Begin typing your search above and press return to search.

నయన్ అప్పుడే మరో అవకాశం..?

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార ఈమధ్య కాస్త ఫాం కోల్పోయినట్టు అనిపించినా మళ్లీ తిరిగి వరుస ఛాన్స్ లు అందుకుంటుంది.

By:  Tupaki Desk   |   22 May 2025 3:00 PM IST
నయన్ అప్పుడే మరో అవకాశం..?
X

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార ఈమధ్య కాస్త ఫాం కోల్పోయినట్టు అనిపించినా మళ్లీ తిరిగి వరుస ఛాన్స్ లు అందుకుంటుంది. తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా నయన్ తిరిగి అవకాశాలు అందుకుంటుంది. మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి కాంబినేషన్ సినిమాలో నయనతార హీరోయిన్ గా లాక్ అయ్యింది. ఆ సినిమా ఓకే అవ్వడమే ఆలస్యం నయనతారకి తెలుగులో మళ్లీ వరుస ఛాన్స్ లు వస్తున్నట్టు తెలుస్తుంది.

మెగా 157 ఆఫర్ అందుకున్న అమ్మడు ఆ సినిమా లో ఆన్ బోర్డు అని అనౌన్స్ చేయడమే ఆలస్యం మరో ఆఫర్ కూడా అమ్మడికి వచ్చినట్టు తెలుస్తుంది. ఒక క్రేజీ స్టార్ హీరో సినిమాలో నయనతార ని హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుంటున్నట్టు తెలుస్తుంది. నయనతార కూడా ఆ మేకర్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఐతే ఆ ప్రాజెక్ట్ ఏంటి దాని వివరాలు మాత్రం బయటకు రాలేదు.

తమిళ్ లో స్టార్ గా కొనసాగుతున్న టైం లో కూడా తెలుగు ఆఫర్లను కాదనకుండా చేస్తూ వచ్చింది నయనతార. మన స్టార్స్ అయిన ప్రభాస్, ఎన్ టీ ఆర్ లతో కలిసి పనిచేసిన నయనతార సీనియర్ స్టార్స్ చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ నాగార్జునలతో కలిసి నటించింది. ఐతే కొన్నాళ్లుగా తెలుగు సినిమాలకు దూరంగా ఉన్న ఈ అమ్మడు మళ్లీ చిరు సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుంది. ఐతే చిరు సినిమా ఇలా సైన్ చేసిందో లేదో మరో అవకాశం కూడా అమ్మడి తలుపు తట్టిందని తెలుస్తుంది.

నయనతార మెగా సినిమాతో పాటు చేయనున్న ఆ నెక్స్ట్ సినిమా ఏది ఆ ఛాన్స్ ఎవరు అందుకుంటున్నారు అన్నది తెలియాలి ఉంది. ఐతే ఓ పక్క కోలీవుడ్ లో కూడా తన ఫాం ఏమాత్రం తగ్గకుండా కొనసాగిస్తుంది నయనతార. లేడీ సూపర్ స్టార్ ట్యాగ్ లైన్ కి న్యాయం చేస్తూ నయన్ చేస్తున్న సినిమాలు వాటి ఫలితాలు ఆమె ఫ్యాన్స్ ని సూపర్ సాటిస్ఫై చేస్తున్నాయి. మరి నయన్ దూకుడు చూస్తుంటే మళ్లీ తెలుగు తమిళ్ లో అదరగొట్టేందుకు సిద్ధమవుతుందనిపిస్తుంది. నయన్ తమిళ్ లో కూడా రెండు సినిమాలు చేస్తుంది. వాటితో కూడా మరోసారి తన స్టామినా చూపించాలని ఫిక్స్ అయ్యింది. ఐతే నయన్ తెలుగు రీ ఎంట్రీ ఆమె ఫ్యాన్స్ కి సూపర్ జోష్ అందిస్తుంది.