Begin typing your search above and press return to search.

NBK109 : పిచెక్కించే టైటిల్‌ ఫిక్స్‌

సగానికి పైగా షూటింగ్‌ పూర్తి అయినట్లు సమాచారం అందుతోంది. బాలయ్య ఎన్నికల కారణంగా కొన్ని రోజులు బ్రేక్ తీసుకున్నాడు.

By:  Tupaki Desk   |   4 April 2024 6:25 AM GMT
NBK109 : పిచెక్కించే టైటిల్‌ ఫిక్స్‌
X

నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా టైటిల్‌ ను ఎప్పుడెప్పుడు అనౌన్స్ చేస్తారా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మధ్య కాలంలో బాలయ్య నుంచి వచ్చిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకుంటూ వస్తున్నాయి. అందుకే ఈ సినిమా మరో విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అని ఫ్యాన్స్ ధీమాతో ఉన్నారు.

సగానికి పైగా షూటింగ్‌ పూర్తి అయినట్లు సమాచారం అందుతోంది. బాలయ్య ఎన్నికల కారణంగా కొన్ని రోజులు బ్రేక్ తీసుకున్నాడు. త్వరలోనే మళ్లీ షూట్‌ కి రీ జాయిన్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ సినిమా టైటిల్‌ అంటూ చాలా పేర్లు ప్రచారం జరిగాయి. తాజాగా మరో టైటిల్‌ ప్రచారంలోకి వచ్చింది.

ఈ సినిమా కోసం బాబీ 'వీరమాస్‌' అనే టైటిల్‌ ను పరిశీలిస్తున్నాడట. బాలయ్య కూడా ఈ టైటిల్‌ కి గ్రీన్ సిగ్నల్‌ ఇస్తే ఉగాది సందర్భంగా ఫస్ట్‌ లుక్ పోస్టర్‌ ను అధికారికంగా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. అన్ని అనుకున్నట్లుగా జరిగితే వీర మాస్ సినిమా దీపావళికి విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయట.

వీర అనే పదంతో గతంలో బాలయ్య నటించిన వీర సింహారెడ్డి మరియు వీరభద్ర సినిమాలు వచ్చాయి. వాటి ఫలితాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాజిటివ్ సెంటిమెంట్‌ కలిసి వస్తుందని కొందరు భావిస్తూ ఉంటే, కొందరు మాత్రం టైటిల్‌ విషయంలో పెదవి విరుస్తున్నారు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో భారీ ఎత్తున రూపొందుతున్న ఈ సినిమాకు థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాతో బాలయ్య డబుల్‌ హ్యాట్రిక్ ఖాయం అంటూ ఫ్యాన్స్ తో పాటు మీడియా వర్గాల వారు మరియు సినీ సర్కిల్స్ వారు నమ్మకం గా కనిపిస్తున్నారు.