడా చేతులు కలపబోతున్నట్లుగా తెలుస్తోంది.

దర్శకుడు చందు మొండేటి టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కార్తికేయ సినిమాతో అతనికి నేషనల్ వైడ్ గా మంచి గుర్తింపు లభించింది. బడా ప్రొడక్షన్ హౌస్ లో నుంచి అలాగే ప్రముఖ హీరోల నుంచి అతనికి ఆఫర్లు కూడా వస్తున్నాయి. అయితే ముందుగా కమిట్మెంట్ ప్రకారం నాగచైతన్య తోనే సినిమా చేసేందుకు కథను సిద్ధం ఈశాడు. ఇక ఈ పర్ఫెక్ట్ కాంబినేషన్కు సాయి పల్లవి కూడా జతకలిసింది. దీంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.