చమురు- స్థిరాస్తి రంగంలో నయనతార హవా
చెన్నైలోని పోయెస్ గార్డెన్ పరిసరాల్లో నయన్ సొంత విలాసాల ఇల్లు కొలువు దీరి ఉంది. 2021లో ఈ విశాలమైన నాలుగు బెడ్‌రూమ్‌ల అపార్ట్‌మెంట్‌లో చేరారు.
By: Tupaki Desk | 25 Jun 2025 8:30 AM ISTకెరీర్ లో సుమారు 80 చిత్రాల్లో నటించిన మేటి నటి.. కేవలం 50 సెకన్లకు రూ. 5 కోట్లు వసూలు చేయగలదు.. రూ. 50 కోట్ల ప్రైవేట్ జెట్ సొంతంగా ఉంది.. సౌత్ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్లలో నటించి, 1000 కోట్ల క్లబ్ సినిమాతో హిందీ ఆరంగేట్రాన్ని అదరగొట్టింది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నిష్ణాతురాలు. గల్ఫ్ ఆయిల్ కంపెనీలో పెట్టుబడులు, లిప్ బామ్ కంపెనీ వ్యవస్థాపకురాలిగా సౌందర్య ఉత్పత్తుల రంగంలో ఎదుగుతున్న ఎంటర్ ప్రెన్యూర్ గాను వెలుగుతోంది.
బుల్లితెర నుంచి వెండితెరకు వచ్చిన నయన్ నటిగా తనను తాను ఆవిష్కరించుకున్న తీరు అసమానం. నయనతార కు ఉన్న గొప్ప ప్రజాదరణ , ఫాలోయింగ్ దృష్ట్యా బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ల నుంచి భారీగా ఆర్జిస్తోంది. శాటిలైట్ డిష్ కనెక్షన్ ప్రకటనలో కేవలం 50 సెకన్ల పాటు కనిపించడానికి నయన్ ఏకంగా రూ. 5 కోట్లు వసూలు చేసింది. నయన్ ఒక్కో చిత్రానికి రూ. 10 కోట్లు వసూలు చేస్తుంది. నయన్ నికర ఆస్తి విలువ దాదాపు రూ. 200 కోట్లు. సుమారు రూ. 50 కోట్ల విలువైన ప్రైవేట్ జెట్ తన సొంతం. భర్త విఘ్నేష్ తో కలిసి ఇంతకుముందు ఈ ప్రయివేట్ జెట్ లో విహారయాత్రలను ఆస్వాధించింది. ఆకస్మిక ప్రయాణాలకు దీనిని ఉపయోగిస్తుంది.
చెన్నైలోని పోయెస్ గార్డెన్ పరిసరాల్లో నయన్ సొంత విలాసాల ఇల్లు కొలువు దీరి ఉంది. 2021లో ఈ విశాలమైన నాలుగు బెడ్‌రూమ్‌ల అపార్ట్‌మెంట్‌లో చేరారు. వారికి సమీపంలో రజనీకాంత్ ,మాజీ పెప్సీ సీఈవో ఇంద్రా నూయి వంటి ప్రముఖుల ఇండ్లు ఉన్నాయి. నయన్ ఇల్లు 16,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. కేవలం బాత్రూమ్ 1,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. కొన్ని మినీ అపార్ట్‌మెంట్‌ల కంటే పెద్ద బాత్రూమ్ ని అభిరుచి మేరకు డిజైన్ చేయించుకుంది నయన్. హోమ్ థియేటర్, ప్రైవేట్ జిమ్, స్విమ్మింగ్ పూల్, ఫ్లోర్-టు-సీలింగ్ గ్లాస్ ప్యానెల్‌లు ఈ ఇంటిలో ప్రత్యేక ఆకర్షణ. ఇవి లష్ గార్డెన్ వ్యూతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి.
నయనతార విలాసవంతంగా జీవించడమే కాదు.. వ్యాపారాల్లో తెలివైన పెట్టుబడులు పెడుతున్నారు. రూ. 200 కోట్ల నికర ఆస్తులు కలిగి ఉన్న నయన్ రెవెన్యూలో సగానికి పైగా రియల్ ఎస్టేట్ పెట్టుబడుల నుంచి వచ్చింది. చెన్నై, హైదరాబాద్, దుబాయ్ లాంటి చోట్ల తనకు ఆస్తులు ఉన్నాయి. మ్యాజిక్‌బ్రిక్స్ వివరాల ప్రకారం..నయన్ రియల్ ఎస్టేట్ పోర్ట్‌ఫోలియో రూ.100 కోట్లకు పైగా ఉంది. దక్షిణ భారత సినీపరిశ్రమలో అత్యంత తెలివైన పెట్టుబడి దారుగా నయన్ తనను తాను ఆవిష్కరించుకుంది.
నయన్ తన తల్లిదండ్రులకు ఒక పోష్ ఫ్లాట్‌ను బహుమతిగా ఇచ్చి, తన వివాహానికి ముందే తెలివిగా రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. నయనతార కార్ల గ్యారేజీలో BMW 5 సిరీస్, BMW 7 సిరీస్, మెర్సిడెస్ GLS 350 D, ఫోర్డ్ ఎండీవర్, టయోటా ఇన్నోవా క్రిస్టా కూడా ఉన్నాయి.
నయన్ కు సొంత ప్రైవేట్ జెట్ ఉంది. రూ. 50 కోట్ల విలువైన ఈ విమానం నగరాల మధ్య వేగంగా ప్రయాణించడానికి, సెట్స్ కి వెళ్లేందుకు, కొన్నిసార్లు, విఘ్నేష్ - పిల్లలతో విదేశీ వెకేషన్లకు వెళ్లేందుకు దీనిని ఉపయోగిస్తుంది. భారతదేశంలో సొంత జెట్ కలిగి ఉన్న స్టార్లుగా రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రియాంక చోప్రా, శిల్పా శెట్టి వంటి ప్రముఖులు ఉన్నారు. వారి సరసనా నయన్ పేరు చేరింది.
2021లో చర్మవ్యాధి నిపుణుడు డాక్టర్ రెనిటా రాజన్‌తో కలిసి నయన్ స్వయంగా `ది లిప్ బామ్` కంపెనీని స్థాపించింది. 100 కంటే ఎక్కువ వేరియంట్‌లను కలిగి ఉన్న ఈ బ్రాండ్ భారతదేశ చర్మ సంరక్షణ రంగంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. నయన్ UAE చమురు పరిశ్రమలో పెట్టుబడి పెట్టింది. ఈ కంపెనీ విలువ దాదాపు రూ. 100 కోట్లకు చేరుకుందని తెలుస్తోంది. అలాగే చెన్నైలోని ఒక పాపులర్ స్నాక్-అండ్-టీ చైన్ లో వాటాను సంపాదించింది. నయన్ కేవలం నటిగానే కాదు ఎంటర్ ప్రెన్యూర్ గాను తెలివిగా ఆలోచించడం ఆకట్టుకుంటోంది.
కెరీర్ పరంగా నయన్ నాలుగు చిత్రాలతో బిజీగా ఉంది. మన్నంగట్టి సిన్స్ 1960, టాక్సిక్, కిస్, రాకాయి వంటి భారీ చిత్రాలలో నటిస్తోంది. సూపర్ స్టార్ గా, తలైవిగా గౌరవం అందుకున్న నయనతారను `ది రీనైనింగ్ క్వీన్ ఆఫ్ ఇండియన్ సినిమా` అని గౌరవిస్తున్నారు. ది గ్రేట్ నయన్ నిజంగా లేడీ సూపర్‌స్టార్ బిరుదుకు ఎందుకు అర్హురాలో ఇప్పుడు అర్థమైంది కదా!
