Begin typing your search above and press return to search.

బాలయ్యతో ఆత్రేయ.. క్లారిటీ వచ్చినట్లేనా..

నందమూరి బాలకృష్ణ అప్ కమింగ్ ప్రాజెక్టులపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

By:  M Prashanth   |   10 Jun 2026 11:50 PM IST
బాలయ్యతో ఆత్రేయ.. క్లారిటీ వచ్చినట్లేనా..
X

నందమూరి బాలకృష్ణ అప్ కమింగ్ ప్రాజెక్టులపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో బాలయ్య చేయాల్సిన సినిమా ఆగిపోయిందంటూ ప్రచారం సాగింది. బాలకృష్ణ వరుస కమిట్మెంట్లతో బిజీగా ఉండటంతో డేట్స్ సమస్య తలెత్తిందని, దీంతో ఆ క్రేజీ కాంబినేషన్‌ కు బ్రేక్ పడిందని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ రూమర్లకు దాదాపు ఫుల్ స్టాప్ పడినట్టు కనిపిస్తోంది.

బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా దర్శకుడు వివేక్ ఆత్రేయ స్వయంగా వెళ్లి ఆయనకు విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ ఫోటోల్లో మైత్రీ మూవీ మేకర్స్ అధినేతల్లో ఒకరైన రవిశంకర్ యలమంచిలి కూడా కనిపించడం విశేషం. దీంతో బాలయ్య- వివేక్ ఆత్రేయ సినిమా ఆగిపోలేదనే అభిప్రాయం వినిపిస్తోంది. అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోయినా, ఆ ఫోటో ద్వారా ప్రాజెక్టుపై ఉన్న అనుమానాలపై కొంత క్లారిటీ వచ్చినట్టేనని తెలుస్తోంది.

అయితే బాలయ్య- ఆత్రేయ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయట. మూవీ టీమ్ ఎలాంటి హడావుడి లేకుండా తమ పనులను పూర్తి చేస్తోందని తెలుస్తోంది. భారీ బడ్జెట్‌ తో తెరకెక్కనున్న ఆ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్.. హై టెక్నికల్ వాల్యూస్ తో ఉండేలా ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా స్టార్ సినిమాటోగ్రాఫర్ సిద్ధార్థ నూనిని సెలెక్ట్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది.

గతంలో కెప్టెన్ మిల్లర్ వంటి చిత్రాలకు అద్భుతమైన విజువల్స్ అందించిన ఆయన, బాలయ్యను మాస్ అవతార్‌ లో చూపించనున్నారని తెలుస్తోంది. అంతేకాదు, సినిమాలో కీలక పాత్ర కోసం కోలీవుడ్ యాక్టర్ రిషికాంత్‌ ను సెలెక్ట్ చేసినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. కథలో కీలక మలుపు తీసుకొచ్చే పవర్‌ ఫుల్ పాత్రలో ఆయన కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది. అలాగే బాలయ్య సినిమాలో రెండు విభిన్న షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించనున్నారని కూడా టాక్ నడుస్తోంది. ఆ విషయాలన్నీ ప్రాజెక్ట్‌ పై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.

ఇక బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న NBK 111 మూవీ షూటింగ్‌ తో బిజీగా ఉన్నారు. ఆ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. ఆ రెండు సినిమాల పనులు పూర్తయిన అనంతరం వివేక్ దర్శకత్వంలోని చిత్రం సెట్స్‌ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

బ్రోచేవారెవరురా, సరిపోదా శనివారం వంటి విభిన్న సినిమాలతో దర్శకుడిగా తనదైన ముద్ర వేసుకున్న వివేక్ ఆత్రేయ.. బాలయ్య మాస్ ఇమేజ్‌ ను ఎలా డీల్ చేస్తారనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఒకవైపు ఆత్రేయ మార్క్ స్టోరీ, మరోవైపు బాలకృష్ణ ఎనర్జీ కలిస్తే కొత్త తరహా మాస్ ఎంటర్టైనర్ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా బాలయ్య- ఆత్రేయ సినిమా రద్దయిందని వచ్చిన వార్తలకు తాజాగా బయటకు వచ్చిన ఫోటో ఆన్సర్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నప్పటికీ, ఆ కాంబోపై అంచనాలు మాత్రం మరింత పెరిగాయి.