Begin typing your search above and press return to search.

షాకింగ్ : నయనతార సినిమాకి 'A' సర్టిఫికేట్

నయనతార 'ఇరైవన్‌' సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. సెప్టెంబర్‌ 28న విడుదల కాబోతున్న ఈ సినిమా సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.

By:  Tupaki Desk   |   22 Sep 2023 7:34 AM GMT
షాకింగ్ : నయనతార సినిమాకి A సర్టిఫికేట్
X

లేడీ సూపర్ స్టార్‌ నయనతార పాన్ ఇండియా రేంజ్ లో దూసుకు పోతుంది. ఇటీవలే షారుఖ్‌ ఖాన్ తో నటించిన జవాన్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా వెయ్యి కోట్ల వసూళ్లు సాధించడంతో పాటు నయనతార పాత్రకు మంచి రెస్పాన్స్ దక్కింది. దాంతో నయనతార సినిమాలకు మరింత డిమాండ్ పెరిగింది అనడంలో సందేహం లేదు.


నయనతార 'ఇరైవన్‌' సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. సెప్టెంబర్‌ 28న విడుదల కాబోతున్న ఈ సినిమా సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సాధారణంగా అయితే నయనతార సినిమాలకు క్లీ యూ సర్టిఫికెట్‌ లు ఎక్కువగా వస్తాయి. కానీ ఇరైవన్ సినిమాకు ఏ సర్టిఫికెట్‌ రావడం షాకింగ్ గా ఉంది.

హింస ఎక్కువ ఉండటం వల్ల ఈ సినిమాకు ఏ సర్టిఫికెట్‌ ను సెన్సార్ బోర్డు ఇచ్చి ఉంటుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. దర్శకుడు అహ్మద్‌ ఈ సినిమాను యాక్షన్‌ థ్రిల్లర్‌ గా రూపొందించాడు. యువన్ శంకర్ రాజా ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు.

నయనతార సినిమా ను తమిళం తో పాటు తెలుగు లో కూడా విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొన్ని వారాల తర్వాత తెలుగు లో ఈ సినిమాను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా సెన్సార్‌ నుండి ఏ సర్టిఫికెట్‌ ను దక్కించుకోవడంతో మాస్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షిస్తోంది.