Begin typing your search above and press return to search.

గ్యాంగ్ స్ట‌ర్ గా లేడీ సూప‌ర్ స్టార్!

య‌శ్ క‌థానాయకుడిగా గీతూ మోహ‌న్ దాస్ ద‌ర్శ‌క‌త్వంలో `టాక్సిక్` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   9 Jun 2025 8:00 PM IST
గ్యాంగ్ స్ట‌ర్ గా లేడీ సూప‌ర్ స్టార్!
X

య‌శ్ క‌థానాయకుడిగా గీతూ మోహ‌న్ దాస్ ద‌ర్శ‌క‌త్వంలో `టాక్సిక్` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. కియారా అద్వాణి, తారా సుతారియా, న‌య‌న‌తార‌, హుమాఖురేష్‌, అక్ష‌య్ ఓబెరాయ్ లాంటి స్టార్ల‌తో భారీ కాన్వాస్ పై తెర‌కెక్కుతోంది. రిలీజ్ అయిన టీజ‌ర్ కు అంత గొప్ప రెస్పాన్స్ రాలేదు. రొటీన్ గానే అనిపిం చింది. అయితే టాప్ స్టార్ల‌ను రంగంలోకి దించ‌డంతో ఆ పాత్ర‌లు తెర‌పై ఎలా క‌నిపిస్తాయి? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

ముఖ్యంగా న‌య‌న‌తార‌పై పాత్ర‌పై తొలి నుంచి స‌స్పెన్స్ కొన‌సాగుతుంది. య‌శ్ కి జోడీగా న‌టిస్తుందా? నెగిటివ్ రోల్ పోషిస్తుందా? య‌శ్ కి సిస్ట‌ర్ రోల్ పోషిస్తుందా? అని ఇలా చాలా క‌న్పూ జ‌న్స్ ఉన్నాయి. వీటికి అప్పుడే స‌మాధానం దొర‌క‌డం క‌ష్టం. రిలీజ్ వ‌ర‌కూ ఆ స‌స్పెన్స్ వీడ‌దు. కానీ టాక్సిక్ లో అమ్మ‌డు గ్యాంగ్ స్ట‌ర్ పాత్ర పోషిస్తుంద‌ని క‌న్న‌డ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఆ పాత్ర చాలా రూడ్ గా ఉంటుంద‌ని క‌థ‌నాల సారాశం. 1940 లో సాగే గ్యాంగ్ స్ట‌ర్స్ స్టోరీ ఇది. అప్ప‌టి గ్యాంగ్ స్ట‌ర్స్ ఎలా ఉండేవారు? అన్న‌ది సినిమాలో హైలైట్ అయ్యే అంశం అంటున్నారు. న‌య‌న‌తార రోల్ కూడా అప్ప‌టి బ్యాక్ డ్రాప్ లోనే హైలైట్ అవుతుంద‌ని వినిపిస్తుంది. మ‌రి ఈ ప్ర‌చారంలో నిజ‌మెంతో తెలియాలి. ఇలాంటి పాత్ర‌లు లేడీ సూప‌ర్ స్టార్ కి కొత్తే కాదు. గ‌తంలో ప‌వ‌ర్ పుల్ చిత్రాలు కొన్ని చేసింది.

అందులో ఒక‌టి బిల్లా. డాన్ గాళ్ ప్రెండ్ పాత్ర‌లో అమ్మ‌డు అద‌ర‌గొట్టేసింది. అందంతోనే కాదు...బాండ్ బామ లా గ‌న్ ప‌ట్టిందంటే? ప్ర‌త్య‌ర్ది అమ్మ‌డి బుల్లెట్ కు బ‌ల‌వ్వాల్సిందే. ఆ రేంజ్ లో ఆ పాత్ర హైలైట్ అయింది. అందులో స్టైలిష్ పెర్పార్మెన్స్ తో అద‌ర‌గొట్టింది. టాక్సిక్ లో అంత‌కు మించి హైలైట్ అవుతుం దేమో చూడాలి.