నయన్ కష్టం దాని కోసమేనా?
అయితే టెస్ట్ మూవీలో నయన్ కాస్త బరువు పెరిగిందని ఆమె ఫ్యాన్స్ భావిస్తూ సోషల్ మీడియాలో వేదికగా కామెంట్స్ చేశారు.
By: Tupaki Desk | 8 May 2025 4:24 PM ISTలేడీ సూపర్ స్టార్ నయనతారకు ఉన్న ఫాలోయింగ్, ఫ్యాన్ బేస్ అంతా ఇంతా కాదు. ఆమె ఏదైనా ఒక ఫోటోను పోస్ట్ చేసిందంటే ఎవరూ అంత ఈజీగా దాన్ని స్క్రోల్ చేయలేరు. ఆ ఫోటో దగ్గరకు వచ్చి ఆగిపోతారు. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేయకపోయినా చేసినప్పుడు మాత్రం ఆమె పోస్ట్‌లు నిమిషాల్లోనే వైరల్ అవుతుంటాయి.
అదీ నయనతార స్పెషాలిటీ. సౌత్ లో పలు భాషల్లో సినిమాలు చేసిన నయనతార ఇప్పుడు తాజాగా తన సోషల్ మీడియాలో ఓ జిమ్ ఫోటోను షేర్ చేయగా ఆ ఫోటో ప్రస్తుతం అందరి దృష్టినీ ఆకర్షిస్తుంది. రీసెంట్ గా మాధవన్, సిద్ధార్థ్ తో కలిసి నెట్‌ఫ్లిక్స్ కోసం టెస్ట్ సినిమా చేసిన నయన్ ఆ సినిమా మొత్తం చీరల్లోనే కనిపించింది.
అయితే టెస్ట్ మూవీలో నయన్ కాస్త బరువు పెరిగిందని ఆమె ఫ్యాన్స్ భావిస్తూ సోషల్ మీడియాలో వేదికగా కామెంట్స్ చేశారు. ఆ విషయం నయన్ దృష్టికి వెళ్లిందో ఏమో కానీ ఇప్పుడు ఆమె అల్ట్రా ఫిట్ అవతారంలో కనిపించే జిమ్ లుక్ ను షేర్ చేసి తన ఓల్డ్ వైబ్ ను బయటపెట్టింది. నయన్ షేర్ చేసిన ఫోటోలో బ్లాక్ కలర్ జిమ్ వేర్ లో ఎంతో హాట్ గా, కాన్ఫిడెంట్ గా కనిపించింది.
ఈ ఫోటోలో నయన్ మళ్లీ తాను టీనేజ్ లో కనిపించినట్టు స్లిమ్ లుక్ లో కనిపించింది. ఈ ఫోటోను బట్టి చూస్తుంటే నయనతార మళ్లీ తాను కెరీర్లో ఫామ్ లోకి వచ్చి పుంజుకోవాలని చూస్తున్నట్టు స్పష్టమవుతుంది. ఇదిలా ఉంటే నయనతార, చిరంజీవి- అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో హీరోయిన్ గా నటించనుందని టాలీవుడ్ లో వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటివరకు దానికి సంబంధించిన అధికారిక ప్రకటన రాలేదు. నయన్ జిమ్ కు వెళ్లి ఇంత స్లిమ్ గా తయారైంది కూడా చిరూ- అనిల్ సినిమా కోసమేనని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి అందులో నిజమెంతన్నది తెలియాల్సి ఉంది.
