Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : కలర్‌ ఫుల్‌ నయన్‌ క్రిస్మస్‌ సెలబ్రేషన్స్‌

లేడీ సూపర్ స్టార్‌ నయనతార తన ఇద్దరు కుమారుల ఫోటోలను ఈ మధ్య కాలంలో రెగ్యులర్ గా షేర్ చేస్తూ ఉంది.

By:  Tupaki Desk   |   26 Dec 2023 8:11 AM GMT
పిక్ టాక్ : కలర్‌ ఫుల్‌ నయన్‌ క్రిస్మస్‌ సెలబ్రేషన్స్‌
X

లేడీ సూపర్ స్టార్‌ నయనతార తన ఇద్దరు కుమారుల ఫోటోలను ఈ మధ్య కాలంలో రెగ్యులర్ గా షేర్ చేస్తూ ఉంది. తాజాగా క్రిస్మస్ సందర్భంగా తన కుమారులు అయిన ఉయిర్ రుద్రోనిల్ ఎన్ శివన్, ఉలగ్ ధైవాగ్ ఎన్ శివన్ లతో సందడి చేసిన ఫోటోలను షేర్‌ చేసింది.


పండుగ సందర్భంగా రెడ్ డ్రెస్ లో మొత్తం ఫ్యామిలీ అంతా కూడా సందడి చేశారు. నయనతార మరియు విఘ్నేష్‌ శివన్ లు సుదీర్ఘ కాలం పాటు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే. ప్రేమ మరియు పెళ్లి తర్వాత చాలా కాలం వీరి వివాహ బంధం కొనసాగదు అని చాలా మంది అనుకున్నారు.


విమర్శలు చేసిన వారందరికీ కూడా సమాధానం అన్నట్లుగా వీరి యొక్క వైవాహిక బంధం కొనసాగుతోంది. నయనతార మరియు విఘ్నేష్ శివన్‌ లు తమ ప్రతి పండుగను మరియు ప్రత్యేక సందర్భంను కూడా చాలా స్పెషల్‌ గా జరుపుకుంటూ సోషల్ మీడియా ద్వారా ఆ ఫోటోలు మరియు వీడియోలను షేర్ చేస్తూ ఉన్నారు.


నయనతార ఒక వైపు ఫ్యామిలీకి ఇంత సమయం కేటాయిస్తూనే మరో వైపు సినిమాలతో బిజీగా ఉంది. హిందీలో ఈమె నటించిన మొదటి సినిమా జవాన్‌ భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు వెయ్యి కోట్ల వసూళ్లు సాధించింది. మరోవైపు తమిళంలో ఈమె చేసిన అన్నపూర్ణి సినిమాతో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు తో పాటు తమిళంలో ఈమె సినిమాలు రాబోతున్నాయని తెలుస్తోంది.