Begin typing your search above and press return to search.

ఇటలీలో సూపర్ స్టార్ సోయగాలు.. సమ్మర్ లో చిల్ అవుతూ!

ఇక నయనతార విషయానికొస్తే.. ఇండస్ట్రీకి వచ్చి దాదాపు రెండు దశాబ్దాలకు పైగానే అవుతున్నా వరుస విజయాలను సొంతం చేసుకుంటూ మరింత బిజీగా మారిపోయింది.

By:  Tupaki Desk   |   16 May 2026 3:26 PM IST
ఇటలీలో సూపర్ స్టార్ సోయగాలు.. సమ్మర్ లో చిల్ అవుతూ!
X

సౌత్ లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార నిత్యం సినిమా షూటింగ్ లతో అటు కుటుంబ బాధ్యతలతో తలమునకలవుతున్న విషయం తెలిసిందే.అయితే వీటన్నింటికి కాస్త గ్యాప్ ఇస్తూ సమ్మర్ వెకేషన్ లో భాగంగా ఇటలీకి వెళ్ళింది ఈ ముద్దుగుమ్మ. ఫ్యామిలీతో కలిసి ఒక రిసార్ట్ కు వెళ్ళిన ఈమె అక్కడి అందాలను చూసి మంత్ర ముగ్దురాలయింది. ఇక అందులో భాగంగానే అక్కడి సౌందర్యాలను అభిమానులతో పంచుకుంటూ తాను కూడా గ్లామర్ లుక్కులో కనిపించి అభిమానులను ఆకట్టుకుంది.

అసలు విషయంలోకి వెళ్తే .. సమ్మర్ వెకేషన్ లో భాగంగా ఇటలీ వెళ్లిన నయనతార..బ్లాక్ పోల్కా డాట్ కలిగిన వైట్ ఆహ్వాన్ ఏ - లైన్ మ్యాక్సీ డ్రెస్ ధరించి తన అందాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. జుట్టును ముడి వేసి లావెండర్ కలర్ పువ్వుల దగ్గర వాటి వాసనను ఆస్వాదిస్తూ చాలా క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో అందరి దృష్టిని ఆకట్టుకుంది నయనతార. ఇక తాజాగా ఇటలీ వెళ్లిన ఈమె అక్కడ చిల్ అవుతూ షేర్ చేసిన ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

ఇక నయనతార విషయానికొస్తే.. ఇండస్ట్రీకి వచ్చి దాదాపు రెండు దశాబ్దాలకు పైగానే అవుతున్నా వరుస విజయాలను సొంతం చేసుకుంటూ మరింత బిజీగా మారిపోయింది. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా హీరోయిన్గా అవకాశాలు అందుకుంటూ బిజీగా మారుతూ.. తన సినిమాలతో అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఇకపోతే ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి సరసన మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాలో హీరోయిన్గా నటించి తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో మరొకసారి అందరి దృష్టిని ఆకట్టుకుంది నయనతార

ఇక ప్రస్తుతం గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో యష్ హీరోగా నటిస్తున్న టాక్సిక్ సినిమాలో నయనతార నటిస్తోంది. హీరో యష్ కి సోదరి పాత్ర పోషిస్తుంది ఈ ముద్దుగుమ్మ. పాన్ ఇండియా చిత్రంగా రాబోతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక అలాగే వేణు ఉదయకుమార్ దర్శకత్వం వహించిన రాజకీయ థ్రిల్లర్ మూవీ పేట్రియాట్ లో కూడా నటించింది. ఇందులో మమ్ముట్టి, మోహన్ లాల్ ఇద్దరు ప్రధాన పాత్రలు పోషించారు.. ఇక ఈ చిత్రంతో పాటు 2020లో మంచి విజయం అందుకున్న భక్తి రస ఫాంటసీ కామెడీ మూవీ మూకుత్తి అమ్మన్ సినిమాకి సీక్వెల్ గా మూకుత్తి అమ్మన్ 2లో కూడా నటిస్తోంది. ఈ చిత్రానికి సుందర్ . సి దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే యాక్షన్ డ్రామాగా వస్తున్న లేడీ ఓరియంటెడ్ మూవీ రక్కయి చిత్రంలో కూడా నయనతార నటిస్తోంది.

అలాగే ప్రియమైన విద్యార్థులారా అనే ఒక మలయాళ సిరీస్ లో నటిస్తోంది. నివిన్ పౌలీ హీరోగా నటిస్తున్నారు. అలాగే డ్యూడ్ ఫేమ్ విక్కీ దర్శకత్వం వహిస్తున్న ఫాంటసీ డ్రామా మన్నంగట్టి అనే చిత్రంలో కూడా నటిస్తోంది. ఇక దీంతో పాటు మరికొన్ని చిత్రాలలో ఈమె నటిస్తోంది.