Begin typing your search above and press return to search.

మణిరత్నం-కమల్ హాసన్‌తో.. నయన్‌కి 12 కోట్లు?

తాజా నివేదికల ప్రకారం, ఈ చిత్రంలో తన పాత్ర కోసం నయ‌న్ ఏకంగా 12 కోట్లు డిమాండ్ చేసినట్లు సమాచారం.

By:  Tupaki Desk   |   14 Nov 2023 1:46 AM GMT
మణిరత్నం-కమల్ హాసన్‌తో.. నయన్‌కి 12 కోట్లు?
X

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్లలో నయనతార ఒకరు. ప్రముఖ నిర్మాతలు దర్శకుల మొదటి ఎంపిక న‌య‌న్. ఇటీవలే జవాన్ అనే బ్లాక్ బస్టర్ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఇందులో షారుఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించారు. దీనికి అట్లీ దర్శకత్వం వహించారు. ఇటీవల కమల్ హాసన్ - మణిరత్నం కాంబినేష‌న్ సినిమాకి నాయిక‌ను వెతుకుతున్నార‌ని స‌మాచారం. తాత్కాలికంగా KH234 పేరుతో ఇది సెట్స్ పైకి వెళుతోంది. ఈ సినిమాలో నటించ‌నున్న‌ హీరోయిన్లు కూడా ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా నయనతారను సంప్రదించాలని మేకర్స్ ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. తాజా నివేదికల ప్రకారం, ఈ చిత్రంలో తన పాత్ర కోసం నయ‌న్ ఏకంగా 12 కోట్లు డిమాండ్ చేసినట్లు సమాచారం. జవాన్ కోసం అందుకున్న‌ రెమ్యునరేషన్ కంటే రూ.2 కోట్లు ఎక్కువ. దీనికి సంబంధించి మేకర్స్ నుంచి ఇంకా ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు.

నిజానికి కమల్ హాసన్ - మణిరత్నంల కలయికపై చాలా అంచనాలు ఉన్నాయి. ఇంతకుముందు ఈ చిత్రంలో క‌థానాయిక పాత్ర కోసం ఐశ్వర్యరాయ్ బచ్చన్ - త్రిష కృష్ణన్‌లను పరిశీలిస్తున్నట్లు క‌థ‌నాలొచ్చాయి. తాజాగా నయనతార పేరు ఈ జాబితాలో చేరిపోయింది. కథానాయిక పేరు ఇంకా మేకర్స్ ప్రకటించలేదు. మణిరత్నం ద‌ర్శ‌క‌త్వంలో నయనతారను ఎప్పుడూ చూడలేదు. ఆసక్తికరంగా రావణన్ చిత్రంలో విక్రమ్ సోదరిగా నటించడానికి మణిరత్నం నయనతార కోసం ప్ర‌య‌త్నించారు. కానీ వీలుప‌డ‌లేదు. ఆ పాత్రను చివరికి ప్రియమణి పోషించింది. ఇప్పుడు చర్చలు స‌ఫ‌ల‌మైతే కమల్‌హాసన్‌, నయనతార కలిసి తొలిసారిగా పెద్ద తెరపై కనిపించే వీలుంది.

రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ - మద్రాస్ టాకీస్ బ్యానర్‌పై కమల్ హాసన్, మణిరత్నం, ఆర్ మహేంద్రన్, శివ అనంతి సంయుక్తంగా KH234ని నిర్మిస్తున్నారు. రెడ్ జెయింట్ ఫిలింస్ ఉదయనిధి స్టాలిన్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు.