రావిపూడి మామూలోడు కాదు.. నయన్‌తో రూల్స్ బ్రేక్!
మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్‌బస్టర్ హిట్ మేకర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘మెగా157’ సినిమా టాలీవుడ్‌లో భారీ బజ్ క్రియేట్ చేస్తోంది
By: Tupaki Desk | 17 May 2025 12:03 PM ISTమెగాస్టార్ చిరంజీవి, బ్లాక్‌బస్టర్ హిట్ మేకర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘మెగా157’ సినిమా టాలీవుడ్‌లో భారీ బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా 2026 సంక్రాంతికి గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతుండగా, షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, సుష్మిత కోనిదెల నిర్మిస్తున్నారు. గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో, అర్చన ప్రెజెంట్ చేస్తున్న ఈ ప్రాజెక్టులో చిరంజీవిని మళ్లీ ఫుల్‌లెంగ్త్ కామెడీ పాత్రలో చూపించనున్నారు. ఈ కాంబో ఇప్పటికే అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా చేరడం మరో ఆసక్తికర అంశం. ‘సైరా నరసింహ రెడ్డి’, ‘గాడ్‌ఫాదర్’ తర్వాత చిరంజీవితో నయనతార మూడోసారి జతకడుతోంది. అయితే, అనిల్ రావిపూడి ప్రమోషన్స్‌లో నయనతారను కూడా భాగం చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. నయనతార షూటింగ్‌లో పాల్గొన్నప్పటికీ, సాధారణంగా ప్రమోషన్స్‌లో పాల్గొనదని అందరికీ తెలిసిన విషయమే. కానీ, అనిల్ ఈసారి ఆ రూల్‌ను బ్రేక్ చేస్తూ నయనతారను ప్రమోషన్స్‌లో హైలైట్ చేసేలా చేశాడు.
ఇటీవల విడుదలైన ఓ ప్రమోషనల్ వీడియోలో నయనతార తన స్టాఫ్‌తో తెలుగులో మాట్లాడుతూ, కార్‌లో చిరంజీవి క్లాసిక్ సాంగ్స్ వింటూ, స్క్రిప్ట్ చదువుతూ, చిరంజీవి ఐకానిక్ డైలాగ్‌ను చెప్పడం కనిపిస్తుంది. చివర్లో అనిల్ రావిపూడి ఆమెతో కలిసి కనిపించి, నయనతార ఈ సినిమాలో భాగమైనట్లు అధికారికంగా ప్రకటించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, “రావిపూడి మామూలోడు కాదు స్వామి, నయన్‌తో కూడా ప్రమోషన్స్ చేయించాడు” అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఈ సినిమా కోసం అనిల్ రావిపూడి నయనతారకు ఓ స్పెషల్ రోల్‌ను డిజైన్ చేశారని, ఇది ఆమెకు రిఫ్రెషింగ్‌గా, మరపురాని పాత్రగా ఉంటుందని టాక్ నడుస్తోంది. చిరంజీవి, నయనతార జోడీ ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ అభిమానులకు విజువల్ ట్రీట్‌గా నిలవనుందని అంటున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ ప్రారంభం నుంచి ఆకర్షణీయంగా సాగుతున్నాయి, షూటింగ్ మొదలవకముందే ఈ హైప్ సినిమాపై అంచనాలను పెంచుతోంది.
సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, భీమ్స్ సిసిరోలియో సంగీతం, తమ్మిరాజు ఎడిటింగ్‌తో ఈ సినిమా టెక్నికల్‌గా బలంగా ఉంటుందని టాక్. ఎస్ కృష్ణ, జి. ఆది నారాయణ రాసిన స్క్రిప్ట్‌తో, ఎస్ కృష్ణ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు. ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నాడు. మొత్తంగా, ‘మెగా157’ సినిమా సంక్రాంతి 2026లో “రఫ్ఫాడించేద్దాం” అనే నినాదంతో రాబోతుంది. అనిల్ రావిపూడి ప్రమోషనల్ స్ట్రాటజీ, నయనతార ఎంట్రీతో ఈ సినిమా ఇప్పటినుంచే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మరి ఈ కాంబో ఎలాంటి మ్యాజిక్ సృష్టిస్తుందో చూడాలి.
