Begin typing your search above and press return to search.

NBK 109 పాన్ ఇండియా లెవల్?

మరోవైపు వాల్తేర్ వీరయ్య సినిమాతో సూపర్ హిట్ కొట్టిన బాబి ఈ చిత్రంతో బాలయ్యకి పాన్ ఇండియా లెవెల్ లో సక్సెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు.

By:  Tupaki Desk   |   24 Nov 2023 3:53 AM GMT
NBK 109 పాన్ ఇండియా లెవల్?
X

నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశారు. వరుస హ్యాట్రిక్ హిట్స్ తో మంచి జోరు మీద ఉన్న బాలకృష్ణ ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకోవాలని రెడీ అవుతున్నారు. మరోవైపు వాల్తేర్ వీరయ్య సినిమాతో సూపర్ హిట్ కొట్టిన బాబి ఈ చిత్రంతో బాలయ్యకి పాన్ ఇండియా లెవెల్ లో సక్సెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు.

దానికి తగ్గట్టుగానే పర్ఫెక్ట్ క్యాస్టింగ్ ని కూడా సినిమాకి సెట్ చేస్తూ ఉండడం విశేషం. ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో ఇప్పటికే మలయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్ ను ఎంపిక చేశారు. తాజాగా మరో ఇద్దరు స్టార్ యాక్టర్స్ ని కూడా ఈ సినిమా కోసం ఖరారు చేసినట్లు తెలుస్తుంది. యానిమల్ సినిమాలో విలన్ గా నటించిన బాలీవుడ్ స్టార్ బాబి డియోల్ ఎన్.బి.కె 109 మూవీలో ప్రతి నాయకుడిగా కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది.

అలాగే డైరెక్టర్ నుంచి యాక్టర్ అయిన గౌతమ్ వాసుదేవ్ మీనన్ కూడా ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో నటించబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. దీంతోపాటు హీరోయిన్ ని బాలీవుడ్ నుంచి ఎంపిక చేసే ఆలోచనలో బాబి ఉన్నట్లుగా టాక్. ఈ ప్లానింగ్ అంతా చూస్తుంటే సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో సినిమాని షోకేస్ చేయాలని ఆలోచనలో ఉన్నట్లుగా సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

దానికి తగ్గట్లుగానే ఈ సినిమా కథను కూడా యూనివర్సల్ అప్పీల్ ఉండేలా బాబీ కథ సిద్ధం చేసినట్లు ఫిలింనగర్ సర్కిల్లో వినిపిస్తున్న మాట. అఖండ, వీర సింహారెడ్డి, భగవంతు కేసరి చిత్రాలతో వరుస బ్లాక్ బస్టర్ బాలయ్య తన ఖాతాలో వేసుకున్నారు.

ఇప్పుడు బాబి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కూడా నెక్స్ట్ లెవెల్ అనే విధంగానే ఉండబోతుందని నందమూరి అభిమానులు అంచనా వేస్తున్నారు. కచ్చితంగా ఈ సినిమాతో బాలయ్య పాన్ ఇండియా స్టార్ కావడం ఖాయం అనే మాట సోషల్ మీడియాలో వినిపిస్తోంది. అయితే స్టార్ క్యాస్టింగ్ ఖరారు అయ్యారా లేదా అనేది అఫీషియల్ గా అనౌన్స్ చేసేంతవరకు ఎదురుచూడాల్సిందే.