అదే నిజమైతే వాళ్లిద్దరు ఓ చరిత్ర!
ఇంత వరకూ టాలీవుడ్ లో ఏ హీరోయిన్ కు 20 కోట్ల వరకూ పారితోషికం చెల్లించలేదు.
By: Tupaki Desk | 17 May 2025 3:00 PM ISTఇంత వరకూ టాలీవుడ్ లో ఏ హీరోయిన్ కు 20 కోట్ల వరకూ పారితోషికం చెల్లించలేదు. స్టార్ డమ్ ఉన్న భామ లెంతో మంది పనిచేసారు. ఏ నాయికకు ఆ రేంజ్ లో రెమ్యునరేషన్ చెల్లించలేదు. లేడీ ఓరియేంటెడ్ చిత్రాలు చేసిన భామల విషయంలో కూడా దర్శక-నిర్మాతలు ఆ ఛాన్స్ తీసుకోలేదు. అవకాశం ఎరగా వేసి కాసులు వాళ్ల జేబుల్లో చేరాయి తప్ప! ఏ హీరోయిన్ కు అంత సీన్ ఇవ్వలేదు.
అయితే ఓ ఇద్దరు భామల విషయంలో టాలీవుడ్ తగ్గుతున్నట్లు కనిపిస్తుంది. ఆ భామలిద్దరు డిమాండ్ చేసినంత చెల్లించడానికి వెనకడుగు వేయడం లేదుట. ఇంతకీ ఎవరా భామలు? ఏ సినిమా కోసం అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. చిరంజీవి 157వ చిత్రం అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్ గా లేడీ సూపర్ స్టార్ నయనతారను తీసుకున్నారు.
ఈ క్రమంలో అమ్మడు 18 కోట్ల వరకూ పారితోషికం డిమాండ్ చేస్తుందనే ప్రచారం జోరుగా సాగుతుంది. అలాగే 'స్పిరిట్' సినిమా కోసం బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణే కి సందీప్ టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో దీపిక కూడా 20 కోట్ల వరకూ డిమాండ్ చేస్తుందని ప్రచారంలో ఉంది. ఇంతవరకూ టాలీవుడ్ లో పనిచేసిన ఏ నటికి ఈ రేంజ్ లో పారితోషికం ఇవ్వలేదు. అలా డిమాండ్ చేసిన వారిని బ్లాక్ లిస్ట్ లో పెట్టేవారు.
అవకాశం ఇవ్వాలంటే డిమాండ్లను పరిగణలోకి తీసుకుని మేకర్స్ టచ్ లో కి వెళ్లాలా? వద్దా? అని నిర్ణయిం చుకునేవారు. కానీ నయన్ తార విషయంలో చిరు-అనీల్ మాత్రం వెనక్కి తగ్గడానికి బధులు ముందుకే మూవ్ అవుతున్నట్లు వినిపిస్తుంది. అటు దీపిక విషయంలో సందీప్ రెడ్డి వంగా కూడా ఎక్కడా వెనక్కి తగ్గనట్లు వినిపిస్తుంది. మరి ఇద్దరు డిమాండ్ చేసినంత నిర్మాతలు చెల్లిస్తే గనుక టాలీవుడ్ లో ఇదో చరిత్ర అవుతుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు.
