Begin typing your search above and press return to search.

ఒకే ఒక్క బ్లాక్ బ‌స్ట‌ర్‌తో హిందీలో త‌లైవి క్రేజ్

జవాన్ అద్భుత విజయంతో బాలీవుడ్‌లో న‌య‌న్ కి డిమాండ్ అమాంతం పెరిగింది.

By:  Tupaki Desk   |   18 Sep 2023 5:25 AM GMT
ఒకే ఒక్క బ్లాక్ బ‌స్ట‌ర్‌తో హిందీలో త‌లైవి క్రేజ్
X

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌తో స‌మాన హోదాను ఆస్వాధిస్తున్న ఏకైక న‌టిగా న‌య‌న‌తార‌కు పేరుంది. కోలీవుడ్‌లో త‌లైవిగా పిలుపందుకుంది. ఇప్పుడు న‌య‌న్ పాన్ ఇండియా స్టార్. హిందీ డెబ్యూ చిత్రం జవాన్ భారీ విజయంతో న‌య‌న్ ఎంతో ఆనందంగా ఉంది. కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ స‌ర‌స‌న న‌టించిన ఈ సినిమా 400కోట్ల వ‌సూళ్ల‌ను సాధించి ఇప్ప‌టికీ విజ‌య‌వంతంగా ర‌న్ అవుతోంది. ఈ విజ‌యంతో న‌య‌న్ క్రేజ్ అసాధార‌ణంగా పెరిగింద‌ని స‌మాచారం.

జవాన్ అద్భుత విజయంతో బాలీవుడ్‌లో న‌య‌న్ కి డిమాండ్ అమాంతం పెరిగింది. ప‌లువురు నిర్మాతలు తమ త‌దుప‌రి చిత్రాల కోసం లేడీ సూపర్‌స్టార్‌తో చర్చలు జరుపుతున్నార‌ని స‌మాచారం. ఆఫ‌ర్లు వెల్లువెత్తుతున్నా నయనతార తన అనుమ‌తిని తెలియ‌జేసే ముందు ప్ర‌తిదీ జాగ్రత్తగా పరిశీలించి, చాలా తెలివిగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని తెలిసింది. నయనతార సౌత్ లో పూర్తి బిజీగా ఉంది. ఇరైవన్, థని ఒరువన్ 2, లేడీ సూపర్ స్టార్ 75, టెస్ట్‌ సహా ప‌లు ఇత‌ర‌ చిత్రాలతో కెరీర్ ప‌రంగా బిజీ. ఇలాంటి స‌మ‌యంలో సౌత్ సినిమాలు తగ్గించుకుంటేనే బాలీవుడ్ లో కెరీర్ ని స‌జావుగా కొన‌సాగించే వీలుంటుంది.

వ్య‌క్తిగ‌త జీవితంలో....నయనతార - విఘ్నేష్ శివన్ దంప‌తులు గత ఏడాది అక్టోబర్‌లో కవల కుమారులకు తల్లిదండ్రులు అయినట్లు ప్రకటించారు. అప్పటి నుండి ఈ జంట తమ నవజాత శిశువుల ఫోటోల‌ను సోష‌ల్ మీడియాల్లో అభిమానుల కోసం షేర్ చేస్తున్నారు. కెరీర్ ప‌రంగా ఎంత బిజీగా ఉన్నా త‌మ సంతానం కోసం విలువైన స‌మ‌యాన్ని వెచ్చించ‌డంలో న‌య‌న్ - విఘ్నేష్ జంట ఎప్పుడూ సిద్ధం. ఇటీవ‌ల జ‌వాన్ స‌క్సెస్ వేడుక‌కు హాజ‌రు కాలేక‌పోయిన‌ నయనతార తన తల్లి పుట్టినరోజు కావడంతో ఈ కార్యక్రమానికి రాలేకపోయింద‌ని తెలిసింది. అయితే ముంబై ప్రజలను, అభిమానులను, సహనటులను ఉద్దేశించి రికార్డ్ చేసిన సందేశాన్ని న‌య‌న్ ఈ స‌క్సెస్ వేదిక‌కు పంపింది. ఈ వీడియో సందేశంలో జవాన్‌లో న‌టిని అయినందుకు తాను ఎంత కృతజ్ఞతతో ఉన్నాన‌ని న‌య‌న్ పేర్కొంది. ఇది ఆరంభం మాత్రమేనని మళ్లీ హిందీ సినిమాల్లో నటిస్తానని న‌య‌న‌తార‌ పేర్కొన్నారు.

నయనతార నెక్ట్స్ ఏంటి? త‌లైవి న‌య‌న‌తార తదుపరి తమిళ చిత్రం 'ఇరైవన్‌'లో కనిపిస్తుంది. ఇందులో జయం రవి కూడా నటించారు. ఈ చిత్రాన్ని ఐ. అహ్మద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో తెర‌కెక్కిన ఈ చిత్రంలో రాహుల్ బోస్, ఆశిష్ విద్యార్థి, నరేన్, చార్లే తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.