Begin typing your search above and press return to search.

ఆ న‌టుడి భార్య‌ అప్పుడే సెకెండ్ లీడ్స్!

ఇందులో న‌జ్రియా సెకెండ్ లీక్ కి ఎంపికైంద‌ని కోలీవుడ్ లో ప్ర‌చారం సాగుతోంది.

By:  Tupaki Desk   |   9 Sep 2023 11:30 PM GMT
ఆ న‌టుడి భార్య‌ అప్పుడే సెకెండ్ లీడ్స్!
X

మాలీవుడ్ బ్యూటీ న‌జ్రియా న‌జీమ్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచిత‌మే. 'అంటే సుంద‌రానికీ' సినిమాతో లాంచ్ అయిన అమ్మ‌డు అటుపై మ‌ళ్లీ క‌నిపించ‌లేదు. ఆ సినిమా వైఫ‌ల్యంతో అవ‌కాశాలు రాలేదు. ఆమె కూడా ఇక్క‌డ జ‌ర్నీని అంత సీరియ‌స్ గా తీసుకుని ప్ర‌య‌త్నాలు చేసిన‌ట్లు క‌నిపించ‌లేదు. మ‌రి ఇక్క‌డ తాను సాంధించ‌లేనిది భ‌ర్త ఫ‌హాద్ ఫాజిల్ సాధిస్తున్నాడ‌ని అనుకుందో! ఏమో గానీ ఇక్క‌డ కెరీర్ వెరీ లైట్ అనేసింది.

అయితే మాలీవుడ్ లో మాత్రం కొన్నాళ్ల పాటు బాగానే సినిమాలు చేసింది. 2014 వ‌ర‌కూ బిజీ న‌టిగానే కొన‌సాగింది. ప‌హాద్ తో వివాహం త‌ర్వాత సినిమాలు అక్క‌డా పెద్ద‌గా చేయ‌లేదు. అప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ సెల‌క్టివ్ గా నాలుగైదు సినిమాలు చేసింది. అప్ప‌టివ‌ర‌కూ బిజీ న‌టిగా కొన‌సాగిన అమ్మ‌డు ఒక్క‌సారిగా ఇలా వేగం త‌గ్గించే స‌రికి కుటుంబ జీవితాన్నే కోరుకుంటుందని భావించారు.

కానీ టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత అమ్మ‌డి కెరీర్ మ‌ళ్లీ అన్ని చోట్లా స్పీడ‌ప్ అవుతుంద‌ని భావిం చారు. కానీ అలా జ‌ర‌గ‌లేదు. అన్ని చోట్లా అదే ప‌రిస్థితి క‌నిపిస్తుంది. తాజాగా సూర్య హీరోగా సుధ కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో న‌జ్రియా సెకెండ్ లీక్ కి ఎంపికైంద‌ని కోలీవుడ్ లో ప్ర‌చారం సాగుతోంది. మెయిన్ లీడ్ లో శంక‌ర్ కుమార్తె అదితి శంక‌ర్ ని తీసుకున్న‌ట్లు ప్ర‌చారం లో ఉంది.

ఆమె గ‌నుక లాక్ అయితే న‌జ్రియా సెకెండ్ లీడ్ లోనూ..లేక‌పోతే మెయిన్ లీడ్ కి ప్ర‌మోట్ అయ్యే అవ‌కాశం ఉంద‌ని వినిపిస్తోంది. ఏది ఏమైనా న‌జ్రియాకిది సెకెండ్ ఇన్నింగ్స్ అని చెప్పాలి. వివాహం త‌ర్వాత గ్యాప్ కొంత‌వ‌ర‌కూ ప్ర‌తికూల‌త చూపుతున్న‌ట్లే క‌నిపిస్తోంది.

సొంత భాష‌లో కూడా సినిమాలు చేయ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్యంగానే ఉంది. అయితే న‌జ్రియా నిర్మాత‌గా మాలీవుడ్ లో మూడు సినిమాలు నిర్మించింది. ప్ర‌స్తుతం నాల్గ‌వ సినిమా సెట్స్ లో ఉంది. నిర్మాత‌గా బిజీ అవ్వ‌డంతోనూ నజ్రియా న‌ట‌న‌పై ఆనాస‌క్తి గా ఉండొచ్చు.