సూర్యోదయం వేళ గ్లామర్ టచ్ తో ఆకట్టుకుంటున్న నయనతార!
సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం సమ్మర్ స్పెషల్ సందర్భంగా తన ఫ్యామిలీతో కలిసి ఇటలీకి వెళ్ళింది.
By: Madhu Reddy | 26 May 2026 12:59 PM ISTసౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం సమ్మర్ స్పెషల్ సందర్భంగా తన ఫ్యామిలీతో కలిసి ఇటలీకి వెళ్ళింది. విదేశీ వీధుల్లో విహరిస్తూ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అక్కడి నుంచి రోజుకొక ఫోటోషూట్ తో అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇక అందులో భాగంగానే ఇప్పుడు మరోసారి లేటెస్ట్ అవుట్ ఫిట్ తో మరో కొత్త వెకేషన్ నుంచి ఫోటోలు షేర్ చేసి అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే తాజాగా విహారయాత్రలో భాగంగా ఇటలీలోని అద్భుతమైన వాస్తు శిల్పానికి ప్రసిద్ధి చెందిన వెనిస్ నగరంలో సందడి చేస్తోంది. ఇక అక్కడ సూర్యోదయం సమయంలో గ్రాండ్ కెనాల్ వైపు చూస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది.
అలాగే తన భర్త విగ్నేష్ శివన్ .. పిల్లలు ఉయిర్, ఉలగ్ లతో కలిసి సూర్యోదయాన్ని ఎంజాయ్ చేస్తున్న క్రేజీ ఫోటోలను కూడా ఆమె షేర్ చేసింది. ఇక ఈ ఉదయపు సూర్యకిరణాల సాక్షిగా ఈ అందమైన కుటుంబం దిగిన ఫోటోలు నెటిజనులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయ్. ఇక ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పర్ఫెక్ట్ ఫ్యామిలీ గోల్స్ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఫ్యామిలీ కోసం సమయాన్ని కేటాయించే అతి తక్కువ మంది సెలబ్రిటీలలో నయనతార ఎప్పుడు ముందు వరుసలో ఉంటుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇక నయనతార విషయానికి వస్తే.. తమిళ్, తెలుగు చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకొని.. తన అద్భుతమైన నటనతో సౌత్ లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈమె నేడు బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తూ మరింత బిజీగా మారిపోయింది. ఇక అందులో భాగంగానే ఈ మధ్యకాలంలో భాషతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ అలరిస్తున్న నయనతార.. అటు తన భర్త ప్రముఖ డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో కలిసి సినిమాలను కూడా రౌడీ పిక్చర్స్ అనే బ్యానర్ పై నిర్మిస్తూ నిర్మాతగా కూడా బిజీగా మారింది .నటిగా నిర్మాతగా మాత్రమే కాకుండా పలు బ్రాండ్ ఎండార్స్మెంట్లకు కూడా పనిచేస్తోంది. ఇక ఇంస్టాగ్రామ్ ద్వారా నిత్యం యాక్టివ్ గా ఉంటూ పలు రకాల ఫోటోలు షేర్ చేస్తూ ఇక్కడ కూడా ఆదాయాన్ని పెంపొందించుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.
నయనతార సినిమాల విషయానికి వస్తే.. ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాలో హీరోయిన్గా నటించి మంచి విజయాన్ని దక్కించుకుంది. అలాగే మమ్ముట్టి, మోహన్ లాల్ కాంబినేషన్లో వచ్చిన పేట్రియాట్ సినిమాలో కూడా నటించింది. అంతేకాదు మూకుత్తి అమ్మన్ 2 సినిమాతో పాటు గీతు మోహన్ దాస్ దర్శకత్వంలో యష్ హీరోగా నటిస్తున్న టాక్సిక్ సినిమాలో యష్ కి సోదరి పాత్రలో నటిస్తోంది . ఇలా ప్రస్తుతం గ్యాప్ లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ మరింత బిజీగా మారింది ఈ ముద్దుగుమ్మ . ప్రస్తుతం సమ్మర్ కావడంతో తన సినిమా షూటింగ్లకు బ్రేక్ ఏర్పడడం వల్లే ఇలా ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్ళింది.
