మహేష్‌ను మించి నయన్ బ్రాండ్ వ్యాల్యూ..!
సినిమా స్టార్స్ తమ స్టార్డంను అనుసారంగా పారితోషికంను వసూళ్లు చేస్తూ ఉంటారు.
By: Tupaki Desk | 12 July 2025 1:00 PM ISTసినిమా స్టార్స్ తమ స్టార్డంను అనుసారంగా పారితోషికంను వసూళ్లు చేస్తూ ఉంటారు. ఒకప్పుడు హీరోలు, హీరోయిన్స్ కేవలం సినిమాలు మాత్రమే చేసేవారు, కానీ ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడం ద్వారా పెద్ద ఎత్తున సంపాధించుకుంటున్నారు. హీరోలు చాలా మంది తమ స్టార్ వ్యాల్యూను బట్టి భారీ పారితోషికంను డిమాండ్ చేస్తూ యాడ్స్‌లో నటిస్తున్నారు. యాడ్స్‌లో నటిస్తే కొన్ని లీగల్ సమస్యలు వస్తున్నాయని హీరోలు వెనుకాడుతున్నారు. కానీ కొందరు మాత్రం కాస్త జాగ్రత్తగా ఎంపిక చేసుకుని వరుసగా యాడ్స్ చేస్తున్నారు. టాలీవుడ్ హీరోల్లో అత్యధికంగా కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించే హీరో మహేష్ బాబు అనే విషయం తెల్సిందే.
ఆయన ఒక్కో యాడ్‌కి భారీ మొత్తంలో వసూళ్లు చేస్తూ ఉంటాడు. కంపెనీలను బట్టి, ఆ కంపెనీ తయారు చేస్తున్న ప్రాడెక్ట్‌లను బట్టి మహేష్ బాబు పారితోషికం వసూళ్లు చేస్తూ ఉంటాడని సమాచారం. ఇక సౌత్ హీరోయిన్స్‌లో చాలా మంది బ్రాండ్ అంబాసిడిర్‌గా వ్యవహరిస్తూ ఉంటారు. లేడీ సూపర్ స్టార్ నయనతార చాలా అరుదుగా మాత్రమే యాడ్స్‌లో కనిపిస్తూ ఉంటుంది. ఈమె ఎక్కువగా టాటా స్కై డీటీహెచ్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ ఉంటుంది. అందులోనూ చాలా సింపుల్ అండ్ స్వీట్ లుక్‌లో కనిపిస్తూ ఉంటుంది. తక్కువ సమయంలోనే ఎక్కువ యాడ్స్ చేయడం కంటే ఒకటి రెండు చేసి ఎక్కువ పారితోషికం అందుకోవాలని ఈమె భావిస్తుందని అంటారు.
టాటా స్కై తో కొత్తగా మరోసారి నయనతార ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. అందుకు గాను నయనతారకు సదరు కంపెనీ ఏకంగా రూ.10 కోట్ల పారితోషికం అందిస్తున్నారు. ఆ కంపెనీ కోసం నిమిషం నిడివి గల ఒక యాడ్‌లో నయనతార నటించింది. అంతే కాకుండా కొన్ని ఫోటోలను సైతం ఆ కంపెనీ కోసం ఇచ్చింది. ఇక తన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లో నయనతార ఏడాదిలో రెండు లేదా మూడు సార్లు ఆ కంపెనీ గురించి పోస్ట్ చేస్తుంది. అందుకు గాను ఏకంగా రూ.10 కోట్ల పారితోషికం అందుకుంటుంది. మహేష్ బాబు పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నప్పుడు తీసుకున్న పారితోషికం కంటే నయనతార తీసుకున్న ఈ పారితోషికం ఎక్కువగా ఉందని మార్కెట్ వర్గాల వారు అంటున్నారు. మహేష్ బాబు కొన్ని కంపెనీలకు రూ.10 కోట్లకు మించి తీసుకున్నాడని అంటారు.
నయనతార సినిమాల పబ్లిసిటీకి దూరంగా ఉంటుంది కానీ ఇలా భారీ పారితోషికం తీసుకుని మాత్రం కంపెనీ ఉత్పత్తులను ప్రమోట్ చేస్తుందా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం నయనతార తెలుగులో చిరంజీవికి జోడీగా అనిల్ రావిపూడి సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లిగా బిజీగా ఉన్నప్పటికీ సినిమాల్లో వరుస ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. చిరంజీవితో సినిమాలో నటించేందుకు గాను నయనతార రికార్డ్ స్థాయి పారితోషికం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. ప్రమోషన్స్‌కు దూరంగా ఉండే నయనతార ఈ సినిమా ప్రమోషన్‌కి హాజరు అయ్యేందుకు ఓకే చెప్పిందట, అందుకు గాను భారీ పారితోషికం డిమాండ్ చేసిందట. ఆమె అడిగిన పారితోషికం ఇచ్చి మరీ చిరంజీవి సినిమాలో నటింపజేస్తున్నారు.
