ఫ్లైట్ లో నయన్ స్పెషల్ వీడియో.. నెట్టింట వైరల్
సిల్వర్ స్క్రీన్ పై నయనతార స్టార్ హీరోయినే కావొచ్చు, లేడీ సూపర్ స్టారే కావొచ్చు. కానీ రియల్ లైఫ్ లో మాత్రం నయన్ ఇద్దరు పిల్లలకు తల్లి.
By: Tupaki Desk | 20 May 2025 3:24 PM ISTసిల్వర్ స్క్రీన్ పై నయనతార స్టార్ హీరోయినే కావొచ్చు, లేడీ సూపర్ స్టారే కావొచ్చు. కానీ రియల్ లైఫ్ లో మాత్రం నయన్ ఇద్దరు పిల్లలకు తల్లి. రీల్ లైఫ్ లోనూ, రియల్ లైఫ్ లోనూ ఎంతో సింపుల్ గా ఉండే నయనతార రీసెంట్ గా తన ఫ్యామిలీతో వెకేషన్ కు వెళ్లింది. ఈ సందర్భంగా నయన్ భర్త విఘ్నేష్ శివన్ షేర్ చేసిన ఓ వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
ఈ వీడియోలో నయనతార తన ఇద్దరు కవలలతో ఎంజాయ్ చేస్తూ, వారిని ఎంటర్టైన్ చేయడానికి విమానం కిటికీలోంచి బయటకు చూపిస్తూ మల్టీ టాస్కింగ్ చేస్తూ చాలా సాధారణ తల్లిగా కనిపించింది. కేవలం ఆ సీన్ మాత్రమే కాదు, ఆ వీడియోలో నయన్ చాలా నేచురల్ గా ఉండటం అందరినీ ఆకర్షించింది. అందులో నయనతార ఎలాంటి గ్లామర్ లుక్ లో లేకుండా పిల్లలను ఆడిస్తూ అలసిపోయినట్టు అనిపిస్తోంది.
40 వేల అడుగుల ఎత్తులో ఇంటి నుంచి తెచ్చిన బిర్యానీ, నాటు కోడి.. లైఫ్ ను మరింత ఎంజాయ్ చేసినట్టు చేస్తుందని, ఇది తమ వెకేషన్ టైమ్ అని ఈ వీడియోను నయనతార కూడా పోస్ట్ చేసింది. అంతే కాదు, ఈ వీడియో ద్వారా నయన్.. ప్రయాణ ఒత్తిడి, తల్లిదండ్రుల ఎఫర్ట్, ఫ్యామిలీ లైఫ్ ను ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలనేది కూడా తెలియచేసింది.
మామూలుగా కూడా నయన్, విఘ్నేష్ వెకేషన్స్ కు వెళ్లి అక్కడి నుంచి ఫోటోలను షేర్ చేస్తూ ఉన్నప్పటికీ ఈసారి షేర్ చేసిన ఈ ఫ్లైట్ వీడియో కాస్త ప్రత్యేకంగా మారింది. పేరెంటింగ్ అనేది ఎవరికైనా కష్టమేనని, అది రెడ్ కార్పెట్స్ మీద ఉండేవారికైనా, ఎంత స్టార్ట కైనా అని ఈ వీడియో చూస్తుంటే అర్థమవుతుంది. స్నాక్స్, స్క్రీన్ టైమ్, విండో గేమ్స్ ఇందులో ఏదీ నయన్ పిల్లల్ని కూల్ చేయలేదు. వారంత అల్లరి చేస్తున్నప్పటికీ నయనతార మాత్రం తన ప్రశాంతతను కోల్పోకుండా ఎంతో ఓపికగా వారిని మేనేజ్ చేసుకుంటూ కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా, దాన్ని చూసి కొందరు కామెంట్స్ చేస్తున్నారు. పిల్లలు మేల్కొనప్పుడే తల్లిదండ్రులకు ఫ్లైట్ లో అసలైన డ్రామా మొదలవుతుందని ఈ వీడియోను చూసి కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
