Begin typing your search above and press return to search.

NC23 సాహసయాత్ర.. ఇది నెక్స్ట్ లెవెల్!

ప్రీ-ప్రొడక్షన్‌ను ప్రారంభించడానికి, బృందం #NC23 కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌ను అన్వేషించింది. శ్రీకాకుళంలోని మచిలేశం గ్రామాన్ని సందర్శించింది.

By:  Tupaki Desk   |   8 Aug 2023 6:55 AM GMT
NC23 సాహసయాత్ర.. ఇది నెక్స్ట్ లెవెల్!
X

నాగచైతన్య ఇప్పటివరకు చేసిన సినిమాలు ఒక లెక్క ఇప్పుడు నెక్స్ట్ చేయబోయే సినిమా మరొక లెక్క అనే విధంగా ఉన్నట్లు అర్థమవుతుంది. NC 23వ సినిమాను చందు మండేటి దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. ఇక అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు గీతా ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాతో మొదట్లోనే అంచనాలు గట్టిగా పెంచేస్తున్నారు.

ఈ సినిమాను కొన్ని నిజజీవితంలోని సంఘటనల ఆధారంగా తెరపైకి తీసుకు వస్తున్నట్లు ముందుగానే దర్శకుడు ఒక క్లారిటీ అయితే ఇచ్చేసాడు. ఇక ఇప్పుడు మరొక సాహసవంతమైన నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. సినిమా మేకింగ్ విధానం అలాగే ప్రజెంటేషన్లో ఎక్కడ కూడా పొరపాట్లు రాకూడదు అని చిత్ర యూనిట్ చేస్తున్న కృషి నెక్స్ట్ లెవెల్ లో ఉంది అని చెప్పాలి.

ఏకంగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను గతంలో ఎవరు చేయని విధంగా మొదలుపెట్టడం ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తోంది. లేటెస్ట్ గా సినిమాకు సంబంధించిన #NC23 ఎక్స్‌పెడిషన్ అంటూ ఒక ఫస్ట్ కట్ డాక్యుమెంటేషన్ వీడియోను విడుదల చేశారు. ఇక అందులో చిత్ర నిర్మాత బన్నీ వాసు హీరో నాగచైతన్య దర్శకుడు చందు మండేటి ఏకంగా ఒక గ్రామంలోకి వెళ్లి అక్కడ జనాలతో కూర్చుని వారితో కలిసి మాట్లాడే కలిసి భోజనం చేసి అక్కడి వాతావరణాన్ని మరింత అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

యదార్థ సంఘటనల ఆధారంగా మరియు అసలైన లొకేషన్‌లలో రూపొందించబడిన చిత్రాలకు ప్రీ-ప్రొడక్షన్ కూడా చాలా ముఖ్యమైనది. అందుకే NC 23 టీమ్ ఆ విషయంలో మొదటి నుంచే సాహసవంతమైన అడుగులు వేస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించడానికి మేకర్స్ ఎటువంటి దారిని వదిలి పెట్టడం లేదని అనిపిస్తోంది. అందుకోసం కొత్త విధానాన్ని అవలంబించారు.

ప్రీ-ప్రొడక్షన్‌ను ప్రారంభించడానికి, బృందం #NC23 కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌ను అన్వేషించింది. శ్రీకాకుళంలోని మచిలేశం గ్రామాన్ని సందర్శించింది. ''హైదరాబాద్‌లో కూర్చొని ఈ కథను తెరకెక్కించకూడదని దర్శకుడు భావించారని, అక్కడి ప్రజలు, వాతావరణాన్ని అధ్యయనం చేస్తూ చాలా జాగ్రత్తలు తీసుకుని ప్రీ ప్రొడక్షన్‌ను ముందుకు తీసుకెళ్తున్నాం.. అని బన్నీ వాసు అన్నారు.

ఇక దర్శకుడు చందూ మొండేటి మాట్లాడుతూ.. ''ఈ గ్రామానికి వచ్చి ప్రతి విషయానికి సంబంధించిన వివరాలను పరిశీలించిన తర్వాత మా ప్రీ ప్రొడక్షన్‌ పనులు ప్రారంభిస్తాం'' అన్నారు. హీరో నాగ చైతన్య మాట్లాడుతూ.. ''పాత్రలను కలవడానికి, వారి బాడీ లాంగ్వేజ్‌ని అధ్యయనం చేయడానికి.. పల్లెటూరి ఆకృతిని తెలుసుకోవడానికి, వారి జీవనశైలిని అర్థం చేసుకోవడానికి మేము ఈ గ్రామంలో తిరుగుతాము అని అన్నారు.

ఇక దీన్ని తదుపరి స్థాయికి తీసుకువెళ్లి, మత్స్యకారుల పని జీవితాన్ని అర్థం చేసుకోవడానికి #NC23 బృందం సముద్రంలోకి బోటులో వెళ్లింది. టాలీవుడ్‌లో మునుపెన్నడూ లేని విధంగా, ఒక హీరో షూటింగ్ ప్రారంభించే ముందు లొకేషన్‌లను సందర్శించి ప్రజలతో సంభాషించాడం ఇదే తొలిసారి కావచ్చు. నాగ చైతన్య ప్రీ ప్రొడక్షన్ పనుల్లో పాల్గొంటూ ప్రాజెక్ట్ పై తన ప్రత్యేక ఆసక్తిని చూపిస్తున్నాడు. తప్పకుండా ఈ సినిమాతో చందు మొండేటి సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నట్లు అర్ధమవుతోంది.