Begin typing your search above and press return to search.

NBK109.. ఆ క్యారెక్టర్ వెరీ స్పెషల్

అలాగే ఉంటే మాత్రం మూవీ బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అనే మాట వినిపిస్తోంది. ఆయన క్యారెక్టర్ చాలా స్పెషల్ గా ఉంటుందంట. ఇప్పటికే కాంబో లో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారంట.

By:  Tupaki Desk   |   7 Jan 2024 3:49 AM GMT
NBK109.. ఆ క్యారెక్టర్ వెరీ స్పెషల్
X

వాల్తేర్ వీరయ్య తర్వాత బాబీ చాలా గ్యాప్ తీసుకొని బాలకృష్ణతో మూవీ ఒకే చేయించుకొని సెట్స్ పైకి తీసుకొని వెళ్ళిన సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో బాలయ్య స్టైల్ ఆఫ్ స్టొరీతోనే ఈ మూవీ తెరకెక్కుతోంది. ప్రస్తుతం మూవీ షూటింగ్ దశలో ఉంది. ఇదిలా ఉంటే ఈ మూవీలో బాబీ డియోల్ విలన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. యానిమల్ తర్వాత తెలుగు ప్రేక్షకులని బాబీ డియోల్ పలకరించేది బాలయ్య మూవీతోనే.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. సీనియర్ హీరోయిన్స్ పేర్లు పరిశీలిస్తున్నారు. అయితే షూటింగ్ మాత్రం ఆగడం లేదు. మూవీలో మలయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఆయన కూడా షూటింగ్ లో పాల్గొన్నారని తెలుస్తోంది. బాలయ్య కాంబినేషన్ లో దుల్కర్ సల్మాన్ సన్నివేశాలు ఉంటాయంట.

వాల్తేర్ వీరయ్యలో రవితేజ ఎలాంటి ఇంపార్టెంట్ రోల్ పోషించాడో అదే తరహాలో NBK 109లో దుల్కర్ సల్మాన్ పాత్ర కూడా ఉండబోతోన్దనే టాక్ వినిపిస్తోంది. అలాగే ఉంటే మాత్రం మూవీ బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అనే మాట వినిపిస్తోంది. ఆయన క్యారెక్టర్ చాలా స్పెషల్ గా ఉంటుందంట. ఇప్పటికే కాంబో లో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారంట.

ఇప్పటికే బాలయ్య వరుసగా మూడు హిట్స్ తో మంచి జోరు మీద ఉన్నాడు. ఈ మూవీతో నాలుగో హిట్ ఖాతాలో వేసుకోవాలని అనుకుంటున్నారు. అలాగే కెరియర్ లో భారీ బడ్జెట్ తో ఈ మూవీ చేస్తున్నారు. యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథతోనే మూవీ ఉండబోతోంది. ఈ సినిమాని ఇతర భాషలలో కూడా రిలీజ్ చేసే ప్లాన్ లో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ మూవీ కంప్లీట్ అయిన తర్వాత బోయపాటి దర్శకత్వంలో బాలయ్య అఖండ 2ని సెట్స్ పైకి తీసుకొని వెళ్ళే అవకాశం ఉంది. అలాగే గీతా ఆర్ట్స్ లో ఒక సినిమాకి కమిట్ అయ్యి ఉన్నారు. అలాగే ఈ ఏడాది కొడుకుని హీరోగా లాంచ్ చేయడానికి బాలయ్య సిద్ధమయ్యారు. దానికోసం గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు.