Begin typing your search above and press return to search.

భ‌న్సాలీ మైండ్‌లో న‌య‌న్ రిజిస్ట‌ర్ కాలేదు

ప్ర‌స్తుతానికి భ‌న్సాలీ ద‌ర్శ‌క‌త్వంలో న‌య‌న‌తార న‌టిస్తున్నార‌న్న‌ది అవాస్త‌వం. కానీ అది నిజం కావాల‌ని త‌న అభిమానులు కోరుకుంటున్నారు.

By:  Tupaki Desk   |   12 Oct 2023 12:13 PM GMT
భ‌న్సాలీ మైండ్‌లో న‌య‌న్ రిజిస్ట‌ర్ కాలేదు
X

క‌ళాత్మ‌క చిత్రాల ద‌ర్శ‌కుడు సంజ‌య్ లీలా భ‌న్సాలీ ఓ సినిమా తెర‌కెక్కిస్తున్నారు అంటే.. దానిపై అనంతంగా చ‌ర్చ సాగుతుంది. ఆయ‌న ఎంపిక చేసుకునే కాన్వాస్, క‌థ కంటెంట్ పై అంత‌టి క్యూరియాసిటీ నెల‌కొంటుంది. అంతేకాదు.. భన్సాలీ ఎంపిక చేసుకునే న‌టీన‌టుల‌పైనా ఆరాలు అన్ లిమిటెడ్ గా సాగుతుంటాయి. ఇప్పుడు కూడా అదే జ‌రుగుతోంది.

భ‌న్సాలీ ఇప్ప‌టికే ఎంద‌రో క‌థానాయిక‌ల‌ను త‌న‌దైన శైలిలో తీర్చిదిద్దారు. క‌ళాత్మ‌క చిత్రాల రాణులుగా ఆవిష్క‌రించారు. ఇప్పుడు ఆ అరుదైన అవ‌కాశం న‌య‌న‌తార‌, కియ‌రా వంటి స్టార్ల‌కు ద‌క్కింద‌ని కొంత‌కాలంగా బాలీవుడ్ మీడియాలో క‌థ‌నాలు పుంఖానుపుంఖాలుగా వెలువ‌డుతున్న సంగ‌తి తెలిసిందే. ప‌ద్మావ‌త్ గా దీపిక ప‌దుకొనేను, ప్రియాంక చోప్రాను కాశీభాయి (భాజీరావ్ మ‌స్తానీ)గాను ఆవిష్క‌రించిన భ‌న్సాలీ ఇటీవ‌ల గంగూభాయి క‌థియావాడీలో ఆలియా భ‌ట్ ని గంగూ అనే వేశ్య పాత్ర‌లో అద్భుతంగా ఆవిష్క‌రించిన సంగ‌తి తెలిసిందే.

త‌న‌దైన క‌ళాత్మ‌క పంథాలో పాత్ర‌ధారుల్ని ఆవిష్క‌రించే భ‌న్సాలీ సినిమాలో న‌య‌న‌తార లాంటి మేటి సౌత్ స్టార్ ఎంపిక‌య్యార‌ని తెలియ‌గానే ఇటు ద‌క్షిణాదినా బోలెడంత క్యూరియాసిటీ నెలకొంది. అయితే న‌య‌న్ ఎంపిక‌పై ఇప్ప‌టివ‌ర‌కూ ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌నా లేక‌పోవ‌డంతో దీనిపై బోలెడంత చ‌ర్చ సాగుతోంది.

భ‌న్సాలీ ప్ర‌స్తుతం నెట్ ఫ్లిక్స్ కోసం హీరామండి అనే చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో అతిథీరావ్ హైద‌రీ స‌హా ప‌లువురు క‌థానాయిక‌లు న‌టిస్తున్నారు. ఇంత‌లోనే త‌న డ్రీమ్ ప్రాజెక్ట్ గా చెబుతున్న 'బైజు బావ్రా'లో న‌య‌న‌తార లేదా కియ‌రా అద్వాణీ న‌టించేందుకు ఆస్కారం ఉంద‌ని క‌థ‌నాలొచ్చాయి. జ‌వాన్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ లో న‌టించిన న‌య‌న‌తార తన రెండో చిత్రాన్ని భ‌న్సాలీ ద‌ర్శ‌క‌త్వంలో చేసేందుకు ఆస్కారం ఉందన్న క‌థ‌నాలు ఇటీవ‌ల వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో భ‌న్సాలీతో అవ‌కాశంపై బోలెడంత చ‌ర్చ సాగుతోంది.

కానీ ఇవ‌న్నీ త‌ప్పుడు క‌థ‌నాలు అని, సంజయ్ లీలా బైజు బావ్రాలో కియారా అద్వానీ లేదా నయనతార న‌టించ‌డం లేద‌ని ప్ర‌ముఖ బాలీవుడ్ పోర్ట‌ల్ క‌థ‌నం వెలువ‌రించింది. ప్రాజెక్ట్ బైజు బావ్రా గురించి ర‌క‌ర‌కాల త‌ప్పుడు క‌థ‌నాలు వెలువడుతున్నాయని పోర్ట‌ల్ లోని క‌థ‌నం చెబుతోంది.

బైజు బ‌వ్రాపై ర‌క‌ర‌కాల‌ ఊహాజనిత కథలు ప్ర‌చారంలో ఉన్నాయి. వికీపీడియాలో అందుబాటులో ఉన్న విజ‌య్ భ‌ట్ (విక్ర‌మ్ భట్ బంధువు) దర్శకత్వం వహించిన క్లాసిక్ మూవీ 'బైజు బావ్రా'( 1952)ని భ‌న్సాలీ రీమేక్ చేస్తార‌ని సాగుతున్న ప్ర‌చారంపైనా పూర్తి క్లారిటీ రాలేదు. నిజానికి భ‌న్సాలీ తెర‌కెక్కించే బైజు బ‌వ్రా ఒరిజిన‌ల్ సినిమాలాగా ఏమీ ఉండదు అని కూడా ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ పోర్టల్ వెల్ల‌డించింది.

తాజాగా అందిన స‌మాచారం మేర‌కు.. ఈ ప్రాజెక్ట్‌లో రణవీర్ - అలియా కూడా ఉండకపోవచ్చు అని తెలిసింది. భన్సాలీకి అత్యంత సన్నిహితుడు మాట్లాడుతూ, ''ప్రస్తుతానికి అతడి దృష్టి మొత్తం హీరామండి పోస్ట్ ప్రొడక్షన్‌పై ఉంది. అతడు బైజు బావ్రా గురించి అస్స‌లు ఆలోచించడం లేదు. అయినా ఆ సినిమాని భ‌న్సాలీయే ఎందుకు చేయాలి? చాలా మంది నిరాధార‌మైన వార్త‌ల‌ను క్రియేట్ చేస్తున్నారు'' అని స‌ద‌రు పోర్ట‌ల్ క‌థ‌నం ఉటంకించింది. ప్ర‌స్తుతానికి భ‌న్సాలీ ద‌ర్శ‌క‌త్వంలో న‌య‌న‌తార న‌టిస్తున్నార‌న్న‌ది అవాస్త‌వం. కానీ అది నిజం కావాల‌ని త‌న అభిమానులు కోరుకుంటున్నారు.