Begin typing your search above and press return to search.

నయన్ ఇటు మాత్రం రావట్లే..

తెలుగు చిత్రాల ద్వారానే స్టార్ హీరోయిన్ గా ఎదిగి ఇప్పుడు టాలీవుడ్ ని చిన్న చూపు చూస్తోందని కొంత మంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   13 Sep 2023 4:01 AM GMT
నయన్ ఇటు మాత్రం రావట్లే..
X

సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న అందాల భామ నయనతార. ఈ అమ్మడు ప్రస్తుతం కోలీవుడ్ లో లేడీ సూపర్ స్టార్ బ్రాండ్ తో దూసుకుపోతోంది. అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న సౌత్ హీరోయిన్ గా కూడా నయనతార ఉంది. ఆమెకి ఇంత స్టార్ ఇమేజ్ రావడానికి కారణం తెలుగు సినిమా అని చెప్పాలి. టాలీవుడ్ లో స్టార్ హీరోలందరితో నయనతార ఆడిపాడింది.

అవి సక్సెస్ కావడంతో నయనతార కూడా నెంబర్ వన్ హీరోయిన్ గా మారింది. తరువాత కోలీవుడ్ లోకి అడుగుపెట్టి అక్కడ కూడా వరుస విజయాలు అందుకుంది. సోలోగా లేడీ ఒరియాంటెడ్ కథలతో సక్సెస్ లు అందుకుంది. అయితే కోలీవుడ్ లో ఆమెని ఫ్యాన్స్ చాలా ప్రత్యేకంగా చూస్తారు. రీసెంట్ గా జవాన్ మూవీ బ్లాక్ బస్టర్ కావడంతో నయనతార ఇమేజ్ కూడా అమాంతం పెరిగిపోయింది.

ప్రస్తుతం జయం రవితో చేసిన ఇరైవన్ మూవీ రిలీజ్ కి రెడీగా ఉంది. అయితే నయనతారని టాలీవుడ్ లో ఒక సినిమా కోసం బడా నిర్మాత సంప్రదించారంట. రెమ్యునరేషన్ కూడా గట్టిగానే ఆఫర్ చేసారంట. కానీ ఆమె మాత్రం చేయడానికి ఆసక్తి చూపించలేదనే టాక్ వినిపిస్తోంది. కనీసం కథ కూడా వినడానికి మొగ్గు చూపించలేదంట. ప్రస్తుతం ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఎందుకనో తెలుగు సినిమాలు చూడటానికి నయనతారకి ఎలాంటి ఆసక్తి లేదనే ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలుగు చిత్రాల ద్వారానే స్టార్ హీరోయిన్ గా ఎదిగి ఇప్పుడు టాలీవుడ్ ని చిన్న చూపు చూస్తోందని కొంత మంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆమె చివరిగా తెలుగులో సైరా నరసింహారెడ్డి చిత్రంలో కనిపించారు. ఆ మూవీలో మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రనే చేసింది.

అయితే వరుస కమిట్మెంట్ లు ఉండటంతోనే ఆమె ప్రాజెక్ట్ చేయడం లేదనే మరో టాక్ కూడా వినిపిస్తోంది. కేవలం డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోవడం వలన రెమ్యునరేషన్ ఎక్కువగా ఇచ్చిన కూడా ఆసక్తి చూపించలేదని కోలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తోన్న మాట. ప్రస్తుతం నయనతార ఓ వైపు తల్లిగా ఇద్దరు పిల్లల బాధ్యత చూసుకుంటూ మరో వైపు సినిమాలు చేస్తూ ఉండాలి. ఇది కొద్దిగా కష్టంగా కూడుకున్నది. అందుకే ఎక్కువ సినిమాలు చేయడం లేదని టాక్.