Begin typing your search above and press return to search.

జవాన్.. నయన్ రెమ్యునరేషన్ ఎంతంటే..

బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ హీరోగా నటించిన తాజా చిత్రం జవాన్. తొలిసారి షారూక్ ఓ తమిళ డైరెక్టర్ దర్శకుడు అట్లీ డైరెక్షన్ లో చేసిన సినిమా ఇది.

By:  Tupaki Desk   |   11 Sep 2023 12:30 AM GMT
జవాన్.. నయన్ రెమ్యునరేషన్ ఎంతంటే..
X

బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ హీరోగా నటించిన తాజా చిత్రం జవాన్. తొలిసారి షారూక్ ఓ తమిళ డైరెక్టర్ దర్శకుడు అట్లీ డైరెక్షన్ లో చేసిన సినిమా ఇది. ఈ మూవీ బాక్సాఫీసును షేక్ చేసింది. కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ మూవీలో షారూక్ ని చూపించిన విధానానికి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఈ మూవీతో షారూక్ మరోసారి తన సత్తాను చాటాడు.

ఇప్పటికే ఈ మూవీ రూ.100కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. మరింత ఎక్కువ వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా, ఈ మూవీలో షారూక్ సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన విషయం తెలిసిందే. ఆమె నటనకు కూడా ప్రశంసల వర్షం కురుస్తోంది. నయన్ ఈ మూవీలో మరింత అందంగా కనిపించింది. యాక్షన్ సీన్స్ కూడా అదరగొట్టింది. పోలీసు పాత్రలో మెప్పించింది.

కాగా, ఈ మూవీ విడుదల తర్వాత నయన్ కి సంబంధించిన ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. అది ఆమె రెమ్యూనరేషన్ కి సంబంధించినది కావడం విశేషం. ఈ మూవీలో నటించినందుకు గాను, నయన తార దాదాపు రూ.11కోట్లు తీసుకుందట. ఈ విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అయితే, ఆమె అంత రెమ్యూనరేషన్ తీసుకోవడంలో ఎలాంటి తప్పులేదనే కామెంట్స్ వినపడుతున్నాయి.

ఎందుకంటే, దక్షిణాదిన నయనతారకు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఆమె ఇప్పటి వరకు కూడా భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంది. అయితే, ఈ మూవీకి మరింత ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. నిర్మాతలు కూడా ఆమెకు అంత మొత్తం ఇవ్వడానికి అంగీకరించడంతోనే నయన్ ఈ మూవీలో నటించారు.

కాగా, ఈ యాక్షన్ డ్రామా సినిమాకి అనిరుధ్ సంగీతం అందించారు. మ్యూజిక్ మూవీకి మరింత హెల్ప్ అయ్యింది. పాటలు కూడా బాగున్నాయి. ఇదిలా ఉండగా, ఈ మూవీ విడుదల సమయంలోనే నయనతార తొలిసారిగా ఇన్ స్టాగ్రామ్ లోకి అడుగుపెట్టారు. కాగా, ఆమె అలా అడుగుపెట్టిందో లేదో ఇలా ఫాలోవర్స్ రావడం విశేషం. కేవలం కొన్ని గంటల్లోనే ఆమెకు మిలియన్ల ఫాలోవర్స్ ఆమెను ఫాలో అయ్యారు.