Begin typing your search above and press return to search.

మ‌రోసారి సీనియ‌ర్ హీరోతో న‌య‌నానందం!

వీరిద్ద‌రి ఎంట్రీ కూడా ఆయా సినిమాల‌కు అంతే పాజిటివ్ గా మారుతుంది.

By:  Tupaki Desk   |   15 May 2024 8:30 AM GMT
మ‌రోసారి సీనియ‌ర్ హీరోతో న‌య‌నానందం!
X

సీనియ‌ర్ హీరోల‌తో న‌య‌న‌తార తెర‌ను పంచుకుంటే ఆ క్రేజ్ వేరుగా ఉంటుంది. మార్కెట్ లో న‌య‌న్ బ్రాండ్ ఇమేజ్ ఆ సినిమాకి అద‌నంగా క‌లిసొస్తుంది అన్న‌ది వాస్త‌వం. అమ్మ‌డికి పాన్ ఇండియా వైడ్ ఉన్న ఫాలోయింగ్ తోనే ఇది సాధ్యమ‌వుతుంది. అందుకే ఈ మ‌ధ్య కాలంలో కొంత మంది ద‌ర్శ‌కులు ఇదే స్ట్రాట‌జీని అను సరిస్తున్నారు. అందాల త్రిష‌ని కూడా ఈ కోణంలో తెర‌పైకి తెచ్చి హైలైట్ చేస్తున్నారు. ఫాంలో ఉన్న‌ది కేవ‌లం న‌యన‌తార కావ‌డంతో? ప్ర‌త్యామ్నాయంగా త్రిష‌ని హైలైట్ చేస్తున్నారు. వీరిద్ద‌రి ఎంట్రీ కూడా ఆయా సినిమాల‌కు అంతే పాజిటివ్ గా మారుతుంది.

వ‌య‌సుకు త‌గ్గ హీరోలు..పాత్ర‌లు కూడా అంతే ప‌క్కాగా కుద‌ర‌డంతో ప‌ర్పెక్ట్ గా సూట‌వుతున్నారు. ఇప్ప‌టికే ఇద్ద‌రు భామ‌లు మాలీవుడ్ లో కూడా జోరుగా సినిమాలు చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా న‌య‌న‌తార మ‌రోసారి మ‌ల‌యాళం స్టార్ మ‌మ్ముట్టితో తెర‌ను పంచుకోవ‌డానికి రెడీ అవుతోంది. గౌత‌మ్ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్క‌నుంది. ప్ర‌స్తుతం గౌత‌మ్ న‌య‌న్ తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్లు స‌మాచారం. గౌత‌మ్ మీన‌న్ తో కూడా న‌య‌న‌తార ఇంత‌వ‌ర‌కూ సినిమాలు చేయ‌లేదు. ఈ నేప‌థ్యంలో న‌య‌న్ ఛాన్స్ ని మిస్ చేసుకునే అవ‌కాశం లేదు.

అయితే మ‌మ్ముట్టితో మాత్రం ఇప్ప‌టికే ఓ సినిమా చేసింది. ఇద్ద‌రి కాంబినేష‌న్ లో `పుతియా నియ‌మ‌మ్` అనే సినిమా చేసింది. ఆ సినిమా మంచి విజ‌యం సాధించింది. ఈ నేప‌థ్యంలో మ‌రోసారి ఆ జోడీ తెర‌పైకి రావ‌డం అభిమానుల్లో ఆస‌క్తిక‌రంగా మారింది. మ‌రి న‌య‌న్ ఆ ఛాన్స్ తీసుకుంటుందా? లేదా? అన్న‌ది చూడాలి. ప్ర‌స్తుతం న‌య‌న‌తార `డియ‌ర్ స్టూడెంట్స్` అనే సినిమా చేస్తుంది. వీటితో పాటు కొన్ని లేడీ ఓరియేంటెడ్ క‌థ‌లు విని సిద్దంగా ఉంది.

వాటిని ఫైన‌ల్ చేయాల్సి ఉంది. అలాగే త‌న సొంత కంపెనీకి చెందిన బ్యూటీ ప్రొడ‌క్టల్ని కూడా ప్ర‌మోట్ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. సొంత నిర్మాణ సంస్థ రౌడీ పిక్చ‌ర్స్ లో సినిమాలు కూడా నిర్మిస్తోంది. అవ‌స‌రం మేర వాటిలో గెస్ట్ రోల్స్ సైతం పోషించి త‌న బ్రాండ్ తో సినిమా జ‌నాల్లోకి వెళ్లేలా చూస్తుంది. ఇందంతా గ‌త రెండు..మూడు సంవ‌త్స‌రాలుగా వ‌చ్చిన మార్పులు. ఇంత‌కు ముందు న‌య‌న్ వేరు. ఇప్ప‌టి న‌య‌న్ వేరు అన‌డానికి ఇవి కొన్ని సంకేతాలు అనొచ్చు.