Begin typing your search above and press return to search.

NBK 109.. ఫ్యాన్స్ కి కిక్ ఇస్తున్న అప్డేట్స్..!

ఎన్.బి.కె 109 ఆడియన్స్ కు స్పెషల్ ట్రీట్ అందిస్తుందని అంటున్నారు. ఇక ఈ సినిమాను ఈ ఇయర్ డిసెంబర్ కల్లా లేదా 2025 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట.

By:  Tupaki Desk   |   21 Feb 2024 6:17 AM GMT
NBK 109.. ఫ్యాన్స్ కి కిక్ ఇస్తున్న అప్డేట్స్..!
X

సీనియర్ హీరోల్లో సక్సెస్ ఫుల్ ఫాంలో ఉన్నాడు నందమూరి నట సింహం బాలకృష్ణ. అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో హ్యాట్రిక్ హిట్ అందుకున్న బాలయ్య ఆ సక్సెస్ మేనియా కొనసాగించేందుకు కష్టపడుతున్నారు. ఎన్.బి.కె 109వ సినిమా కె.ఎస్ బాబీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది.

యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా బాలయ్య తన మాస్ మేనియా చూపిస్తున్నారు. అయితే అలాంటి బాలకృష్ణతో బాబీ ఒక వెరైటీ స్టోరీ చెప్పబోతున్నారని తెలుస్తుంది. ఎన్.బి.కె 109 సినిమా బందిపోటు దొంగల వేట బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతుందట. ఈ సినిమాలో బాలయ్య క్యారెక్టరైజేషన్ ఫ్యాన్స్ కి బీభత్సంగా నచ్చేస్తుందని అంటున్నారు. సినిమాలో ఇంపార్టెంట్ రోల్ లో దుల్కర్ సల్మాన్ నటిస్తున్నారు.

బాలయ్య, దుల్కర్ సీన్స్ కూడా సినిమాలో హైలెట్ గా నిలుస్తాయని తెలుస్తుంది. వాల్తేరు వీరయ్య హిట్ తర్వాత బాబీ బాలయ్య కోసం అద్భుతమైన రివెంజ్ యాక్షన్ కథ రాసుకున్నారట. సినిమా సెట్స్ మీద ఉన్నప్పుడే హిట్ వైబ్స్ కనిపిస్తున్నాయని మేకర్స్ చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ రెడీ చేస్తున్నారట చిత్ర యూనిట్.

ఎన్.బి.కె 109 ఆడియన్స్ కు స్పెషల్ ట్రీట్ అందిస్తుందని అంటున్నారు. ఇక ఈ సినిమాను ఈ ఇయర్ డిసెంబర్ కల్లా లేదా 2025 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. సినిమా విషయంలో మేకర్స్ మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదని తెలుస్తుంది. బాలయ్యతో బాబీ బాక్సాఫీస్ పై తమ స్టామినా చూపించాలని చూస్తున్నారు. వరుస హిట్లతో దూసుకెళ్తున్న బాలకృష్ణ ఈ సినిమాతో కూడా మరో సూపర్ హిట్ టార్గెట్ పెట్టుకున్నారు.

బాలకృష్ణ రెగ్యులర్ మాస్ సినిమాలకు భిన్నంగా పవర్ ఫుల్ స్టోరీ టెల్లింగ్ తో యాక్షన్ ఘట్టాలతో బాబీ ఈ మూవీ చేస్తున్నారని తెలుస్తుంది. సినిమా రిలీజ్ తర్వాత యాక్షన్ సీన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకునేలా వాటిని డిజైన్ చేశారట. సినిమా మొత్తం భారీ స్కేల్ లో చేస్తున్నారని అర్ధమవుతుండగా అందుకు తగినట్టుగానే ఆడియన్స్ ఎంగేజ్ చేసేలా ఉంటుందని చెబుతున్నారు.