Begin typing your search above and press return to search.

NBK 109 కూలెస్ట్ & క్రూయెలెస్ట్ రూపం చూడండి

ఇప్పుడు మ‌హాశివ‌రాత్రి సంద‌ర్భంగా మ‌రో ఇంటెన్స్ పోస్ట‌ర్ ని రిలీజ్ చేసింది చిత్ర‌బృందం. ఇందులో శివ‌రాత్రి రోజున వ‌యొలెన్స్ కి వెల్ కం చెబుదాం.

By:  Tupaki Desk   |   7 March 2024 2:32 PM GMT
NBK 109 కూలెస్ట్ & క్రూయెలెస్ట్ రూపం చూడండి
X

న‌ట‌సింహా నందమూరి బాలకృష్ణ టాలీవుడ్ లో అత్యంత బిజీ స్టార్ల‌లో ఒకరు. చివరిగా ఆయ‌న‌ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన యాక్షన్ డ్రామా 'భగవంత్ కేసరి'లో కనిపించారు. తదుప‌రి బాబీ కొల్లి ద‌ర్శ‌క‌త్వంలో NBK 109లో న‌టిస్తున్నారు. ఈ చిత్రం 2024లో మోస్ట్ అవైటెడ్ తెలుగు సినిమాగా రికార్డుల‌కెక్కింది.

రాజస్థాన్‌లో కీలకమైన షెడ్యూల్‌ను చిత్రీకరించారు. మరికొద్ది రోజుల్లో ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ వెల్లడించ‌నున్నారు. NBK 109 మేక‌ర్స్ ఇప్పటికే విడుద‌ల చేసిన గ‌త పోస్ట‌ర్‌లో గొడ్డలి -సన్ గ్లాసెస్ తో వ‌యొలెంట్ గా క‌నిపించాడు బాల‌య్య‌. బ్లడ్ బాత్ కా బ్రాండ్ నేమ్... వయొలెన్స్ కా విజిటింగ్ కార్డ్! అనే ట్యాగ్ లైన్ ని బ‌ట్టి ఇది హింసాత్మక యాక్షన్ ప్యాక్డ్ మసాలా ఎంటర్‌టైనర్ అనే ఇండికేషన్ వ‌చ్చింది.

ఇప్పుడు మ‌హాశివ‌రాత్రి సంద‌ర్భంగా మ‌రో ఇంటెన్స్ పోస్ట‌ర్ ని రిలీజ్ చేసింది చిత్ర‌బృందం. ఇందులో శివ‌రాత్రి రోజున వ‌యొలెన్స్ కి వెల్ కం చెబుదాం.. అంటూ బాల‌య్య బాబు గొడ్డ‌లి ప‌ట్టుకుని ఇంటెన్స్ గా క‌నిపిస్తున్న పోస్ట‌ర్ ని రిలీజ్ చేసారు. ఈ పోస్ట‌ర్ ని బ‌ట్టి టీజ‌ర్ గ్లింప్స్ మాస్ ని మ‌రో లెవ‌ల్లో ట‌చ్ చేయ‌డం ఖాయ‌మ‌ని భ‌రోసా ల‌భించింది. ''ఈ మహా శివరాత్రి #NBK లో చక్కని & క్రూరమైన రూపాన్ని చూడటానికి సిద్ధంగా ఉండండి! అనే వ్యాఖ్య‌ను జోడించ‌డంతో బాల‌య్య‌లో రెండు కోణాల‌ను టీజ‌ర్ గ్లింప్స్ లో విడుద‌ల చేయ‌నున్నార‌ని అర్థ‌మ‌వుతోంది.

ఎన్‌బికె 109ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తుండగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ కీలక పాత్రలో నటించనున్నాడనే వార్తలు వినిపించినా ఆ త‌ర్వాత అతడు వైదొలిగాడ‌ని గుస‌గుస‌లు వినిపించాయి. అయితే ఏ విషయాన్ని అధికారికంగా ధృవీకరించలేదు. యానిమ‌ల్ లో అద్భుత న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్న బాబి డియోల్ ఇందులో ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తుండ‌డం స‌ర్వ‌త్రా ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

చిరంజీవి వాల్టెయిర్ వీరయ్య ..పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాలకు దర్శకత్వం వహించిన బాబీ కొల్లి NBK 109 తో మ‌రో విజ‌యాన్ని ఖాతాలో వేసుకోవాల‌ని ఉవ్విళ్లూరుతున్నాడు. అలాగే బాలకృష్ణ పాపుల‌ర్ టాక్ షో - 'NBKతో అన్‌స్టాపబుల్' విజయవంతమైన సీజన్ తర్వాత మరో ఎగ్జ‌యిటింగ్ సీజ‌న్ వీక్షించేందుకు అభిమానులు చాలా ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు.