Begin typing your search above and press return to search.

పెద్దాయ‌న కోసం న‌య‌న‌తారా?

ఏకంగా 600 కోట్ల వ‌సూళ్ల‌తో ఎవ్వ‌రూ ఊహించ‌ని విజ‌యాన్ని న‌మోదు చేసింది.

By:  Tupaki Desk   |   24 Jan 2024 11:30 PM GMT
పెద్దాయ‌న కోసం న‌య‌న‌తారా?
X

పెద్దాయ‌న కోసం లేడీ సూప‌ర్ స్టార్ ని రంగంలోకి దించుతున్నారా? న‌య‌న‌తార త‌ప్ప మ‌రో భామ అయితే ఆయ‌న మార్కెట్ కి స‌రితూగ‌డం లేదా? అంటే అవుననే అనిపిస్తుంది. ఇంత‌కీ ఆ పెద్దాయ‌న ఎవ‌రు? ఏంటా క‌హానీ అంటే వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే. సూప‌ర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నెల్సన్ దిలీప్ కుమార్ తెర‌కెక్కించిన `జైలర్` గ‌తేడాది రిలీజ్ అయిన బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి సంచ‌ల‌నాలు న‌మోదు చేసిందో తెలిసిందే.

ఏకంగా 600 కోట్ల వ‌సూళ్ల‌తో ఎవ్వ‌రూ ఊహించ‌ని విజ‌యాన్ని న‌మోదు చేసింది. దీంతో ఇప్పుడీ సినిమాకి సీక్వెల్ కూడా రెడీ అవుతుంది. ఇప్ప‌టికే స్టోరీ లాక్ అయింది. అయితే ఇందులో ర‌జ‌నీ కి జోడీగా న‌య‌న‌తార‌ని సెట్ చేస్తున్నారుట‌. జైల‌ర్ భారీ విజ‌యం సాధించిన నేప‌థ్యంలో సీక్వెల్ లో న‌య‌న‌తార అయితే సినిమాకి మరింత బ‌జ్ స‌హా మార్కెట్ ప‌రంగానూ క‌లిసిసొస్తుంద‌ని ఆమెని రంగంలోకి దించుతున్నారుట‌.

అందుకుగాను అమ్మ‌డు భారీగానే పారితోషికం అందుకుంటుంద‌ని స‌మాచారం. తాను రెగ్యుల‌ర్ గా సైన్ చేసే సినిమాల‌కంటే ఈ సినిమాకి అధికంగానే ఛార్జ్ చేసే ప‌నిలో ఉందిట‌. న‌య‌న్ ఒక్కో సినిమాకి 10 కోట్లు తీసుకుంటుంది. కానీ జైల‌ర్ -2 కోసం అంతకు మించి డిమాండ్ చేస్తుంద‌నే ప్ర‌చారం కోలీవుడ్ లో సాగు బ‌తోంది. మ‌రి ఈ ప్ర‌చారంలో నిజ‌మెంతో తెలియాలి. `జైల‌ర్` ర‌జ‌నీకాంత్ కి జోడీగా ర‌మ్య కృష్ణ న‌టించింది.

అది వృద్ధ పాత్ర కావ‌డంతో ర‌మ్య‌కృష్ణ‌తో మ్యానేజ్ చేసారు. ఆ రెండు రోల్స్ కి ఇద్ద‌రు ప‌క్కాగా స‌రిపో యారు. ఐటం భామ‌గా త‌మ‌న్నా కాసేపు మెరిపించ‌డంతో తెరంతా గ్లామ‌ర్ నిండిన‌ట్లు అయింది. కానీ సీక్వెల్ పై మాత్రం అంత‌కు మించి అంచ‌నాలు ఏర్ప‌డుతున్న నేప‌థ్యంలో అందుకు త‌గ్గ‌ట్టే క్యాస్టింగ్ ఎంపిక కూడా చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే న‌య‌న‌తార‌-ర‌జ‌నీకా కాంబినేష‌న్ లో నాలుగు సినిమాలు రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే.