Begin typing your search above and press return to search.

నయనతార గాడ్ టాక్ ఏంటి..?

తెలుగులో పెద్దగా ప్రమోషన్స్ లేని ఈ గాడ్ నయనతార, జయం రవి ఉన్నారు కాబట్టి ఆడియన్స్ చూసే అవకాశం ఉంది.

By:  Tupaki Desk   |   13 Oct 2023 1:40 PM GMT
నయనతార గాడ్ టాక్ ఏంటి..?
X

లేడీ సూపర్ స్టార్ నయనతార ఏ సినిమా చేసినా సరే సంథింగ్ స్పెషల్ గా ఉంటుంది. కోలీవుడ్ లో ఆమె సినిమా చేస్తే పక్కా హిట్ అనే టాక్ ఉంది. అక్కడ స్టార్స్ కి ఈక్వెల్ గా ఆమె క్రేజ్ కొనసాగుతుంది. ఈమధ్యనే షారుఖ్ తో జవాన్ అంటూ సెన్సేషనల్ పాన్ ఇండియా వైడ్ హిట్ అందుకున్న నయనతార లేటెస్ట్ గా గాడ్ అంటూ మరో సినిమాతో వచ్చింది. జయం రవి హీరోగా నయనతార ఫీమేల్ లీడ్ గా తెరకెక్కిన ఈ సినిమా తమిళంలో లాస్ట్ మంత్ రిలీజై ఓకే అనిపించుకుంది.

ఈ సినిమా తెలుగు వెర్షన్ ని నేడు ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. అసలైతే తమిళ రిలీజ్ తో పాటుగా తెలుగు రిలీజ్ చేయాలని అనుకున్నా థియేటర్ల సమస్య వల్ల కుదరలేదు. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన చాలా సినిమాల్లో గాడ్ ఒకటి. తెలుగులో పెద్దగా ప్రమోషన్స్ లేని ఈ గాడ్ నయనతార, జయం రవి ఉన్నారు కాబట్టి ఆడియన్స్ చూసే అవకాశం ఉంది. గాడ్ అంటూ సైకో థ్రిల్లర్ సినిమాఉ ఐ అహ్మద్ డైరెక్ట్ చేశారు.

బ్రహ్మ అలియాస్ స్మైలీ కిల్లర్ (రాహుల్ బోస్) అమ్మాయిలను అతి కిరాతకంగా అపరించి హత్య చేసి ఊరి అవతల శవాలని వదిలేసి వెళ్తుంటాడు. ఈ కేసుని చేధించేందుకు పోలీస్ ఆఫీసర్ అర్జున్ (జయం రవి) ఆ కిల్లర్ ని పట్టుకుంటాడు. అక్కడితో కథ ముగిసింది అనుకుంటే ఇతని స్టైల్ లోనే మర్డర్లు చేసే మరో అజ్ఞాత హంతకుడు ఇది కొనసాగిస్తుంటాడు. పోలీసులకు ఎదురయ్యే ఈ కొత్త సవాల్ లో చర్చి ఫాదర్ చేరదీసిన బాబు (వినోద్ కిషన్) ఈ కేసులో కీలకంగా మారతాడు.

వెబ్ సీరీస్, సినిమాల్లో చాలా సైకో కథలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వాటిలో కొన్ని అలరించగా కొన్ని ప్రేక్షకుల నుంచి నెగిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. ఈ గాడ్ కూడా అదే కేటగిరి కిందకు వస్తుంది. ఈ కథలో ఏదైనా కొత్తగా ఉంది అంటే ఒక సైకో బదులు ఇద్దరిని పెట్టడమే అంతే తప్ప మిగతాది అంతా రొటీన్ క్రైమ్ డ్రామా లానే ఉంటుంది. సినిమాలో మరో డిజప్పాయింట్ అంటే నయనతార అని చెప్పొచ్చు.

ఆమె పేరు చెప్పి సినిమా అమ్మేసుకోగా ఆమె పాత్ర నిరాశపరుస్తుంది. నయనతార పాత్ర కేవలం నామ మాత్రంగానే ఉంటుంది. రాహుల్ బోస్, వినోద్ లు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు కానీ రొటీన్ కంటెంట్ వల్ల కాస్త ఓవర్ గా అనిపిస్తుంది. రొటీన్ కథకు రెండు మూడు ట్విస్ట్ లు ఇచ్చి తీసిన గాడ్ సాగదీసినట్టుగా అనిపిస్తుంది. రెండున్నర గంటల దాకా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించడంలో నిరాశరప్చిందని చెప్పొచ్చు.