Begin typing your search above and press return to search.

లేడీ సూప‌ర్ స్టార్ త‌గ్గ‌డానికి కార‌ణం అదా?

లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార మెగాస్టార్ చిరంజీవి 157వ సినిమా ప్ర‌మోష‌నల్ వీడియో తో స‌ర్ ప్రైజ్ చేసిన సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   30 May 2025 12:30 PM
లేడీ సూప‌ర్ స్టార్ త‌గ్గ‌డానికి కార‌ణం అదా?
X

లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార మెగాస్టార్ చిరంజీవి 157వ సినిమా ప్ర‌మోష‌నల్ వీడియో తో స‌ర్ ప్రైజ్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఓసినిమాకు సంబంధించి న‌య‌న్ ఇలా ప్ర‌చారంలో పాల్గొన‌డం చూసి కొన్ని సంవ‌త్స రాల‌వుతుంది. తాను స్టార్ గా ఎదిగిన త‌ర్వాత ప్ర‌చారం అనే ప‌దాన్ని త‌న డిక్ష‌న‌రీ నుంచి తొల‌గించింది. ప్ర‌చారం కోస‌మే అద‌నంగా పారితోషికం చెల్లిస్తామ‌న్నా నోవే అంటూ కొన‌సాగింది. కానీ 157వ సినిమా మొదలు కాక‌ముందే ప్ర‌మోష‌న‌ల్ వీడియోతో ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డంతో అంతా ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

న‌య‌నతార ఇలా ప్ర‌చారంలో పాల్గొందా? అని మాట్లాడుకుంటున్నారు. ఇక‌పై అన్ని సినిమాల ప్ర‌చారా ల‌కు న‌య‌న్ హాజ‌ర‌వుతుందా? అన్న చ‌ర్చ కూడా సాగుతుంది. మ‌రి న‌య‌న్ ప్ర‌చారంలో పాల్గొన‌డం వెనుక అస‌లు కార‌ణాలు ఏంటి? అన్న‌ది ఇంత‌వ‌ర‌కూ బ‌య‌ట‌కు రాలేదు. అయితే తాజాగా న‌య‌న్ ప‌బ్లిసిటీ వెనుక ఓ రీజ‌న్ వైర‌ల్ అవుతుంది. హీరోయిన్ల మ‌ధ్య పోటీ పెర‌గ‌డంతో న‌య‌న్ ప్ర‌చారం పై ఉన్న కండీష‌న్ తొల‌గించిందంటున్నారు.

ముఖ్యంగా సౌత్ భామ‌ల నుంచి పోటీ తీవ్ర మ‌వ్వ‌డంతో ఇదే కొన‌సాగితే అవ‌కాశాల‌పై ప్ర‌భావం ప‌డుతుం ద‌నే భ‌యంతో నయ‌న్ ఓ మెట్టు కింద‌కు దిగిన‌ట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. పైగా వాళ్లంతా అద‌నంగా ఎలాంటి పారితోషికం తీసుకో కుండానే ద‌ర్శక‌, నిర్మాత‌ల‌కు అన్ని ర‌కాలుగా అందుబాటులో ఉంటున్నారు. హీరోయిన్ల మ‌ధ్య ప‌రిస్థితులు కూడా మునుప‌టిలా లేవు. ఓవ‌ర్ నైట్ లో నే స్టార్ అవుతున్నారు.

ఆ స్టార్ డ‌మ్ ని తెలివిగా కొన సాగిస్తున్నారు. అందుకు ప్ర‌చారాన్ని ఆయుధంగా వినియోగిస్తున్నారు. ర‌ష్మిక మంద‌న్న బాలీవుడ్ లో కేవ‌లం రెండు సినిమా స‌క్సెస్ తోనే ఫేమ‌స్ కాలేదు. అక్క‌డ క‌ల్చ‌ర్ కు త‌గ్గ‌ట్టు మౌల్డ్ అయింది. ప్ర‌చారం ప‌రంగా అక్క‌డ ఎలాంటి అనుకూల వాతావ‌ర‌ణం క‌ల్పించాలో? క్రియేట్ చేసి ఓ స్ట్రాట‌జీతో వెళ్లింది. ఇది వ‌ర్కౌట్ అవ్వ‌డం అమ్మ‌డికి క‌లిసొచ్చింది. ఇదే త‌ర‌హాలో మిగ‌తా సౌత్ భామ‌లు ప‌బ్లిసిటీ విష‌యంలో ముందుంటున్నారు. రాబోయే రోజుల్లో ప‌రిస్థితులు మ‌రింత మారు తాయి. వీట‌న్నింటిని నయ‌నతార ప‌సిగ‌ట్టే అలెర్ట్ అయిన‌ట్లు క‌నిపిస్తుంది.