Begin typing your search above and press return to search.

14 ఏళ్లు ఖాళీగా ఉన్న డైరెక్ట‌ర్ తో లేడీ సూప‌ర్ స్టార్!

లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార సోలోగా స‌త్తా చాట‌డానికి ఎంత‌గా ప్ర‌య‌త్నిస్తుందో తెలిసిందే.

By:  Tupaki Desk   |   28 March 2024 12:30 PM GMT
14 ఏళ్లు ఖాళీగా ఉన్న డైరెక్ట‌ర్ తో లేడీ సూప‌ర్ స్టార్!
X

లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార సోలోగా స‌త్తా చాట‌డానికి ఎంత‌గా ప్ర‌య‌త్నిస్తుందో తెలిసిందే. ఇప్ప‌టికే అమ్మ‌డు కొన్ని లేడీ ఓరియేంటెడ్ చిత్రాలు చేసింది. కానీ అవేవి న‌య‌న‌తార సోలో ఇమేజ్ ని పెద్ద‌గా ప్రోజెక్ట్ చేయ‌లేదు. ఓవైపు క‌మ‌ర్శియ‌ల్ సినిమాలు చేస్తున్నా? న‌య‌న్ మ‌న‌సంతా సోలో చిత్రాల‌పైనే ఉంది. గ‌త ఏడాది ల్యాండ్ మార్క్ చిత్రంగా రిలీజ్ చేసిన 75వ సినిమా `అన్న‌పూర్ణి` కూడా స‌రైన ఫ‌లితం సాధించ లేదు. దీంతో అమ్మ‌డు లేడీ ఓరియేంటెడ్ చిత్రాల‌పై మ‌రింత క‌సిగా ప‌నిచేసే ఆలోచ‌న‌తో ముందుకు క‌దు లుతుంది.

స‌రైన కంటెంట్..డైరెక్ట‌ర్ కోసం ఎదురు చూస్తోంది. మ‌రి ఇలాంటి స‌మ‌యంలో న‌య‌న్ తీసుకున్న నిర్ణ‌యా నికి అంతా స్ట‌న్ అవ్వాల్సిందే. అవును అమ్మ‌డు ఇప్పుడే ఏకంగా 14 ఏళ్ల పాటు డైరెక్ష‌న్ కి దూరంగా శ‌శి కుమార్ ని రంగంలోకి దించుతుంది. కోలీవుడ్ లో న‌టుడిగా శ‌షికుమార్ ఎంతో ఫేమ‌స్. చాలా సినిమాలు చేసాడు. ద‌ర్శ‌కుడిగా ప‌నిచేసింది మాత్రం కేవ‌లం రెండు సినిమాలే. `సుబ్ర‌మ‌ణ్య‌పురం` అనే సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌య్యాడు. అప్ప‌ట్లో ఆ సినిమా మంచి విజ‌యాన్ని సాధించింది.

అటుపై రెండేళ్ల గ్యాప్ అనంత‌రం `ఈస‌న్` అనే మ‌రో సినిమా చేసాడు. కానీ అది పెద్ద‌గా ఆడ‌లేదు. ఆ త‌ర్వాత ఆయ‌న మ‌ళ్లీ కెప్టెన్ కుర్చీ ఎక్కింది లేదు. న‌టుడిగా కొన‌సాగాడు త‌ప్ప సినిమాలు డైరెక్ట్ చేయ‌లే దు. మళ్లీ 14 ఏళ్ల గ్యాప్ అనంత‌రం న‌య‌న‌తార ద‌ర్శ‌కుడిగా అవ‌కాశం క‌ల్పిస్తుంద‌ని స‌మాచారం. మ‌రి ఈ ఛాయిస్ న‌య‌న‌తార తీసుకుందా? శ‌షి కుమార్ స‌రైన క‌థ‌తో ముందుకు రావ‌డంతో ఒకే చెప్పిందా? అన్న‌ది తెలియాలి.

ప్ర‌స్తుతం శ‌శికుమార్ న‌టుడిగా అంత బిజీగా లేడు. గ‌తేడాది క‌మిట్ అయిన ప్రాజెక్ట్ లే చేస్తున్నాడు. రెండు చిత్రాలు ఆన్ సెట్స్ లో ఉండ‌గా..మ‌రో సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో ఉంది. అలాగే నిర్మాత‌గా పసంగ్ అనే చిత్రాన్ని నిర్మించాడు. గాయ‌కుడిగానూ రెండు..మూడు సినిమాల‌కు ప‌నిచేసాడు.