Begin typing your search above and press return to search.

భార్య‌భ‌ర్త‌ల కొత్త వ్యాపారం ఇది!

'ఈరోజు మా అధికారిక ఖాతా అయిన 9స్కిన్ అఫిషియ‌ల్‌ను గ‌ర్వంగానూ, సంతోషంగానూ ప్ర‌క‌టిస్తున్నాను.

By:  Tupaki Desk   |   15 Sep 2023 12:30 AM GMT
భార్య‌భ‌ర్త‌ల కొత్త వ్యాపారం ఇది!
X

న‌య‌న‌తార ఇప్ప‌టికే బిజినెస్ ఉమెన్ గా మారిన సంగ‌తి తెలిసిందే. విగ్నేశ్ శివ‌న్ తో వివాహం త‌ర్వాత సినిమాల ప‌రంగా సెల‌క్టివ్ గా ఉంటూ వ్యాపార రంగంలోకి ప్ర‌వేశించింది. చెన్నైకు చెందిన ఛాయ్ వ్యాపారంలో నయనతార పెట్టుబడులు పెట్టారు. పలువురు ఇన్వెస్టర్లు ఉన్న ఆ ఛాయ్ వాలె బ్రాండ్‌లో భాగ‌స్వామిగా కొన‌సాగుతున్నారు. ఆమె ఎంట్రీ త‌ర్వాత భ‌ర్త విగ్నేష్ శివ‌న్ కూడా ఇదే వ్యాపారంలో పెట్టుబ‌డులు పెట్టారు. దీంతో దంప‌తుల తొలి బిజినెస్ ఇదే అయింది.

తాజాగా ఈ జంట స్కిన్ కేర్ ప్రొడ‌క్ట్ బిజినెస్ ప్రారంభించారు. ఈ విష‌యాన్ని అధికారికంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకున్నారు. 'ఈరోజు మా అధికారిక ఖాతా అయిన 9స్కిన్ అఫిషియ‌ల్‌ను గ‌ర్వంగానూ, సంతోషంగానూ ప్ర‌క‌టిస్తున్నాను. సెల్ఫ్ ఎంతో ముఖ్య‌మ‌ని నేను న‌మ్మాను. ఆరేళ్ల కృషి, ప్రేమ‌ను మీతో పంచుకోవ‌టానికి ఎంతో ఆనందిస్తున్నాను. ఈ సెప్టెంబ‌ర్ 29 నుంచి ప్ర‌యాణం మొద‌లు కానుంది. ఆ రోజు నుంచి మా స్కిన్ కేర్ ప్రొడ‌క్ట్‌ను మా అధికారిక సైట్‌లో కొనుగోలు చేయ‌వ‌చ్చు' అని తెలిపారు.

దీంతో దంప‌తులిద్ద‌రికీ అభిమానులు విషెస్ తెలియ‌జేస్తున్నారు. వృత్తి ప‌రంగా ఇద్ద‌రు ఎంతోబిజీగా ఉంటారు. 'జ‌వాన్' చిత్రంతో న‌య‌న‌తార బాలీవుడ్ జ‌ర్నీ కూడా మొద‌లైంది. ఇక‌పై త‌మిళ్ సినిమాల‌తో పాటు హిందీ సినిమాలు చేస్తుంది.

తొలి సినిమాతోనే భారీ స‌క్సెస్ అందుకోవ‌డంతో అమ్మ‌డు అక్క‌డా భారీ పారితోషికం అందుకునే అవ‌కాశం ఉంది. అలాగే ఈ జోడీ కోలీవుడ్ లో సొంత నిర్మాణ సంస్థ రౌడీ పిక్చ‌ర్స్ ని కూడా స్థాపించిన సంగ‌తి తెలిసిందే.

అందులో ఇద్ద‌రు క‌లిసి పెట్టుబ‌డులు పెడుతున్నారు. అలాగే ఇద్ద‌రి పేరిట కొన్ని ఖ‌రీదైన అపార్ట్ మెంటులు కూడా ఉన్నాయి. వాటి ద్వారా భారీగా ఆదాయం స‌మ‌కూరుతుంది. ద‌ర్శ‌కుడిగా విగ్నేష్ శివ‌న్ స‌క్సెస్ ఫుల్ గా సినిమాలు చేస్తున్నాడు. ఏటా అత‌ని ఆదాయం కోట్ల‌లో ఉంటుంది. ఇలా ఇద్ద‌రి ఆదాయంతోనే కొత్త వ్యాపారాలు షురూ చేస్తున్నారు. భ‌విష్య‌త్ లో ఇంకెన్ని బిజినెస్ లు ప్రారంభిస్తారో చూడాలి.