Begin typing your search above and press return to search.

నయన్ ఎక్కడ తగ్గట్లేదు..!

మొన్నటిదాకా సౌత్ లోనే అదరగొట్టిన నయనతార జవాన్ సినిమాతో బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటింది.

By:  Tupaki Desk   |   22 Nov 2023 10:45 AM GMT
నయన్ ఎక్కడ తగ్గట్లేదు..!
X

మొన్నటిదాకా సౌత్ లోనే అదరగొట్టిన నయనతార జవాన్ సినిమాతో బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటింది. లేడీ సూపర్ స్టార్ ట్యాగ్ లైన్ కు ఏమాత్రం తీసిపోని విధంగా నయనతార సినిమాలు ఉంటున్నాయి. బాలీవుడ్ లో తొలి సినిమా హిట్ పడగానే అక్కడ నుంచి క్రేజీ ఆఫర్లు వస్తున్నాయి. అయినా కూడా కోలీవుడ్ లోనే ఆమె సినిమాలు చేస్తుందని తెలుస్తుంది. సౌత్ హీరోయిన్స్ లో 10 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే స్టార్ హీరోయిన్ నయనతార అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు

పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా నయనతార దూకుడు ఏమాత్రం తగ్గలేదు. కెరీర్ లో వెనక్కి తిరిగి చూసుకోకుండా సినిమాలు చేస్తూ వచ్చిన నయనతార 75 సినిమాల మైల్ స్టోన్ ను రీచ్ అయ్యింది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న సినిమా 75వ సినిమా అవ్వడం విశేషం. మాధవన్, సిద్ధార్థ్ లు ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటుగా అన్నపూరణి అనే మరో సినిమా కూడా సైన్ చేసింది నయనతార.

లేటెస్ట్ గా మరో కొత్త సినిమాకు ఓకే చెప్పిందట అమ్మడు. అరుణ్ రాజా కామరాజ్ డైరెక్షన్ లో ఫిమేల్ సెంట్రిక్ సినిమా చేస్తుంది నయనతార. నటుడిగా, సింగర్ గా, గీత రచయితగా పరిచయమైన అరుణ్ రాజా కామరాజ్ డైరెక్టర్ గా ఖన సినిమా చేశారు. ఆ సినిమా హిట్ అవ్వడంతో ఉదయనిధి స్టాలిన్ హీరోగా నెంజిక్కు నీతి సినిమా చేశారు. ఆ తర్వాత లేబుల్ వెబ్ సీరీస్ చేశారు. కార్తితో ఒక సినిమా చేస్తున్నట్టు వార్తలు వచ్చినా ఆ సినిమా ఏమైందో కానీ నయనతార హీరోయిన్ గా ఒక సినిమా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాకు ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు.

ఈ సినిమా కోసం కూడా నయనతార భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. నయన్ చేస్తున్న ఈ సినిమాలతో ఆమె ఫ్యాన్స్ ఫుల్ ఖుషిగా ఉన్నారు. 100 సినిమాలు చేసి రికార్డ్ కొట్టాలనే టార్గెట్ పెట్టుకున్న నయనతార ఆ ప్రయత్నంలోనే సినిమాలు చేస్తూ వస్తుంది. ఓ పక్క పిల్లలను చూసుకుంటూనే మరోపక్క సినిమాలకు తన ఫుల్ ఎఫర్ట్స్ పెట్టేస్తుంది నయన్.