జనవరిలో నయనతారను ప్రీ రిలీజ్ లో చూడొచ్చా?
లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమా ప్రచార కార్యక్రమాలకు కెరీర్ ఆరంభంలోనే హాజరయ్యేది. టీజర్, ట్రైలర్ , ఆడియో వేడుకల్లో టీమ్ అందరితో పాటు పాల్గొనేది
By: Tupaki Desk | 28 May 2025 10:30 AMలేడీ సూపర్ స్టార్ నయనతార సినిమా ప్రచార కార్యక్రమాలకు కెరీర్ ఆరంభంలోనే హాజరయ్యేది. టీజర్, ట్రైలర్ , ఆడియో వేడుకల్లో టీమ్ అందరితో పాటు పాల్గొనేది. కానీ అమ్మడు స్టార్ అయిన తర్వాత ప్రచార కార్యక్రమాలు పుల్ స్టాప్ పెట్టేసింది. ప్రచారానికి అదనంగా చెల్లిస్తామన్నా? నో అనేసిది. కాలక్రమంలో ప్రచారం అనే పదమే తన డిక్షనరీలో లేకుండా చేసింది. అప్పటి నుంచి ఏ సినిమాకు కమిట్ అయినా? అగ్రిమెంట్ లో ముందే ఎలాంటి ప్రచారం పనులతో తనకు సంబంధం లేదని ఒప్పందం చేసుకోవడం మొదలు పెట్టింది.
అప్పటి నుంచి నిర్మాతలు కూడా ఆమెని అడగడం మానేసారు. తాను ఇచ్చిన కాల్షీట్ల ప్రకారం షూటింగ్ చేసుకోవడం..చెల్లించాల్సిన పైకం చెల్లించి పంపించడం జరుగుతుంది. నయనతార సొంతంగా బ్యానర్ స్థాపించినా? అందులో సినిమాలు కూడా చాలా కాలం పాటు తాను ప్రమోట్ చేయలేదు. కానీ కాలక్రమంలో కొంత మార్పు తీసుకొచ్చింది. తన సినిమాల్ని ప్రమోట్ చేసుకోవడం మొదలు పెట్టింది. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి 157వ సినిమా కోసం ఓ ప్రమోషనల్ వీడియో చేసింది.
సినిమా ప్రారంభో త్సవానికి ముందే ఇది జరిగింది. ఈ విషయంలో దర్శకుడు అనీల్ రావిపూడి ప్రోత్భబలం ఎంతో ఉంది. చాకచక్యంగా ఆమెని ఒప్పించడం..ఆమెలో వచ్చిన మార్పుతోనే ఇది సాధ్యమైంది. ఈ నేపథ్యంలో నయనతార ఇకపై సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లకు కూడా హాజరవుతుందా? అన్న డౌట్ రెయిజ్ అవుతుంది. ప్రచారం విషయంలో అమ్మడు తీరు మారడంతోనే 157వ సినిమా ప్రీ రిలీజ్ నయన్ హాజరయ్యే అవకాశం ఉందనిపిస్తుంది.
ఈ సినిమా ఈవెంట్ ఎలాగూ వచ్చే ఏడాది జనవరి తొలి వారంలో జరుగుతుంది. సంక్రాంతి రిలీజ్ కాబట్టి ప్రణాళిక ఇలాగే ఉంటుంది. మరి నయన్ అంతవరకూ వెయిట్ చేస్తుందా? మధ్యలో కొన్ని సినిమా రిలీజ్ లున్నాయి కాబట్టి వాటితోనే మొదలు పెడుతుందా? లేక 157 ప్రమోషనల్ వీడియోతోనే సరిపెడుతుందా? అన్నది చూడాలి.