నయన్ అందుకే రాజీ పడిందా?
సౌత్ ఇండియాలో బాగా బిజీగా ఉండే హీరోయిన్ లలో నయనతార కూడా ఒకరు. ఎంతలేదన్నా సంవత్సరానికి నాలుగైదు సినిమాలు చేస్తూ నయనతార బిజీగా ఉంటుంది.
By: Tupaki Desk | 23 May 2025 7:00 PM ISTసౌత్ ఇండియాలో బాగా బిజీగా ఉండే హీరోయిన్ లలో నయనతార కూడా ఒకరు. ఎంతలేదన్నా సంవత్సరానికి నాలుగైదు సినిమాలు చేస్తూ నయనతార బిజీగా ఉంటుంది. ఎక్కువ సినిమాలు చేయడమే కాదు, సౌత్ లో ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్ గా కూడా నయనతారకు పేరుంది. అయితే గత కొన్నాళ్లుగా నయన్ చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడింది లేదు.
దీంతో ఇప్పుడు నయనతార డిమాండ్ కాస్త తగ్గిందనే చెప్పాలి. దానికి తోడు నయన్ కు 40 ఏళ్లు దాటాయి. అందుకే గత కొన్నేళ్లుగా నయన్ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు కూడా దూరంగా ఉంటూ వస్తుంది. అలాంటి నయన్ ఇప్పుడు తాజాగా మెగాస్టార్ చిరంజీవి పక్కన హీరోయిన్ గా నటిస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తోన్న మెగా157లో నయనతారను హీరోయిన్ గా పరిచయం చేస్తూ రీసెంట్ గా ఓ అనౌన్స్‌మెంట్ కూడా ఇచ్చారు మేకర్స్.
నయనతార చాలా కాలం తర్వాత చేస్తున్న తెలుగు సినిమా ఇది. ఈ సినిమాకు గానూ నయనతార మొదట్లో రూ.12 కోట్లకు పైగా డిమాండ్ చేసిందట. మేకర్స్ అంత మొత్తంలో రెమ్యూనరేషన్ ఇచ్చే ఉద్దేశం లేక వేరే హీరోయిన్ ను వెతకడం మొదలుపెట్టడంతో చివరకు నయనతారే దిగి వచ్చి ఈ సినిమాను రూ.6 కోట్లకు చేయడానికి ఒప్పుకుందట.
నయనతార రీసెంట్ టైమ్స్ లో ఒప్పుకున్న సినిమాల్లో అతి తక్కువ రెమ్యూనరేషన్ ఈ సినిమాకేనని చెప్పడంలో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. అంతేకాదు తన కెరీర్లో ఏ సినిమా ప్రమోషన్స్ కు హాజరవని నయనతార ఈ సినిమాను ప్రమోట్ చేస్తానని కూడా మాటిచ్చిందట. నయన్ ను ప్రమోషన్స్ కు ఒప్పించిన విషయంలో డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రశంసలు కూడా అందుకున్నాడు.
నయన్ ను ప్రమోషన్స్ కు ఒప్పించానని చెప్పడానికి సింబాలిక్ గానే అనిల్ రావిపూడి ఆమెను సినిమాలో హీరోయిన్ గా అనౌన్స్ చేస్తూ ఓ వీడియోను కూడా షూట్ చేసి రిలీజ్ చేశాడు. అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలుకానుండగా, ఈ సినిమాను సాహు గారపాటి మరియు చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల నిర్మిస్తుండగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. మెగా157పై అందరికీ భారీ అంచనాలున్నాయి.
