Begin typing your search above and press return to search.

బాలయ్యకు మళ్ళీ అదే సెంటిమెంట్… నిజమైతే హిట్టే!

ఇదిలా ఉంటే ఈ సినిమాలో కూడా బాలయ్య డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇంటర్వెల్ బ్యాంగ్ యాక్షన్ ఎపిసోడ్ లో బాలయ్య సెకండ్ లీడ్ ఎంట్రీ ఉంటుందంట.

By:  Tupaki Desk   |   15 March 2024 5:37 AM GMT
బాలయ్యకు మళ్ళీ అదే సెంటిమెంట్… నిజమైతే హిట్టే!
X

బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ ప్రస్తుతం తన 109వ చిత్రం చేస్తోన్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది. వాల్తేరు వీరయ్య తర్వాత బాబీ చేస్తోన్న మూవీ ఇదే కావడంతో అంచనాలు భారీగానే నెలకొని ఉన్నాయి. అలాగే వరుస హ్యాట్రిక్ హిట్స్ సొంతం చేసుకున్న బాలయ్య నుంచి మరో యాక్షన్ ప్యాక్డ్ మూవీగా ఈ చిత్రం సిద్ధం అవుతోంది.

బాలయ్య సినిమా అంటేనే అభిమానులు సాలిడ్ యాక్షన్ సీక్వెన్స్ ఎక్స్ పెక్ట్ చేస్తారు. ఆయనకి సక్సెస్ ఇచ్చిన మూవీస్ అన్ని కూడా యాక్షన్ డ్రామాలుగా తెరకెక్కినవే కావడం విశేషం. ఇదిలా ఉంటే బాబీ కూడా ఎక్కువగా యాక్షన్ అండ్ కమర్షియల్ జోనర్ లోనే మూవీస్ చేస్తూ సక్సెస్ లు అందుకుంటున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా పోస్టర్స్ టీజర్స్ కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశాయి. బాలయ్య ఉరమాస్ గెటప్ లోనే స్టయిలిష్ గా కూడా హైలెట్ అవుతారని తెలుస్తోంది.

మెగాస్టార్ చిరంజీవికి సెకండ్ ఇన్నింగ్ లో వాల్తేరు వీరయ్యతో సాలిడ్ బ్లాక్ బస్టర్ ఇచ్చాడు దర్శకుడు బాబీ. ఆ సినిమా యాక్షన్ కమర్షియల్ మూవీగానే తెరకెక్కించారు. ఇక ఆ సినిమాకి మించి NBK 109 సినిమా ఉంటుందని బాలయ్య బాబు అభిమానులు అంచనా వేస్తున్నారు. రీసెంట్ గా బాలయ్య ఫస్ట్ లుక్ వీడియో ని రిలీజ్ చేయగా, దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో కూడా బాలయ్య డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇంటర్వెల్ బ్యాంగ్ యాక్షన్ ఎపిసోడ్ లో బాలయ్య సెకండ్ లీడ్ ఎంట్రీ ఉంటుందంట. ఈ క్యారెక్టర్ చాలా సర్ప్రైజింగ్ గా ఉండబోతోందని తెలుస్తోంది. లెజెండ్ తరహాలో ఈ యాక్షన్ ఎపిసోడ్ ని బాబీ డిజైన్ చేసారంట. బాలయ్య డ్యూయల్ రోల్ చేస్తున్నాడంటేనే ఆ మూవీ కచ్చితంగా హిట్ అవుతుంది.

అఖండ, వీరసింహారెడ్డి, లెజెండ్, సింహా సినిమాలు అన్ని కూడా డ్యూయల్ రోల్ లో వచ్చి సక్సెస్ అందుకున్నవే అందుకే బాబీ సినిమాకి కూడా ఈ సెంటిమెంట్ కలిసి వస్తుందని భావిస్తున్నారు. ఈ ఏడాది ఆఖరులో సినిమా ప్రేక్షకుల ముందుకి రానున్నట్లు తెలుస్తోంది. బాబీ డియోల్ ఈ సినిమాలో ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఊర్వశీ రౌతేలా ఓ కీలక పాత్రలో కనిపించబోతోంది.

ఇక సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులను వీలైనంత త్వరగా ఫినిష్ చేసి త్వరలోనే విడుదల చేయాలని అనుకుంటున్నారు. సినిమాకు సంబంధించిన ఫస్ట్ సాంగ్ కు కూడా జెట్ స్పీడ్ లో విడుదల చేయాలని అనుకున్నారు. మరి సెంటిమెంట్ పాయింట్ తో వస్తున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.