Begin typing your search above and press return to search.

న‌య‌న్-విఘ్నేష్ సింగ‌పూర్‌లో జాలీ ట్రిప్

ఆ ఇద్దరూ టీ-షర్టులు జీన్స్ ధరించి చాలా క్యాజువ‌ల్ గా కనిపించారు. న‌య‌న్ తాను షేర్ చేసిన ఫోటోలకు 'ఖో గయే హమ్ కహాన్' పాటను నేపథ్య స్కోర్‌గా ఉపయోగించారు.

By:  Tupaki Desk   |   26 Feb 2024 8:35 AM GMT
న‌య‌న్-విఘ్నేష్ సింగ‌పూర్‌లో జాలీ ట్రిప్
X

నయనతార- విఘ్నేష్ శివన్ సింగపూర్‌లో వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ జంట‌ రొమాంటిక్ బ్లాక్ అండ్ వైట్ ఫోటో తాజాగా విడుదలై వైర‌ల్ గా మారింది. ఈ ఫోటోలో విఘ్నేష్ త‌న స‌తీమ‌ణి న‌య‌న‌తార‌ మెడ చుట్టూ చేతులు వేసి త‌న‌ను వెనుక నుండి కౌగిలించుకోవ‌డం హైలైట్ అయింది. ఆ ఇద్దరూ టీ-షర్టులు జీన్స్ ధరించి చాలా క్యాజువ‌ల్ గా కనిపించారు. న‌య‌న్ తాను షేర్ చేసిన ఫోటోలకు 'ఖో గయే హమ్ కహాన్' పాటను నేపథ్య స్కోర్‌గా ఉపయోగించారు. విఘ్నేష్ తన ఇన్‌స్టా ఖాతాలో సింగపూర్‌లోని నైట్ వైబ్స్ నుంచి కొన్ని వీడియోలు ఫోటోలను షేర్ చేసారు.

ఈ అంద‌మైన జంట‌కు వివాహ‌మై రెండేళ్ల‌వుతోంది. వారికి ఉయిర్-ఉలగ్ అనే ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. వెకేష‌న్ లో త‌మ కిడ్స్ తో క‌లిసి ఈ జంట‌ విలువైన స‌మ‌యాన్ని ఆస్వాధిస్తున్నారు. అయినా దంప‌తులు కేవ‌లం రొమాంటిక్ డేట్ కి సంబంధించిన ఫోటోల‌ను మాత్ర‌మే షేర్ చేసారు. ప్ర‌స్తుతం ఈ రొమాంటిక్ డేట్ కి సంబంధించిన ఫోటోలు నెటిజ‌నుల్లో వైర‌ల్ అవుతున్నాయి.

దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ 2024లో షారూఖ్ ఖాన్, కరీనా, నయనతార మెరుపులు మెరిపించిన‌ సంగ‌తి తెలిసిందే. నయనతార 'జవాన్' చిత్రానికి ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది. విఘ్నేష్ శివన్ తన తదుపరి దర్శకత్వ వెంచర్ 'లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్' చిత్రం కోసం పని చేస్తున్నాడు. ఇందులో ప్రదీప్ రంగనాథన్, SJ సూర్య, కృతి శెట్టి ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. నయనతార చివరిగా 'అన్నపూర్ణి: ది గాడెస్ ఆఫ్ ఫుడ్' సిరీస్‌లో కనిపించింది. తదుపరి ఎస్. శశికాంత్ దర్శకత్వం వహించిన 'టెస్ట్'లో కనిపించనుంది. ఈ చిత్రంలో ఆర్. మాధవన్, సిద్ధార్థ్, మీరా జాస్మిన్ ప్రధాన పాత్రలు పోషించారు.