Begin typing your search above and press return to search.

NBK109 గ్లింప్స్: సింహం న‌క్క‌ల మీదికొస్తే వార్ అవ్వ‌దురా ల‌*ట్

మార్చి 8న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం ఈ ఫస్ట్‌ గ్లింప్‌ను విడుదల చేసింది.

By:  Tupaki Desk   |   8 March 2024 12:41 PM GMT
NBK109 గ్లింప్స్: సింహం న‌క్క‌ల మీదికొస్తే వార్ అవ్వ‌దురా ల‌*ట్
X

నందమూరి బాలకృష్ణ మాస్ యాక్ష‌న్ సినిమాల రారాజు. అతడి సినిమాలు భారీ యాక్షన్ సన్నివేశాలతో సంపూర్ణ వినోదాన్ని అందిస్తున్నాయి. మాస్ ని ప‌దే ప‌దే థియేట‌ర్ల‌కు ర‌ప్పిస్తున్నాయి. అతడికి తెలుగు రాష్ట్రాలు స‌హా ప్ర‌పంచ‌వ్యాప్తంగా భారీ అభిమానులున్నారు. బాల‌య్యను అభిమానించేవారంతా అత‌డిపై ప్రేమతో 'నట సింహా' అని పిలుస్తారు. ఎన్బీకే ఉరుములతో కూడిన మాస్ డైలాగ్ డెలివరీ.. రాయల్ లుక్స్.. స్వ‌చ్ఛ‌మైన మ‌న‌సు కారణంగా అతను మంచి విజయాల‌ను అందుకున్నాడు. ఇప్పుడు అత‌డు పెద్ద యాక్షన్ చిత్రాల బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బాబీ కొల్లితో చేతులు కలిపాడు.

రచయిత-దర్శకుడు అయిన బాబీ తన హీరోలను డైనమిక్ అవ‌తార్ లో ప్రదర్శించడంలో ప్రసిద్ది చెందారు. ఇంత‌కుముందు మెగాస్టార్ చిరంజీవిని వాల్తేరు వీర‌య్య‌గా అద్భుతంగా ఆవిష్క‌రించిన బాబి అంతే క‌సిగా ఎన్బీకేను కూడా ధీటైన పాత్ర‌లో ఆవిష్క‌రించేందుకు కంక‌ణం క‌ట్టుకున్నారు. బాల‌య్య‌కు ప్రత్యేకమైన శైలి ఉంటుంది.. దానికి త‌గ్గ‌ట్టుగా అత‌డిని త‌న 109వ చిత్రంలో చూపిస్తున్నాడు. ఈ కాంబినేష‌న్అ సినీ ప్రేమికులు మరియు దిగ్గజ నటుడి అభిమానులలో గొప్ప ఉత్సుకతను పెంచింది. ఈ అరుదైన కాంబినేషన్ నుండి అందరూ ఉరుములతో కూడిన మాస్ యాక్షన్ సినిమాని ఆశిస్తున్నారు.

వారి అంచనాలను నిజం చేస్తూ NBK109 నుండి మొదటి టీజర్ విడుద‌లైంది. అభిమానుల‌ భారీ అంచనాలను ఇది అందుకుంది. మార్చి 8న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం ఈ ఫస్ట్‌ గ్లింప్‌ను విడుదల చేసింది. టీజ‌ర్ లో ఎన్బీకే త‌న‌దైన శైలిలో వీర‌విహారం చేస్తున్నారు. కార్చిచ్చు ర‌గులుకుని ద‌హ‌నం అవుతున్న కార‌డ‌విలో భ‌యాన‌కంగా త‌గ‌ల‌బ‌డుతున్న కార్.. దూరంగా కొండ‌ల్లోంచి పొంగుకొస్తున్న లావా.. ఇంత‌లోనే మ‌న హీరో ధ‌గ్ధ‌మ‌వుతున్న కార్ నుంచి ఒక పెద్ద పెట్టెను బ‌య‌ట‌కు తీసాడు. అది ఓపెన్ చేస్తే అందులో లావా దాగిన‌ ఆల్క‌హాల్ బాటిల్ .. మూత ఓపెన్ చేసి గ‌డ‌గ‌డా తాగాడు. రెండు గొడ్డ‌ళ్ల‌ను బ‌య‌ట‌కు తీసాడు. అంతే ఇక న‌రుకుడే న‌రుకుడు.. గొడ్డ‌లి కో కండ‌గా ఒక్కొక్క‌రిని న‌రుకుతూ బాల‌య్య బాబు వీర‌విహారం.. అద్భుత‌మైన పంచ్ డైలాగ్ నిజంగా మాస్ కి స్పెష‌ల్ ట్రీట్ గా క‌నిపిస్తున్నాయి. సింహం న‌క్క‌ల మీదికొస్తే వార్ అవ్వ‌దురా ల‌*ట్.. ఇట్స్ కాల్డ్ హంటింగ్! అంటూ బాల‌య్య భీక‌ర‌మైన పంచ్ విసిరాడు. ఇది ఫ్యాన్స్ కి స్పెష‌ల్ ట్రీట్ అన‌డంలో సందేహం లేదు.

బాబీ కొల్లి NBKని యాక్షన్ సీక్వెన్స్‌లో నేచురల్ బోర్న్ కింగ్ గా చూపించాడు. బాల‌య్య‌ ట్రేడ్‌మార్క్ పద్ధతిలో కూల్‌గా, ప్రశాంతంగా క‌నిపిస్తూనే అద్భుత‌మైన మాస్ డైలాగ్‌ని చెబుతున్నాడు. ఇంత‌కీ కూల్ గా కార్ లోంచి తీసిన టూల్ బాక్స్‌లో ఉన్న బాటిల్ ఏమ‌ని అనుకుంటున్నారు. అది బాల‌య్య బాబు ఎక్కువ‌గా లైక్ చేసే మాన్షన్ హౌస్ బ్రాండ్. ఆల్కహాల్ బాటిల్‌ని తన ఆయుధాలతో పాటు తీసుకెళ్లడం ఇందులో ఫ‌న్ యాంగిల్. గూండాలు అతడి వైపు పరిగెత్తుకొస్తున్నా భ‌య‌ప‌డ‌క‌ కూల్‌గా అతనికి ఇష్టమైన ఆల్కహాల్ తాగాడు. మునుపెన్నడూ లేని విధంగా భారీ కిక్ ఇచ్చే సీన్ ఇది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్, యానిమ‌ల్ ఫేం బాబీ డియోల్ కనిపించబోతున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. బాబీతో బాల‌య్య వార్ సంథింగ్ స్పెష‌ల్ గా ఉంటుంద‌ని కూడా ఊహిస్తున్నారు.

సెన్సేషనల్ కంపోజర్ ఎస్.ఎస్.థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, 'జైలర్' ఫేమ్ విజయ్ కార్తీక్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. నిరంజన్ ఎడిటింగ్ వ‌ర్క్ అందిస్తున్నారు. ఈ చిత్రానికి అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్. ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకంపై సాయి సౌజన్యతో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్ ప్రకటిస్తారు.