Begin typing your search above and press return to search.

న‌య‌న‌తార మ‌న‌సు గెలిచిన సినిమా ఇదే!

అంత‌కుముందు వ‌ర‌కూ గ్రామీణ వాతావ‌ర‌ణం ఉన్న పాత్ర‌లు పోషించ‌డం అప్పుడే 'బిల్లా' లో గ్లామ‌ర్ పాత్ర రావ‌డంతో త‌న కెరీర్ మొత్తం మారిపోయింద‌ని తెలిపింది.

By:  Tupaki Desk   |   28 Feb 2024 12:30 AM GMT
న‌య‌న‌తార మ‌న‌సు గెలిచిన సినిమా ఇదే!
X

లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార ఇప్ప‌టివ‌ర‌కూ ఎన్నో సినిమాల్లో న‌టించింది. ఎన్నో వైవిథ్య‌మైన పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల్ని అల‌రించింది. యాక్ష‌న్ చిత్రాలు..లేడీ ఓరియేంటెడ్ చిత్రాలు..అవ‌స‌రం మేర సీత పాత్ర‌లు ఒకటేంటి? వెండి తెర‌పై న‌య‌న్ చేయ‌ని సాహ‌సమంటూ లేద‌నే చెప్పాలి. పాత్ర‌ని బ‌ట్టి త‌న‌ను తాను మౌల్డ్ చేసుకుని ప్రేక్ష‌కుల హృద‌యా ల్లో స్థానం సంపాదించిన న‌టి ఆమె. ఎలాంటి పాత్ర‌లోనైనా ఒదిగిపోగ‌ల న‌టి అని ప్రూవ్ చేసుకుంది.

మ‌రి న‌య‌న‌తార మెచ్చిన పాత్ర ఏది? ఆమె ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డే రోల్ ఏది? ఆ సినిమా ఏంటి? అంటే న‌య‌న్ మ‌న‌సులో సైతం అలాంటి సినిమా..పాత్ర ఒక‌టి ఉంద‌ని తాజాగా లీక్ ఇచ్చింది న‌య‌న్. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన 'బిల్లా' చిత్రాన్ని విష్ణు వ‌ర్ధ‌న్ అజిత్ హీరోగా ఆ చిత్రాన్ని రీమేక్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇందులో అజిత్ కి జోడీగా న‌య‌న‌తార న‌టించింది. న‌య‌న్ గ్లామ‌ర్ పాత్ర యువ‌త‌ని ఓ ఊపు ఊపేసింది అన‌డంలో ఎలాంటి సందేహం లేదు.

అజిత్ యాక్ష‌న్ కి న‌య‌న్ గ్లామ‌ర్ తోడ‌వ్వ‌డంతోనే సినిమా అంత పెద్ద విజ‌యం సాధించింది. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో న‌య‌న‌తార ఈ సినిమా త‌న‌కు బాగా న‌చ్చిన చిత్రంగా రివీల్ చేసింది. 'బిల్లా' సినిమా త‌న కెరీర్ ట‌ర్న్ చేసింద‌ని అంది. అంత‌కుముందు వ‌ర‌కూ గ్రామీణ వాతావ‌ర‌ణం ఉన్న పాత్ర‌లు పోషించ‌డం అప్పుడే 'బిల్లా' లో గ్లామ‌ర్ పాత్ర రావ‌డంతో త‌న కెరీర్ మొత్తం మారిపోయింద‌ని తెలిపింది.

రోటీన్ పాత్ర‌ల నుంచి 'బిల్లా' రోల్ త‌న‌ని డీవియేట్ చేసింద‌ని...ఎలాంటి పాత్ర‌లు ఎంచుకుంటే ఆడియ న్స్ కి క‌నెక్ట్ అవుతుంద‌న్న‌ది ఆ సినిమా ఓ మార్గాన్ని వేసింద‌ని చెప్పుకొచ్చింది. గ్లామ‌రస్ గా న‌టించ‌డం కోస‌మే ప్ర‌త్యేకంగా ఆసినిమా అంగీక‌రించిన‌ట్లు రివీల్ చేసింది. ఇప్ప‌టివ‌ర‌కూ ఈ విష‌యాన్ని ఎక్క‌డా రివీల్ చేయ‌లేద‌ని ...ఆ పాత్ర గురించి బ‌య‌ట మాట్లాడ‌టం కూడా ఇదే తొలిసారి అని న‌వ్వేసింది.