బాలయ్య కొరటాల ఫిక్స్.. ఆ రెండు లైన్స్ తోనే పవర్ఫుల్ వైబ్
టాలీవుడ్ లో కొన్ని కాంబినేషన్లు అనౌన్స్ అయిన వెంటనే ఇండస్ట్రీ వర్గాల్లో ఒక రకమైన ఊపు వస్తుంది.
By: Tupaki Desk | 1 May 2026 11:33 AM ISTటాలీవుడ్ లో కొన్ని కాంబినేషన్లు అనౌన్స్ అయిన వెంటనే ఇండస్ట్రీ వర్గాల్లో ఒక రకమైన ఊపు వస్తుంది. నందమూరి బాలకృష్ణ కొరటాల శివ కలయిక కూడా అలాంటిదే. ‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’ వంటి సినిమాలతో బాలయ్య మాస్ స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ చేసుకున్నప్పటికీ ఆ తరువాత అఖండ 2 అంతగా క్లిక్ కాలేదు. కానీ ఆయన ఒక స్టార్ డైరెక్టర్ తో పక్కా కమర్షియల్ ఫార్ములాలో సినిమా తీస్తే వచ్చే కిక్కే వేరు.
సామాజిక సందేశాన్ని కమర్షియల్ అంశాలతో మిక్స్ చేసే కొరటాల శివకు ఉన్న ట్రాక్ రికార్డ్ చూస్తే, ఈ క్రేజీ కాంబోపై అభిమానుల్లో భారీ అంచనాలు పెరగడం కామన్. ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బాలకృష్ణ కొరటాల శివ NBK 112 ప్రాజెక్ట్ అధికారికంగా అనౌన్స్ అయింది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. బ్లాక్ అండ్ వైట్ లుక్ లో బాలయ్య, కొరటాల ఫోటోలు కాంట్రాస్ట్ గా కనిపిస్తుండగా, దానిపై ఉన్న లైన్స్ సినిమా రేంజ్ ను చెబుతున్నాయి.
సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ముహూర్తం కార్యక్రమాలు ఈ రోజే పూర్తవ్వగా, జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ పట్టాలెక్కనుంది. ఈ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో “Power Meets Purpose”, “Mass Becomes A Movement” అనే రెండు పవర్ ఫుల్ లైన్స్ వాడారు. ఇవి కేవలం క్యాచీ వర్డ్స్ కావు, ఈ సినిమా కథపై హింట్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. కొరటాల శివ తన ప్రతి సినిమాలో ఒక బలమైన సామాజిక అంశాన్ని తీసుకుంటారు.
ఇప్పుడు బాలయ్య మాస్ ఇమేజ్ కు ఒక పర్పస్ తోడైతే, అది ఒక “మూవ్ మెంట్”లా మారుతుందని దర్శకుడు భావిస్తున్నట్లు సమాచారం. ఈ రెండు లైన్స్ తోనే సినిమా స్క్రిప్ట్ లోని ఇంటెన్సిటీ ఏంటో ట్రేడ్ వర్గాలకు కూడా క్లారిటీ వచ్చేసింది. బాలకృష్ణ పాత్రను కొరటాల శివ చాలా పవర్‌ఫుల్‌గా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. తన సినిమాలలో హీరోలకు ఒక ప్రత్యేకమైన ఇమేజ్, బాధ్యతను ఇచ్చే కొరటాల, ఈసారి బాలయ్య ఇమేజ్ కు తగ్గట్టుగా ఒక గ్రేట్ క్యారెక్టరైజేషన్ ను రాసుకున్నారని టాక్.
దీనికోసం రెండేళ్ల పాటు సమయం తీసుకుని అవుట్ పుట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకూడదని డిసైడ్ అయ్యారు. మిగతా నటీనటులు వివరాలు, టెక్నీషియన్స్ ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉంది. నిజానికి 'అఖండ 2' తో ఊహించని ఫ్లాప్ ను ఎదుర్కొన్న బాలయ్య కథల విషయంలో అలాగే బడ్జెట్ విషయంలో రిస్క్ తీసుకోకూడదని బాలయ్య జాగ్రత్త పడుతున్నారు. మరోవైపు కొరటాల దేవర 1తో కమర్షియల్ గా హిట్ కొట్టి మళ్ళీ సీక్వెల్ చేస్తారని అంతా అనుకున్నారు. కానీ ఊహించని విధంగా బాలకృష్ణ ప్రాజెక్టుతో సర్ ప్రైజ్ ఇచ్చారు. ఇక సాధ్యమైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది విడుదల చేయాలనేది వీరి ప్లాన్.
