Begin typing your search above and press return to search.

నయనతార అప్సెట్… షారుఖ్ ఖాన్ ఓదార్పు!

ఇదిలా ఉంటే తాజాగా షారుఖ్ ఖాన్ ట్విట్టర్ లో పెట్టిన పోస్ట్ చూసిన తర్వాత నిజంగానే నయనతార తన పాత్ర విషయంలో అప్సెట్ అయ్యిందనే టాక్ వినిపిస్తోంది.

By:  Tupaki Desk   |   23 Sep 2023 4:50 AM GMT
నయనతార అప్సెట్… షారుఖ్ ఖాన్ ఓదార్పు!
X

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ నయనతార జవాన్ సినిమతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకొని వెయ్యి కోట్ల కలెక్షన్స్ దిశగా పరుగులు పెడుతోంది. పఠాన్ తర్వాత మరోసారి జవాన్ సినిమాతో షారుఖ్ కలెక్షన్స్ ప్రభంజనం సృష్టిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో నయనతార లీడ్ రోల్ చేసిన ఆమె స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉంటుంది.

ఈ విషయంలో నయనతార దర్శకుడు అట్లీపై కోపంగా ఉందని, తనకి చెప్పిన విధంగా పాత్ర లేదని అసహనం వ్యక్తం చేసినట్లు కోలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తోంది. ఆమె కంటే దీపికా పదుకునే పాత్రకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో నయనతార హర్ట్ అయ్యిందనే టాక్ జోరుగా ప్రచారం అవుతోంది. అయితే తాజాగా అట్లీకి బర్త్ డే విషెస్ చెప్పడంతో ఈ విమర్శలకి నయనతార ఫుల్ స్టాప్ పెట్టింది.

ఇదిలా ఉంటే తాజాగా షారుఖ్ ఖాన్ ట్విట్టర్ లో పెట్టిన పోస్ట్ చూసిన తర్వాత నిజంగానే నయనతార తన పాత్ర విషయంలో అప్సెట్ అయ్యిందనే టాక్ వినిపిస్తోంది. జవాన్ చిత్రంలో సింగిల్ మదర్ నర్మద చాలా బలమైన పాత్ర.

ఆ పాత్ర అద్భుతంగా ఉంటుందని నేను భావించాను. అయితే దురదృష్టవశాత్తు నర్మద పాత్రకి స్క్రీన్ టైం తక్కువగా ఉంది అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

ఓ అభిమాని పెట్టిన పోస్ట్ ని షారుఖ్ ఖాన్ రెప్లై ఇస్తూ ఈ విధంగా రెస్పాండ్ అయ్యారు. దీనిని బట్టి నయనతార పాత్ర నిడివి తగ్గడంపై షారుఖ్ ఖాన్ కూడా కొంత నిరాశ చెందినట్లు అర్ధమవుతోంది. ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్ డ్యుయల్ రోల్ పోషించారు. దీపికా పదుకునే గెస్ట్ అపీరియన్స్ ఇచ్చారు. విజయ్ సేతుపతి పవర్ ఫుల్ విలన్ గా ఈ చిత్రంలో నటించాడు.

ఇప్పటికి అదిరిపోయే కలెక్షన్స్ తో జవాన్ మూవీ నార్త్ ఇండియాలో రన్ అవుతోంది. ఈ చిత్రంతో ఆర్ఆర్ఆర్ మూవీ రికార్డులు బ్రేక్ చేయవచ్చనే టాక్ వినిపిస్తోంది.